Skip to main content

బి జే పి గురిపెట్టిన ఆయుధం పవన్ భుజాల పైన ?
  • అసలు టి డి పీ కాంగ్రెస్ కి సపోర్ట్ ఎందుకు చేసింది?
  • అమరావతి రాజధాని కావటం ?
  • పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో విభేదించటం?
  • లెఫ్ట్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా జనసేన నా?
  • బి జే పి గురిపెట్టిన ఆయుధం పవన్ భుజాల పైన ?


ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో బి జె పీ వ్యూహాలు ఫలించాయి అనే చెప్పాలి . ఇక్కడ ఎవరూ గొప్పవారు కాదు , అంత బి జే పీ వ్యూహమే .


అసలు టి డి పీ కాంగ్రెస్ కి సపోర్ట్ ఎందుకు చేసింది?కారణం లేదు , ప్రత్యేక హోదా అనేది ప్రజలు జీర్ణం కాలేదు. కారణం వేరే ఉన్నది అనేది స్పష్టంగా కనపడుతుంది.అమరావతి రాజధాని కావటం ?అమరావతి రాజధాని చేస్తే దలైలామా రాజధాని అభివృద్ది కి సహకరిస్తాను అని చెప్పినట్టు అప్పటిలో ప్రచారం లో ఉండేది!అమరావతి బౌద్ద మతనికి ఒక ప్రతీక. ఇంకా బౌద్ద మతాన్ని వ్యాప్తి చెందలి అనేది దలైలామా ముఖ్య ఉద్దేశం కావచ్చు, అలాగే కేంద్రం సహకరించదు అనే అంచనా లో అప్పటి ముఖ్య మంత్రి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు .ఎప్పుడైతే మత పరమైన రెండు భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయో అప్పుడు రాజకీయ సంబంధాలు కూడా నెమ్మది నెమ్మది గా తగ్గు ముఖం పడతాయి . బహుశా అందుకే అప్పటిలో " నాతో పని ఏముందిలే , దలైలామా నీ అడుగు "  అన్నట్టుగా  మోడీ నీరు మట్టి ఇచ్చి నేను చేయగలిగింది నేను చేస్తాను అనే వ్యవహార శైలి లో సమాధానం ఇచ్చారు.మరో ప్రక్కన కాంగ్రెస్ పి ఏం లిస్ట్ లో అప్పటి ముఖ్య మంత్రి ఉన్నట్టు నానుడి. ఇంకా తెలంగాణ లో అయితే పుట్టినప్పటి నుంచి టి డి పి కి తప్ప మరో పార్టీ కి ఓటు వెయ్యినీ కార్యకర్తలు , పార్టీ అభిమానులు,  అప్పటి వరుకు కాంగ్రెస్ నీ బద్ద శత్రువు లాగ చూసిన కార్యకర్తలు ఒక్కసారిగా కాంగ్రెస్ కి ఓటు వెయ్యాలి అంటే - మానసిక సంఘర్షణ తో బలాత్కరముగా కాంగ్రెస్ కి వెలుచూపినట్టే .అప్పటిలో తల ఎగరేసిన ముఖ్యమంత్రి కి ప్రధాన మంత్రి బహిరంగ సభ లోనే " ముందు ఎన్నికల పని చూడండి " అని హెచ్చిరించారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో విభేదించటం?

పవన్ కళ్యాణ్ 2014 నాటి ఎన్నికలలో కింగ్ మేకర్ గా వ్యవహరించినట్టు ఒప్పుకో వలసిందే.

అప్పటికే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు జగన్ గెలుపు తథ్యం అన్న విధంగా వాతావరణం మొత్తం మారిపోయింది, కానీ జనసేన స్వయంగా ఎన్నికలలో పోటీ చెయ్యకుండా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వటం, తెలుగుదేశానికి అప్పట్లో కలిసి వచ్చిన అంశం, ప్రత్యక్ష రాజకీయాలలోకి తను దిగకుండా పవన్ కళ్యాణ్ రచించిన వ్యూహం ఫలించింది. ఇందుకుగాను స్వయాన భారతదేశ ప్రధానితో గౌరవప్రదంగా భేటీ అయ్యే ఆవకాశం పవన్ కళ్యాణ్ కి లభించింది ఎందుకంటే మోదీకి తెలుసు ఇక్కడ ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలు ఎలాగ మారాయి అనే విషయం .

చాలామంది పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం అనేది తెలుగుదేశం వ్యూహం గా పరిగణించారు, కానీ తెలుగుదేశం కావాలని జనసేన దూరం చేసుకోలేదు, ఈ అంశంలో బిజెపి పాత్ర అతి ముఖ్యమైనది. పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలవరా అనే అంశం ప్రక్కన పెడితే అతనికున్న అభిమాన జనం గెలిచే అవకాశం ఉన్న పార్టీకి చాలా ఉపయోగ పడతారు, ఈ విషయంలో పవన్ ఒక గేమ్ చేంజ్ ర్ అనే చెప్పాలి, ఒక్క సారి జరిగిన ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే పవన్ గెలిచినా ,ఓడినా, టిడిపిని అత్యంత దెబ్బ తీయటానికి ముఖ్య కారకుడయ్యారు ఈ విషయం మోదీకి చాలా బాగా తెలుసు.

లెఫ్ట్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా జనసేన నా?ఈ విషయంలో ఎవరి ఆలోచన విధానాలను బట్టి ఎవరికి అర్థమైన విధానంలో లో వారు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కమ్యూనిస్టులు టిడిపికి సపోర్ట్ చేస్తే ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉన్నది, ఎందుకంటే కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్ లో సేవ దృక్పథంతో బలహీన వర్గాల తరుపున సమస్యలపై పోరాడుతూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు, ప్రజల్లో వారంటే విశ్వసనీయత ఇంకా పోలేదు, సో ఒకవేళ వారు కానీ టీడీపీకి మద్దతు తెలిపితే బిజెపి రాష్ట్రంలో అనుకున్నది ఏది కూడా సాధించే పరిస్థితులు ఉండవు. ఇది వాస్తవం వారిని దారి మళ్ళించడానికి బిజెపికి ఒక అవకాశం కావాలి ఆ అవకాశమే "జనసేన", అందుకుగాను కమ్యూనిస్టులు అడిగిన ప్రతిదానికి తల ఊపి సరైన సమయంలో వారికి హ్యాండిచ్చి వినయంగా తప్పుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయితే కమ్యూనిస్టుల విశ్వసనీయత కోల్పోయిన పవన్ కళ్యాణ్ మొత్తానికి టిడిపిని దెబ్బ కొట్టడానికి బిజెపి రచించిన వ్యూహంలో ముందంజలోనే రానిచ్చారు అనే చెప్పాలి.

వైసిపి గెలవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ టిడిపికి అత్యంత తక్కువ సీట్లు రావడానికి ప్రధాన కారణం మాత్రం జనసేన అనే చెప్పాలి, ఈ అంశం కొన్ని ప్రాంతాల్లో ఓడిపోయిన వారికి గెలిచిన వారికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం మరియు జనసేనకి వచ్చిన ఓట్లను గమనిస్తే జనసేన మునుపటి ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషించింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఏమైందో తెలియదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారతదేశం అంతట తెలిసిన విషయమే, కానీ,  కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయడంలో అంత ఆశక్తి చూపడంలేదు అనేది వాస్తవం.

పరిస్థితులు గమనిస్తే ప్రస్తుతం టీడీపీలో టార్గెట్ అయినా ముఖ్య నేతలు బిజెపిలో చేరి ఉన్నారు, వారు కచ్చితంగా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తారు అనే విషయం బహిరంగ రహస్యం, ఈ మధ్యలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో సత్య సంబంధాలు ఏర్పరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలకు ఈ రాష్ట్ర మే సాక్ష్యం. ప్రస్తుతం పవన్ పోరాట బాట పట్టారు, అంటే కమ్యూనిస్ట్ లు లాగా వ్యవహరించటం, వారు ప్రజలలోకి ఏ విధముగా వెళ్ళారో అదే విధముగా జనసేనను నడిపించాలి అనే విధముగా అనుకరిస్తున్నారు, ఇందులో ద్వంద ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ప్రజానాయకుడిగా పవన ప్రజలలో ఎలివేట్ అవ్వటం మరొకటి బి జే పి తన ప్రధాన ప్రత్యర్దులుగా భావిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ లా  ఉనికిని దేబ్బకోటట్టం. ఒక పని రెండు ప్రయోజనాలు.  కాస్త ఆలస్యముగా పసిగట్టిన కమ్యూనిస్ట్ పార్టీ లు పవన్ ఆహ్వానాన్ని సున్నితముగానే తిరస్కరించారు.   

బి జే పి గురిపెట్టిన ఆయుధం పవన్ భుజాల పైన ?ఈ వ్యవహారం ముదిరిన కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ టీడీపీ నీ సమర్థించటం ప్రత్యక్షంగా పోరాటాల కోసం పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ జనసేన తెలుగుదేశం కలిసి తమ ప్రయాణం కొనసాగిస్తే ఖచ్చితంగా  ఆ వ్యూహం బిజెపి దే అని చెప్పాలి, ఎందుకంటే జనసేన టిడిపి కలిసి ప్రయాణం చేయటం అంటే రాష్ట్రంలో త్రికోణ పోరాటం లేనట్టే.

రెండు సామాజిక వర్గాలు కలిసి మళ్లీ ఒకే తాటి మీద ప్రయాణించడమే, అప్పటిలో ప్రతిపక్ష నేత భుజం మీద పెట్టిన ఆయుధాన్ని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజం మీద పెట్టి ప్రస్తుత పాలకవర్గాన్ని బిజెపి టార్గెట్ చేసినట్టే! ఈ వ్యవహారంలో ప్రస్తుత పాలకవర్గం అత్యంత జాగ్రత్త వహించాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు విరమించుకున్న తరువత అప్పటి ముఖ్యమంత్రి సామాజిక వర్గాల వారీగా విభజించి ఎన్నో కార్పొరేషన్ లు , లోనులు, స్కీములు పెట్టడం జరిగింది అలాగే రిజర్వేషన్లలో  కూడా ఒక సామాజిక వర్గానికి చోటు కల్పిస్తామని చెప్పి బహిరంగ ప్రకటన చేయడం జరిగింది, కానీ ఏ వ్యూహం కూడా ఎన్నికలలో అప్పటి పాలక వర్గాన్ని కాపాడలేకపోయింది.

ఎందుకంటే అక్కడ ఉన్నది మోది, వ్యూహరచనలో ఎవరికి, ఎప్పటి వరకు ఏ పాత్ర ఇవ్వాలో ఎక్కడ , ఎప్పుడు ఏ పాత్రకి ముగింపు చెప్పాలో, ఎలాగ చెప్పాలో పూర్తిగా శిక్షణ ఇచ్చి ఆమలుపరిచిన వ్యూహంగా ఈ అంశాన్ని పరిగణించవచ్చు.


Articles

Politics

Crime

National Politics

International Politics