ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సైరా - మూవీ రివ్యూ


" బానిసత్వం కన్నా స్వేచ్చ కోసం పోరాడి చనిపోవటం మెరుగు " అనే కాన్సెప్ట్ తో సినిమా మొత్తం నడుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చరిత్ర ను ఆశక్తి కారముగా తెరకెక్కించారు. భావోద్వేకలకు గురయ్యే సన్నివేశాలు, రోమలు నిక్క పొడుచుకునే విధముగా సంభాషణలు, బాగా చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు.  మొత్తనికి "ఆత్మాభిమానం తో స్వేచ్చ కోసం " పోరాడే సమరయోధుడి కధ.
స్పెషల్ ఎట్రాక్షన్ : సందర్బానికి తగినట్టు చిత్రీకరించిన భావోద్వేగా సన్నివేశాలు.  కిచ్చ సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు, కధ, చిరంజీవి యాక్షన్ మరియు అమితాబ్, జగపతిబాబు .


చివరిలో హీరో రోల్ చనిపోవటం వలన కొంత మంది అభిమానులు అసంతృప్తి చెందవచ్చు, కానీ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి  చరిత్ర చాల మందికి చరిత్ర  పరిచయం చెయ్యని యదార్ధం. చరిత్రని తెరకేక్కించేటప్పుడు ఖచ్చితముగా ఆ పాత్ర కి తగిన న్యాయం చెయ్యాలి. పాత్ర లో కధనాయకుడుని చూస్తే సినిమా అంతగా నచ్చకపోవచ్చు, కానీ అదే పాత్ర లో చరిత్రను చూస్తే అందరికి నచ్చుతుంది, ఎందుకంటె ఈ సినిమాలో " ఆత్మాభిమానం, స్వేచ్చ, హక్కులు, విలువులు " ఇటువంటి అంశాల గురించిన ప్రస్థావన ఎక్కువ.మొత్తానికి సైరా సినిమా  నచ్చటం నచ్చకపోవటం అనేది ప్రేక్షకుడి మనోభావాలు బట్టి ఆధారపడుతుంది. ఈ సినిమా కి క్విక్ ఆంధ్ర రేటింగ్ 4/5.  .          

     

     


     
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image