
దేశం మొత్తం అల్లరి అయ్యే విధముగా రాజధాని " మార్పు " అనే అంశాన్ని తేర మీదకు తీసుకోని వచ్చారు. విశాఖ లోని ఒక బహిరంగ సభ లో అధికార పార్టీ నాయకుడికి అవమానం ఎదురు అయ్యే సరికి వెంటనే రాజధాని - వికేంద్రికరణ అనే విషయాన్ని తేర మీదకు తీసుకోని వచ్చారు, ఈ వికేంద్రికరణ లో విశాఖ కు ఉన్నత స్థానం ఇచ్చారు.
కానీ ఏ ఒక్క ప్రకటన కూడా కార్యరూపముదల్చలేదు. మధ్యలో కియా బదలాయింపు అనే అంశం పైన వార్త సంస్థల చర్చలు, కట్ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు, మళ్ళి కట్ చేస్తే అవి వాయిదా , ఇంకా సీన్ లో కి వెళ్ళితే అదే మంత్రం ఎన్నికల వాయిదా వెనుక " కమ్మవారి కుట్ర " అనే స్టేట్మెంట్ లు .
రాజధానిలో విషయములో అక్కరలేని వ్యతిరేకత పాలక వర్గం తెచ్చుకుంది అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికి తెలిసిన రహస్యమే. వ్యతిరేకత లేదు అని ఎవరికి వారు తెల్చిచేప్పటానికి ఎవరిని ఎవరు ఓదర్చుకోవటం లేదు ఎవరిని ఎవరు ఎవరిని సమర్దిన్చుకోవటం లేదు .
* ప్రతిపక్షం బాలహినముగా ఉన్న సమయములో ఓట్లు వేసి గెలిపించిన రాజధాని పరిధి ప్రజలు ఆశలు నిరాశ చేస్తూ ప్రతిపక్షాన్ని రాజధాని ప్రాంతం వరుకు మళ్ళి బలపరిచిన నిర్ణయాలు గురించి వేరే చర్చించనవసరం లేదు అనే చెప్పాలి.
* అంబానీ కుటుంబం తో సన్నిహితం రకరకాల అనుమానాలకి తవునిస్తుంది అదే విషయాన్ని టి డి పి విమర్శస్త్రముగా అధికార పార్టీ మిద సంధించింది.
* ఇసుక విషయములో కార్మికులకి ప్రతిపక్షాన్ని చేరువుచేసింది ?
* నామినేషణలు విషయములో చేసిన దౌర్జన్యాలు బహిర్గతం అవ్వటం, వయస్సు ఉడికిన పెద్దాయన తోడకోట్టడం సోషల్ మీడియా లో వైరల్ అవటం తో చివరికి సానుభూతి విషయంలో కూడా ప్రతిపక్షానికి పాలకపక్షం ఉపయోగపడింది అని చెప్పాలి.
* ఇంకా ఇంటి పోరు ఎక్కడికి దారితీస్తుంది అనేది చెప్పలేము, అసమ్మతికి సాక్ష్యాలు లేకపోవటము వలన విశ్లేషించలేము కానీ సెగ మాత్రం ఏదో ఒక రోజు జ్వలించ వచ్చు అనే చెప్పాలి.
* ఇళ్ళ స్థలాల విషయము లో అందరు అనుకునే స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే! పంట పండించేది రైతు ఒక్కడు, అదే చోట ఇళ్ళ స్థలాలు పది మందికి పంచితే ఓటు బ్యాంకు పెరుగుతుంది - నిజమేనా ? ఒక వేళా ఇలాగె జరిగి ఉంటె అ స్ట్రాటజీలే వర్క్ అవుట్ అయ్యి ఉంటె పోయిన ఎన్నికల ఫలితాలు వేరుగా ఉంటాయి అనే చెప్పాలి.
ఏ పార్టీ అధికారములో ఉంటె అ పార్టీ లోకి వలసలు సాధారణముగా జరిగే విషయాలే కానీ పరిణామాలు తట్టుకోలేని వారు పార్టీ మారిన, మారకపోయినా వారి మదిలో ఉన్న అభిమానం చెక్కు చెదరదు. ఇక్కడ పరిపాలన లో మార్పు అంటే " ఇప్పటికన్నా అప్పుడే నయం " అనే అభిప్రాయం మార్పు కాదు ప్రజలు ఆశించింది వేరు.
నిజానికి ఆంధ్రలో కొత్త నిరు అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షం కొన్ని నెలలు మాత్రమే బలహినముగా ఉన్నది - మరి కొన్ని రోజుల తరువత అధికార పక్షమే ప్రతిపక్షం బల పడటానికి తోడ్పడింది అని చెప్పాలి.