ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆ ఏడుపు అప్పుడు ఎందుకు ఏడవలేకపోయారు ?


రాజకీయాలు గోద్రాలో అమాయక స్త్రీలనీ పసిపిల్లలనీ కత్తులతో పాశవికంగా నరికినప్పుడు

ఏకంగా బతికున్న మనుషులతో సహా రైలునే మంటల్లో ముంచెత్తినప్పుడు రాని ఏడుపు

ఆర్టికల్స్


ఒకాడప్రధానిని పేదప్రజల పక్షం వహించిందనీ వేర్పాటవాదులకి అడ్డముగా నిలబడిందని అంగరక్షకులు వేలగుళ్ళతో తూట్లు తుట్లుగా కాల్చి చంపినప్పుడు రాని ఏడుపుక్రైమ్ 


దేశ ప్రయోజనాలకోసం నిలబడ్డ అమెకొడుకుని సాక్షాత్తూ దేశాధినేతనీ  బాంబులతో ఛిధ్రం చేసినప్పుడు రాని ఏడుపు

సినిమాలు నాలుగు మంచిమాటలు చెప్పడానికి పరాయిదేశం వచ్చిన గ్రహం స్టెయిన్ ని మతమూకలు కుటుంబంతో సహా నిలువునా కట్టేసి కాలుస్తున్నప్పుడు రాని ఏడుపు


ఇళ్ళలో పదిలంగా దాచుకున్న నోట్లని అమాంతం రద్దుచేసి  చేతుల్ని ఖాళీ చేసి బతుకు బూడిదచేసి ఎక్కౌంట్లని ఎండగట్టి డొక్కల్ని మాడబెట్టి బతుకుల్ని కుంగదీసి బ్యాంకులముందు రోజులతరబడి నిలబెట్టినప్పుడు రాని ఏడుపు


దేశంలో నలభై కోట్లమంది వలసకార్మికులు ఎలాంటి సహాయం లేకుండా తిండిగింజల కోసం అలమటించి రైలుపట్టాలపై మట్టి పెళ్ళలపై చెరువు నెర్రలపై రక్తపు పర్రలపై ఎండిన ఆకులపై చెట్ల కొమ్మలపై తారు రోడ్లపై పొట్ట పాట్లతో ఛస్తున్నప్పుడు రాని ఏడుపు


పౌష్టికాహార లోపంతో తాగునీటి లేమితో ఆకలితో అలమటిస్తూ పేగు చుట్టుకునిపోయి నోరు మట్టికొట్టుకొనిపోయి ఏటా కోటిమంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే రాని ఏడుపుఆసుపత్రులలో నువ్వు ఆక్సిజను పెట్టించకపోవడం వలన మాత్రమే  బలవంతంగా లక్షలకొలదీ చిన్నారులు

గిలగిలలాడుతూ చనిపోతున్నప్పుడు రాని ఏడుపుకాష్మీర్లో ప్రజలకి ఆహారం నీరు ఇంటర్నెట్ కరంట్ సరఫరా బందుపెట్టినప్పుడు ఆకలి హాహాకారాలు 

చేస్తూ చనిపోతున్నప్పుడు రాని ఏడుపు
అమ్మేసిన పరిశ్రమల వలన ఉపాధి కోల్పోయిన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రాని ఏడుపుకేవలం ఇతరమతాల పిల్లలు చదువుతున్నారనే దుగ్ధతో జామియా కాంపస్ లో చదువుకుంటున్న విద్యార్థులని నీ మూకలు పోలీసుల వేషంలో ఊచకోత కోస్తున్నపుడురాని ఏడుపు

కరోనా వలన ఉపాధీ కోల్పోయి చేతిలో దమ్మిడీలేక ఇంట్లో సరుకులు లేక ఒంట్లో సత్తువ లేక  ప్రభుత్వ తోడ్పాటు లేక చేయడానికి పనీలేక  చచ్చే దారీలేక బతుకుఈడుస్తూ చావుబతుకుల మద్య కునారిల్లుతున్న 

యావత్ భారతాన్ని చూసినా రాని ఏడుపుదేశప్రజలందరి ఆహారాన్నీ కార్పోరేట్లకి ధారాధత్తం చేసి చట్టాలకి వ్యతిరేకంగా కదిలిన 

కోట్లాది రైతులని శరిరాలని చీల్చేసే ముళ్ళకంపలు అడ్డుపెట్టి కాలికింద మేకులు గుచ్చి  కరంటు ఇంటర్నెట్ ఆహారం నీటి సరఫరాతో పాటుగా శౌచాలయాలని కూడా పగలగొట్టి వారి పిల్లలని ట్రాక్టర్లతో చంపి

కుటుంబాలు కుటుంబాలతొ సహా నెలల కొద్దీ రొడ్లపై ఉండేలా చేసి నిరంకుశ చట్టాలను రుద్దినప్పుడు రాని ఏడుపుకేవలం ఒక ఎంపి పదవీకాలం ఐపోతేనే

ఒక ఇతరపార్టీ పైనే ఇంతటి అవాజ్య ప్రేమని చూపించేంత వికారపుఏడుపు

చూసి ఈ నిస్సహాయ భారతదేశం తట్టుకోగలదా జహాపనా

For English Version