ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మంత్రివర్గ విస్తరణలో అంత గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకని ఈ వ్యవహార శైలి అనేది ప్రశ్నార్థకం? పాత పరిచయాలతో ఏమైనా మంతనాలు కానీ జరుగుతున్నాయా ?



మంత్రిత్వ శాఖలో ఆధారాలు లేని ప్రకటనలు చేసే మంత్రుల మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం సిద్ధపడాలి. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటన చేయకుండా బొత్స సత్యనారాయణ ఒక మంత్రిగా ఉండి తనకు నచ్చిన విధంగా, తన మనసుకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా ప్రకటనలు చేయడం వివాదాస్పదానికి కారణముగా నిలవడం, అటు రాజధానిని మారుస్తారని లేదు మారదు అని చెప్పి అసందర్భ ప్రకటనలు చేస్తూ, అసలు రాజధాని మారుస్తారా లేదా అనే విషయం పైన ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా, కేవలం ఫలానా కమిటీ అక్కడ అ భూములు రాజధాని కట్టడానికి పనికిరావు అని చెప్పి నివేదిక ఇచ్చారు అని చెప్పి రాష్ట్ర మంత్రులు చేసే వ్యాఖ్యలను ఏమనాలి.

ఎప్పుడో జరిగి పోయిన రాజధాని కట్టడాన్ని మళ్లీ మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది, మేము శివరామకృష్ణ కమిటీని మళ్లీ పునఃపరిశీలన చేస్తాము అని చెప్పి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బాహాటంగా ప్రకటించడం లేదా స్టేట్మెంట్ లు ఇవ్వటం వలన ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అప్పు కోసం చెయ్యి చాచిన వీరు చేసే ప్రకటనలు వలన ఎక్కడ కూడా అప్పు పుట్టని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే అప్పటికే నిర్మాణ పనులు చేపట్టి, రాష్ట్ర రాజధానిగా పేరు గావించి, ప్రజల్లో అమరావతి అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా పేరుంది , ఒకేసారి ప్రభుత్వం మారిన వెంటనే, లేదు ఇప్పుడు రాజధాని అమరావతి కాదు వేరొకచోట ప్రతిపాదిస్తామని లేదా ఇక్కడ భూములు రాజధాని నిర్మాణానికి కి అనుకూలమైనవి కాదు అని ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ప్రకటనలు చేసినప్పుడు రాజధానిలో మార్కెట్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది.

మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యల కాబట్టి ఒకవేళ నిజంగానే ప్రభుత్వం రాజధానిని మార్చే ఆలోచనలో ఉందేమో అనే భావన బ్యాంకింగ్ వ్యవస్థలో కలగకుండా ఉంటుందా?

ఒకవేళ రాజధాని మారిస్తే వచ్చే సమస్యలు ఏంటి?

ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ప్రభుత్వం దగ్గర ఏటువంటి నిధులు లేవు, ఈ విషయం ఓపెన్ సీక్రెట్. ఒకవేళ ప్రభుత్వం రాజధానిని మారిస్తే! ప్రస్తుతం పరిస్థితుల రీత్యా రాష్ట్రం ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది, మధ్యదశలో ఉన్న రాజధాని పనులు మొదటినుంచి మొదలు పెట్టాలి అందుకు పెట్టుబడులు కావాలి మళ్లీ ఎంత అయితే రాజధాని మీద మునుపటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందో అంతే పెట్టుబడి ప్రస్తుత ప్రభుత్వం కూడా పెట్ట వలసిందే. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ఐదు సంవత్సరాలు వెనక పడుతుంది, పెట్టుబడులు పెట్టాలి అంటే ఏ పారిశ్రామిక సంస్థలు కూడా అంత ఆసక్తి చూపించరు. ఆంధ్ర రాష్ట్రం అంటే స్థిరత్వం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, లేదా రాజకీయ కక్షలు గురించి స్థిరత్వం నిలకడ లేని నిర్ణయాలు తీసుకుంటుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టిన ఏది కూడా శాశ్వతముగా లేదా నిర్దేశించిన సమయం వరకు స్థిరంగా ఉండదు అనే అభిప్రాయం పెట్టుబడిదారులుకు ఏర్పడుతుంది. ఒక్కసారి తాము పెట్టిన పెట్టుబడులు కు ఎప్పుడైతే రక్షణ లేదు అనే భావనలో కి పెట్టుబడిదారులు లేదా పారిశ్రామికవేత్తలు వెళ్తారో అప్పుడు వారు పెట్టుబడులు పెట్టడానికి ఎప్పటికీ ఆసక్తి చూపించరు. ఇంకా రాష్ట్ర అభివృద్ధి అనేది ఎప్పటికీ కూడా ఒక కలలాగానే మిగిలిపోతుంది.

ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధి జరగలేదో అక్కడ ఆదాయ వనరులు కూడా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థల్లో ఏప్పుడైతే అభద్రతా భావన వస్తుందో వారు నిధులు సమకూర్చడానికి వెనకడుగు వేస్తారు. 
ప్రధానమంత్రి మోడీ మరియు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి అంతర్జాతీయ మార్కెట్లో రాజధాని భూములును సెక్యూరిటీ క్రింద పెట్టి ఉన్నారు, పెట్టుబడిదారులను ఆకర్షించే విధముగా అప్పటిలో లో ప్రధానమంత్రి సహకారంతో అంతర్జాతీయ మార్కెట్లో విశ్వసనీయతను కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని మార్పు అనే అంశం మాజీ ముఖ్యమంత్రి ఒక్కరినే దెబ్బ కొట్టే అంశం కాదు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద అంతర్జాతీయంగా ఉన్న విశ్వసనీయతను కూడా దెబ్బ కొట్టే అంశం గా పరిగణించవచ్చు. ప్రస్తుత పాలకవర్గ చర్యలు జాతీయం గానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారతదేశ ప్రధానమంత్రి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాది.
అప్పట్లో ప్రధానమంత్రి మీద ఉన్న నమ్మకంతో అంతర్జాతీయంగా ఇచ్చిన సెక్యూరిటీ తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు కానీ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి, నిలకడలేని ప్రకటనలు, అనధికారికంగా చేసిన ప్రకటనలో, అందులోనూ మంత్రిత్వ శాఖలో కొంతమంది పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కి అతి సన్నిహితులు పొంతన లేని ప్రకటనలు చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అనే ఉద్దేశం ఉన్నవారికి అభద్రత భావాన్ని కలిగించి వారు వెనకడుగు వేసే విధంగా పరోక్షంగా కారకులవుతున్నారు. ఇటువంటి అంశాలన్నీ మార్కెట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడే విధముగా ఉంటాయి.

ఈ సమయంలో ఏ ఆర్థిక సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావు అనే అంశాన్ని మరువకూడదు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అవుతుంది, ఒక మంత్రి రాజధాని మార్చే విషయంలో పునరాలోచన చేస్తాము శివరామ కృష్ణా కమిటీ ఇచ్చిన నివేదికను మళ్లీ పరిశీలిస్తాము అని స్టేట్మెంట్ ఇవ్వడం, మరోపక్క వేరొక మంత్రి రాజధాని విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనే స్టేట్మెంట్ ఇవ్వటం! ప్రజలే కాకుండా ఆర్థిక సంస్థలను కూడా సందిగ్ధావస్థలో పడేసిన వైనము ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్నది. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది? ఒకపక్కన ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం రాష్ట్రానికి నెలకు వేలకోట్ల అవసరముంది, మరోపక్క కేంద్రం నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అలాగే ప్రభుత్వ పథకాలు కోసం రాష్ట్రానికి ఆదాయానికి మించిన అవసరమే ఉంది . నమ్మకం అనేది ఆర్థిక విషయాల్లో చాలా ముఖ్యమైన విషయం, దారిన పోయే వాళ్ళు లేదా సమాజంలో ఎటువంటి గుర్తింపు లేని వారు, బదకానీ కొట్టడానికి రాష్ట్ర రాజధాని ని ఒక అంశము గా పెట్టుకొని వారు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏ విధమైన స్పందన లేదా రిజల్ట్ ఉండేది కాదు.

 అదే ఆంధ్రరాష్ట్రంలో రాజధాని గురించి స్టేట్మెంట్లు ప్రకటనలు చేసే వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, గౌరవ స్థానం లో ఉన్నవారు, అటువంటి వారు ఏటువంటి ప్రకటనలు చేసిన అది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. దాన్ని కేవలం ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాత్రమే కట్టడి చేయగలరు.

పెట్టుబడులు అప్పులు కావాలి అంటే కొన్ని విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా కలగజేసుకుని ఖండించాలి, మరీ ముఖ్యంగా ఇటువంటి విషయాలను. మీరు చెప్పండి ఒకవేళ మీ దగ్గరికే ఒకతను అప్పు కోసం వస్తే అతని ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటే, అతని ఇంట్లో అంతర్గత కలహాలు ఉండి అతనికి సంబంధించిన ఆస్తులు కు విలువ లేకుంటే, ఎప్పుడు ఆ ఆస్తులు గురించి ఏదో ఒక వివాదాస్పదమైన వార్తలు వినిపిస్తుంటే, ఒక నిలకడ లేని ఆస్తిని మీరు తాకట్టు పెట్టుకునే రుణాలు ఇస్తారా?. ఇక్కడ సమస్య కూడా అదే! ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల నేను మంచి ముఖ్యమంత్రిని అని అనిపించుకుంటాను అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే, కానీ ఆరోనెల దగ్గర్లోనే ఉంది కేవలం ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడం మీద దృష్టి పెట్టి నంత గా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టిపెట్టడం లేదు అనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి, గ్రామ సచివాలయాలు అలాగే గ్రామ వాలంటీర్లు, ఆశ ఉద్యోగుల జీతాల పెంపు ఇటువంటి అంశాలు ప్రభుత్వానికి కలిసివచ్చే అంశాలు కాని వారికి జీతాల చెల్లింపు అనేది రాష్ట్రం మీద ఆర్థిక భారమే! ఆర్థిక భారాన్ని తట్టుకోవాలి అంటే రాష్ట్రానికి ఖచ్చితముగా ఆదాయ వనరులు కావలసిందే, ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అనే అంశాన్ని పరిధిలోకి తీసుకున్నది. డిమాండ్ పెంచి సప్లై తగ్గించి ఇసుక రేటు పెంచి ఆ ఇసుకను రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా అధిక ధరకు విక్రయించి ప్రభుత్వ ఖజానా నింపాలి అనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు వినికిడి. ఓవర్ డ్రాఫ్ట్ వినియోగించుకున్న దానికి ఖచ్చితముగా వడ్డీ అనేది కడుతూ ఉండాలి, ఆ విధముగా చూసుకున్న రాష్ట్రానికి ఆర్థిక భారం తప్పదు.
 ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని చాలా పత్రికలు అలాగే ఆర్థిక వేత్తలు ఇప్పటికే చెప్పి ఉన్నారు ఈ సమయంలో లో కేంద్రానికి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక బాధ్యత తీసుకోవటం అనేది తనకు మించిన భారం. ఒకవేళ కేంద్రం ఆర్థిక సహాయం చెయ్యను అని చెప్పిన అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎదిరించిన లేదా విభేదించిన లేదా తప్పు కేంద్రం వైపు చూపించిన చెల్లుబాటు కాదు ఎందుకంటే ఒకవేళ భారత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయితే కేంద్ర పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి కేంద్ర ప్రభుత్వ పరిస్థితి అలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహాయం చేస్తారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కన్నా ఆర్థికంగా నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ప్రజలు మరోసారి పట్టం కడతారు. ఐదు సంవత్సరాల్లో రాజకీయ ప్రత్యర్ధులకు ఏదో ఒక సంవత్సరం కేటాయిస్తే సరిపోతుంది కానీ గెలిచిన వెంటనే రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి వారిని ఇరకాటం లో పెట్టాలి అనే ఉద్దేశంతో చేసే ఆవేశపూరిత పనులు అది కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని పైన చేసే వ్యాఖ్యలు గాని లేదా ఇతర విషయాలు గానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లేదా వచ్చే ఆర్థిక వనరులను దెబ్బ కొడుతుంది అనే విషయం మరువకూడదు. 


భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో రాజధానులు విభజించబడతాయి ఉదాహరణకు కు బొంబే మన దేశానికి కి ఆర్థిక రాజధాని అలాగే ఢిల్లీ మన దేశానికి పాలన పరంగా రాజధాని. ఈ విధంగా రాజధానులను విభజన చేయడం వలన విడివిడిగా ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో పాలన విధానానికి ఒక చోటు, ఆర్థిక వ్యవహారాల కి ఒక చోటు, పారిశ్రామిక అభివృద్ధికి ఒక చోటు నిర్దేశిస్తే మొత్తం ప్రాంతాలు అన్ని అభివృద్ధి చెందుతాయి అలాగే పెట్టుబడిదారులు రాష్ట్రంలో లో పెట్టుబడి పెట్టడానికి ఆశక్తి చూపిస్తారు, అదేవిధంగా ఆర్థిక సంస్థలో రుణాలు ఇవ్వడానికి మొక్కువ చూపిస్తాయి అంతేగాని రాజధాని వ్యవహారాన్ని వివాదాస్పదం చేసుకొని జాతీయంగా అంతర్జాతీయంగా ఆంధ్ర రాష్ట్ర పరువుని దిగజార్చడం తప్ప వేరొకటి జరగదు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద ఉన్న రాజకీయ ప్రత్యర్థి తత్వాన్ని వ్యక్తపరిచే సందర్భం ఇది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే రాష్ట్రాలు సందిగ్ధావస్థలో పడతాయో అప్పుడు ప్రజలు అభివృద్ధి కి మాత్రమే పట్టం కడతారు, ఆ సమయంలో ప్రజలు నాయకుడు యొక్క అర్హతను కేవలం అతని సమర్ధతను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఏప్పుడైతే ప్రజా సంక్షేమం పక్కదారిన ప డి నిరుద్యోగం రాష్ట్రంలో తాండవి స్తుందో అప్పుడు ప్రజలు తాము ఏనుకున్న నాయకుల మీద నమ్మకాన్ని కోల్పోతారు ఒక్క అవకాశం ఇచ్చింది ఏం చేస్తారని చూడడానికి అంతేగాని రాజకీయ కక్షలు లేదా మాజీ ముఖ్యమంత్రిని వేధించటం లేదా వేరొక పార్టీని ఇరకాటంలో పెట్టడం కోసం కాదు. రాజకీయ కక్షలు నేపథ్యంలో కేవలం పార్టీ కార్యకర్తలు లేదా ఉత్సాహంగా ఉన్న నాయకులు మాత్రమే సంతోష పడతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి అత్యంత అవసరమైనది అభివృద్ధి మరియు కమిషన్ లేని వ్యవస్థ. 


రాజధాని మీద పొంతనలేని ప్రకటనలు చేస్తున్న వ్యవహారం చూస్తుంటే కొంతమంది కావాలని ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా కావాలని చేసే చర్యలు గా కనపడుతున్నాయి. పెట్టుబడిదారులు ను వెనక్కి పంపించాలని ఉద్దేశంతో కొత్తగా ఏర్పడిన పాలకవర్గాన్ని ఆర్థికంగా మరింత కుదేలు చేయాలని ఉద్దేశంతో ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారా? అనే అభిప్రాయాలు లేకపోలేదు! ఎందుకంటే ఈ ప్రకటనలు చేసే మంత్రి ఇదివరకు ప్రస్తుతం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అలాగే అప్పటిలో కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా వ్యవహరించిన వ్యక్తి . రాజకీయ వ్యూహాలలో ఇది ఎటువంటి వ్యూహం అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోగలరు కానీ ప్రస్తుత ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో అంత గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకని ఈ వ్యవహార శైలి అనేది ప్రశ్నార్థకం? పాత పరిచయాలతో ఏమైనా మంతనాలు కానీ జరుగుతున్నాయా ?అనే సందేహాలు లేక పోలేదు ! 


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image
< async="" src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js">

Advertisement