Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Sunday, 15 December 2019

జగన్ బిజెపితో విభేదించే పరిస్థితిలో ఉన్నారా ?: అవే పరిస్థితులు తనని వెత్తుకుంటూ వస్తే అతను ఎలాగా స్పందిస్తాడు ?రాజకీయాలు 

జగన్ బిజెపితో విభేదించే  పరిస్థితిలో ఉన్నారా ?: అవే పరిస్థితులు తనని వెత్తుకుంటూ వస్తే అతను ఎలాగా స్పందిస్తాడు ?


దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన జీవించి ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి 26-30 సంవత్సరాల యువకుడు. దివంగత రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు జగన్ రాజకీయాలకు చాలా చిన్నవాడు. రాజశేఖర్ రెడ్డి మరణం యొక్క పరిణామాలు అతన్ని చాలా ప్రతికూల పరిస్థితుల్లోకి నేట్టేసినవి .


ఆ సమయంలో కాంగ్రెస్ జగన్ ను తన అడుపజ్ఞాలలోకి  తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. జగన్ ఆ చర్యలకు నిరాకరించాడు, అతను మానసికంగా తనను తాను సిద్ధం చేసుకున్నాడు మరియు పరిణామాలను ఎదుర్కొనేందుకు తన కుటుంబాన్ని సిద్ధం చేశాడు.
ఆర్టికల్స్

రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు, కాని, శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అతన్ని అపరాధిగా అభివర్ణించారు, ఎలాగా చిత్రీకరించారు అంటే దివంగత నేత బతికి ఉన్నప్పుడు తన హయంలో జగన్ ఆర్ధిక నేరాలకు పాలుపడ్డారు అని. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయములో ఆర్ధిక నేర విభాగానికి సమాచారం లేదా ? మరి సమాచారం ఉన్నప్పుడు ఎందుకని ఎటువంటి చర్య తీసుకోలేదు ? ఈ అభియోగాలను ఏ విధముగా పరిగణించాలి ?  .


అదనపు ఛార్జ్‌షీట్లను దాఖలు చెయ్యాలి అనే ఒకే ఒక  కారణంతో అతన్ని జైలులో ఉంచారు, అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చెయ్యాలి అనే ఒక కారణం చూపించి రిమాండ్‌కు తరలించారు. కానీ అవి  ఏమీ అతన్ని భయపెట్టలేదు, ఏమీ మారలేదు, అతను ఆ చర్యలన్నింటినీ సహించాడు మరియు చివరకు రిమాండ్ నుండి తిరిగి వచ్చాడు. ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. ఇంతలో కాంగ్రెస్ కేంద్రం లో తన పట్టు కోల్పోయింది, జగన్ పార్టీ కూడా ఆ ఎన్నికలలో ఓడిపోయింది.క్రైమ్ పై వాస్తవాల నుండి గమనించినట్లయితే, అవతలి వారు ఎంత శక్తి వంతులు అయిన పరిస్థితులకు తను తలవంచాడు. మొండిగటం, అటో ఇటు ఏం చేస్తారో చేసుకోండి నేను చేసేది నేను చేసుకుంటాను అనే రకం, ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన జరిగిన విషయల నుంచి గమనిస్తే ఇది వాస్తవము !  


ఇంతలో ప్రశాంత్ కిశోరే ఎంట్రీ అగ్ని కి అర్జ్యం పోసినట్టు జగన్ మోహన్ రెడ్డి కి కొండంత బలాన్ని చేకూర్చింది.  పబ్లిసిటీ మేనేజమేంట్, వ్యహార శైలి లో మార్పులు, బి జే పి తో ఆరోగ్యకరమైన సత్యసంబంధాలు, కే సి ఆర్ అభయహస్తం ఇవన్ని అప్పటిలో జగన్ మోహన్ రెడ్డి కి కలిసి వచ్చిన అంశాలు. 


సినిమాలు ఇప్పుడు విషయానికి వస్తే ఒక వేళా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ బి జే పి తో విబేధించే పరిస్థితులు వస్తే, జగన్ తనంతట తనే విభేదాలు కొని తెచ్చుకోరు, కానీ బి జే పి కానీ విభేదాలు కోరుకుంటే జగన్ తన తల వంచుతరా ? జరిగిన సంఘటనలు బట్టి చూస్తే అటువంటి పరిస్థితి లో జగన్ లోబరుచుకోవటం బి జే పి కి కష్ట సాధ్యమే అని చెప్పాలి.        
For English Version