ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

భారం నాదే! వైయస్ జగన్ మోహన్ రెడ్డి



భారం నాదే! వైయస్ జగన్ మోహన్ రెడ్డి


ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక భారం అందరికీ తెలిసిన విషయమే అలాగే సంక్షేమ పథకాల కి అయ్యే ఖర్చు అందరికీ తెలిసిన విషయమే, కేంద్రం మొండిచేయి చూపిస్తున్న ప్రతిపక్షాలు హేళన చేస్తున్న ఏమాత్రం లెక్కచేయకుండా రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించిన వ్యక్తి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి.

రాష్ట్రం ఆర్ధిక పరిస్థితుల తో సంబంధం లేకుండా ఇచ్చిన మాట కి కట్టుబడి రైతు భరోసా పథకం లో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ పెట్టుబడి నిమిత్తం తనవంతుగా పెట్టుబడిని సమకూర్చారు.

విమర్శలను లెక్క చెయ్యలేదు,  రాష్ట్ర ఖజానాలో ఉన్న సంపదకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని మొదటి విడతగా రైతుల ఖాతాల్లో తను మాట ఇచ్చిన ప్రకారం,  రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా రైతుల ఖాతాల్లో 7500 పెట్టుబడి నిమిత్తం జమ చేసి ఉన్నారు.

అదేవిధంగా టమోటా రైతులు కు మద్దతు ధర ప్రకటించి పండించిన పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతులకు తన వంతు సహాయంగా, అండగా నిలబడి ఉన్నారు. ధరల స్థిరీకరణ నిధుల ద్వారా కిలోకి నాలుగు రూపాయలు అదనంగా చెల్లించే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఒకవేళ దళారులు, ఏజెంట్లు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు సమాచారం.
ఈ సమయంలో ప్రతిపక్షం అధికారం చేపట్టిన ఏం చేసేది లేదు ఎందుకంటే కేంద్రానికి ప్రస్తుత ప్రతిపక్షానికి ఉన్న వైరం తెలిసిందే ఈ రాజకీయం లో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు వచ్చే సహకారం కూడా అందదు అనే అభిప్రాయాలు లేకపోలేదు. ఒకవేళ అందిన టమోటా రైతుల యొక్క ఆవేదనను పట్టించుకోని ఇంతగా స్పందించి మద్దతు ధర ప్రకటిస్తారా లేదా అనే చర్చలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో  జరిగిన భారీ కుంభకోణం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 1150 కోట్లు రూపాయలను విడుదల చేసింది. ఐదు నెలల రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి నిమిత్తం రైతు భరోసా, టమోటా రైతులు సంక్షోభానికి మద్దతు ధర, అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది. ఐదు నెలల కాలంలో మూడు మైలురాళ్లను దాటిన ఘనత ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. 

అలాగే కొనసాగించి పరిపాలనలో డ్వాక్రా మహిళల కు కూడా తగిన న్యాయం చేస్తే వారి నమ్మకాన్ని కూడా వమ్మ చేయని వారు అవుతారు. ఎందుకంటే రాబోయేది పంచాయతీ ఎన్నికలు ఇందులో ఎక్కువశాతం మధ్యతరగతి మరియు దిగువ తరగతి వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. డ్వాక్రా రుణమాఫీ అనే అంశానికి ఫిదా అయిపోయిన దిగువ తరగతి కుటుంబానికి చెందిన మహిళలే ఎక్కువ ఉన్నారు. 

అందుకుగాను ప్రభుత్వం ఈ అంశంపైన తగిన చర్యలు తీసుకొని వెంటనే స్పందిస్తే పంచాయతీ ఎన్నికలలో పై చెయ్యి సాధించగలుగుతారు. ఇసుక కొరతతో మధ్యతరగతి మరియు సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కూలి పనులు చేసుకునేవారు పనులు లేక కుటుంబ పోషణ కరువై కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ పంచాయితీ ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు ఎదురైతే అది కేవలం ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనే అభిప్రాయాలు లేకపోలేదు.
     









 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement