ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇద్దరు ఆర్మీ అధికారులపై ఫిర్యాదు-రూ. 2.5 లక్షలు లంచం డిమాండ్-పోలీసు కస్టడీ

పూణే 17.11.2021: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రూ.50,000/- లంచం తీసుకున్న కేసులో ఆర్మీలో హవల్దార్ స్థాయి ఇద్దరు అధికారులను అరెస్టు చేసింది.

పూణేలోని సదరన్ కమాండ్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ అధికారులపై ఫిర్యాదు పైన ప్రాధమిక విచారణ లో భాగముగా  కేసు నమోదు చేయబడింది. పూణేలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ నిర్వహించిన పరీక్షలో ఫిర్యాదుదారు MTS పోస్ట్‌కు ఎంపికయ్యారని మరియు  కాల్ లెటర్ అందుకున్నారు, అతను నవంబర్ 19, 2021లో లేదా అంతకు ముందు వార్ధా (మహారాష్ట్ర)లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేరవలసియున్నది. ఫార్మాలిటీస్‌లో త్వరగా చేరాలనే నెపంతో , నిందితులు ఫిర్యాదుదారు యొక్క ఒరిజినల్ కాల్ లెటర్‌ను తీసుకొని రూ. 2.5 లక్షలు లంచం డిమాండ్ చేసారు, అందులో భాగముగా  రూ. 50,000/- ఒక్కసారి, మరియు రూ.30,000/- ఒక్కసారి ఫోన్ పే ద్వార ఫిర్యాదుదారు సదరు అధికారులకు చెల్లించాడు . తదనంతరం, నిందితులిద్దరూ మిగిలిన సొమ్ము  రూ. 20,000/-  స్వీకరించడానికి వచ్చారు. రంగం లోకి దిగిన సిబిఐ ఒక ప్రణాళిక ప్రకారం,  ఉచ్చు వేసి, నిందితులు  డిమాండ్ చేసి, లంచం తీసుకునేటప్పుడు  పట్టుకుంది.

పూణెలోని నిందితుల ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, కేసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులిద్దరినీ ఈరోజు పూణేలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు ముందు హాజరుపరచగా ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

In Association with