Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Saturday, 5 October 2019

ఇసుక వేడిగా ఉన్నది ! అపుహాలు వ్యాప్తి చెందుతున్నవి ! డ్వాక్ర ఋణ మాఫీ లు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఇసుక మునపటి లాగా  అందుబాటులో లేకపోవటం  తో రోజువారి కూలీలు  అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని దుషిస్తున్నారో లేదో తెలియదు కానీ ఒక రకమైన వ్యతిరేక భావన ఏర్పడుతుంది. బలిసిన బడా బాబులు కట్టడాలు ఆపేసారు, వారికీ రోజు ఏ విధముగానైన గడుస్తుంది, కానీ రోజువారీ కూలి లు చేసుకునేవారు మాత్రం రాష్ట్రం వదిలి వలస వెళ్వవలిసిన పరిస్థితి ఏర్పడుతుంది.  

రైతు భరోసా లో కొన్ని సవరణలు చేసారు అనే ప్రచారం జరుగుతుంది. అందులో కొంత మంది సామజిక వర్గాలకి సంబంధించిన రైతుల కి మాత్రమే ఆ భరోసా అనే ప్రచారం గట్టిగ ఉన్నది. ఈ దిశ గా ఆందోళనకు గురైన రైతులు లేకపోలేదు.

ఇసుక విషయం లో సొంత పార్టీ వారిని సైతం వదిలి పెట్టని ముఖ్యమంత్రి వైఖరి ప్రశంసనియమే కానీ ఇసుకు కొరత వలన నష్టపోతున్న రోజువారీ కూలీలను సైతం దృష్టి లోపెట్టుకొని  వ్యవహరిస్తే  బాగుంటుంది అనే  అభిప్రాయాలు లేకపోలేదు. ఆన్లైన్ లో ఇసుక ని కొన్నుకునే విధముగా ఆవకాశాలు ఉన్న, చాల మంది ఉపయోగించుకునే విధానం తెలియక ఇబ్బందికి గురి అవుతున్నారు.

అపుహాలు ,ఉహాగానాలు ఏ ప్రభుత్వానికి సుభ పరిణామం కాదు . సవరణ చేసుకునే లోపల, ఈ వ్యవహారాలు  మొత్తం వ్యాప్తి చెందుతుంది.  ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 3 నెలలు దాటుతుంది, రాష్ట్రం లో నిధులు కొరత ఉన్నది అనే విషయం ఓపెన్ సీక్రెట్, ఆ కొరతను  ప్రకృతి వనరులు తో  భర్తీ చెయ్యాలి అనే అంశం పైన ప్రభుత్వం నోరు విప్పకుంటే,  ఈ ఉహాగానాలు వ్యాప్తి చెందుతూనే ఉంటాయి.

ప్రజలు మార్పు కోరుకున్నారు అంటే దాని అర్ధం ప్రతిపక్ష నేత మీద వ్యతిరేతతోనో లేదా ఒక్కప్పటి అధికార పార్టీ మీద వ్యతిరేకతతోనో కాదు, ఇప్పటి పాలక పక్షం మీద నమ్మకంతో, ఏదైన చేస్తారు అనే నమ్మకంతో. ముఖ్యం గా ఒక్కసారి గమనిస్తే (సర్వే లు గమనించండి ) ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి రేఖ వారు, మధ్య తరగతి వారు అప్పటి అధికార పార్టీ ఒత్తిడులను తట్టుకొని ఇప్పటి పాలక పక్షానికి అండగా నిలబడ్డాయి.

డ్వాక్ర మహిళలు ఋణ మాఫీ అనే అంశం ప్రజలలోకి బాగా వెళ్ళింది. అది అప్పటిలో ఎలెక్షన్ కి అతి పెద్ద అసెట్.  అప్పటి పాలక పక్షం మేము డబ్బులు ఇస్తాము అంటే, వారు అభిమానించే నాయకుడు ఎట్లనో ఋణ మాఫీ చేస్తాడు కాదా అని చెప్పి దారాళముగా ఇచ్చినకాడికి డ్వాక్ర  ఋణాలు తిసుకోనియున్నారు(స్వయముగా విన్నది ), దాన్ని ఖచ్చితముగా నమ్మకం అనే అంటారు, ఎవరిని నమ్మినారు  అనే విషయం ఇక్కడ అందరికి తెలిసిన విషయమే . 

ఒక మధ్య తరగతి కుటుంబం లేదా దిగువ రేఖ కుటుంబాలకి అప్పు అనేది నేలాకరికి కలలోకి వచ్చే భూతం లాంటిది, నిరంతరం వెంటాడే మానసిక వ్యధ. ఒక్కసారిగా  అధనముగా వచ్చిన డబ్బు వారి కి దీర్గ కాల సమస్యలను దూరం చేసే ఔషది, ఇంకా అదే డబ్బు తిరిగి కట్టనవసరం లేదు అనే భరోసా సాక్షాత్తు దైవ దర్శనం. ఇటువంటి వాగ్ధానాలు చేసినప్పుడు ప్రజలనుంచి  వచ్చే అనుకులత కంటే  విఫలం అయితే వచ్చే ప్రతికులత ప్రభావమే పాలక వర్గం మీద విపరీతముగా  చూపుతుంది  .

భావ ప్రకటన ని కట్టడి చెయ్యగలరు! కానీ ఒక విధానం పైన ఏర్పడుతున్న అభిప్రాయాలను ఏ విధముగా కట్టడి చేస్తారు. ఇచ్చిన మాట భారం అయిన మహిళలకు ఇచ్చిన మాటను నిలపెట్టుకోవలిసిందే, అదే భవిష్యత్తుకి శ్రేయస్కరం.

సాధ్య అసాధ్యాలు ప్రక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం పైన పగ్గాలు చేజిక్కించుకునే దిశగా 4 రాజకీయ పార్టీ లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. పొరపాటు చేసిన చూస్తూనే ఉంటారు, సరైన సమయములో  పొరపాటుని తప్పుగా, తప్పుని ఆయుధముగా ఎవరికి నచ్చిన విధానములో వారు వాడుకుంటారు.

మొత్తానికి ఇసుకు కొరత, రైతు భరోసా, డ్వాక్ర ఋణ మాఫీలు ప్రజలను అంతర్గతముగా వేధించి మానసిక అశాంతి కి గురి చేసే అంశాలు. వాటి ప్రతికూలత ప్రభావం  నుంచి వచ్చే సమాధానం కాలమే చెప్పాలి.
    Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image