Skip to main content

"జగన్ " గేమ్ ప్లాన్ లో లోటుపాట్లు     " జగన్ " గేమ్ ప్లాన్ లో లోటుపాట్లు ఎక్కువ ఉన్నాయి అనే చెప్పాలి. అనాధరిత ప్రభుత్వ వ్యతిరేక ప్రచురణ లను అదుపు చెయ్యటానికి వార్త సంస్థల పైన ఆంక్షలు విధించడంతో, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురణ అవ్వవు అనే ఉద్దేశం తో ఒక అడుగు ఆవేశపూరిత ముగ తీసుకున్న ప్రభుత్వం, తన ప్రత్యర్థులకు తనే భలం చేకూరుస్తున్నా విషయం మరిచిపోతున్నారు !

ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రధాన ప్రతి పక్ష నేత గా ఉన్నప్పుడు బహిరంగ గానే ఏ బి ఎన్ , టివి 5 , టివి 9 మీద విమర్శలు చేసియున్నారు. కొన్ని కారణాల వాళ్ళ టి వి 9 కి ఆ లిస్ట్ లో నుంచి వెసులుబాటు లభించింది.


టార్గెట్ ఏ బి ఎన్ , టి వి 5 మాత్రం ఏటువంటి మార్పులు లేకుండా లిస్ట్ లో అలాగే ఉండిపోయాయి. అంటే ప్రస్తుత పాలక వర్గం ఆ రెండు సంస్థల ను ప్రభుత్వ వ్యతిరేక వార్త ప్రచురణ సంస్థల గా అనాధికరముగా ప్రకటించినట్టే. ఏ బి ఎన్ , టి వి 5 ఒక జట్టు మిగత చానెల్స్ అన్ని ఒక జట్టు గా పరిగణించవచ్చు.

కానీ ఇప్పుడు పాలక వర్గం తీసుకున్న నిర్ణయం వార్త సంస్థలను రెండు వర్గాలుగా చీల్చే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే అధికారులకు పరువ నష్టం దావా వెయ్యమని ఏకముగా ప్రభుత్వమే సూచిస్తే అధికారులలో జవాబుదారీ తనం , నిర్లక్ష్యం పెరిగిపోతుంది, ప్రశ్నించే స్వరం లేని కలం, మూగబోయిన మాటలు, వార్త సంస్థల కు మానసిక ఆందోళన కలిగిస్తాయి, ఒక్క సాక్షి తప్ప మరొక వార్త సంస్థ ఏది ఆంధ్ర లో స్వాతంత్రము గా వ్యవహరించ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అణిచివేతకు గురి అయిన ప్రతి వార్త సంస్థ , ఒక్క ఒక్కటిగా ఒకే చోటి కి చేరితే అది వార్త సంస్థల ఉద్యమంగా మారుతుంది.

అంటే తన ప్రత్యర్థులకు తానే బలాన్ని చేకూర్చే చర్య అని చెప్పాలి . ఒంటరిగా ఉన్న ప్రత్యర్థులకు మిత్ర బలాన్ని చేకూరుస్తున్నా చర్యలు . బహుశా ఇదే ఆలోచించి దివంగత నేత అప్పటిలో ఆ జీ ఓ నీ నిర్వీర్యం చేసి ఉంటారు ?


ఇటువంటి చర్యలు భవిష్యత్తులో ఖచ్చితముగా మంచి ఫలితాలు ఇవ్వవు. మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ఇవ్వటానికి ఒక ఛానెల్ నీ నిరాకరించిన వ్యవహారం లో పవర్ పోయిన వెంటనే ఆ వార్త సంస్థ బాహాటంగా నే ఆ విషయాన్ని ప్రకటించింది.

అధికారం లో ఉన్న 5 సంవత్యరలు , చాలా తక్కువ వార్త సంస్థలు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురుణ చేస్తాయి. దివంగత నేత ఆ వార్త సంస్థలకు అసెంబ్లీ అనే బలమైన మీడియా ను వాడుకొని సమాధానం చెప్పి వారి కథనాలను ప్రజలకు తెలిసే విధముగా ఖండించి, ఆ వార్త సంస్థల వైఖరి నీ ఎండ కట్టే వారు. రెండవది అసలు ఏమి జరిగింది అనే వాస్తవాలను మిగత వార్త సంస్థల లో ప్రచురణ అయ్యే విధముగా చేసి కౌంటర్ జర్నలిజం చేసేవారు. మూడవది ఒక వేళ జరిగిన దానిలో వాస్తవం ఉంది, క్షమించరాని తప్పు అయితే వెంటనే అధికారులు ప్రతిఫలం పొందే వారు , ఆ విషయం లో బహిరంగ ప్రకటనలు జరిగేవి.

ఉక్కు సంకెళ్లు ఎప్పుడు కూడా బిగించే వారు కాదు ఆ రోజులలో. మీడియా మీద ఆంక్షలు అనేవి ప్రజలు ఆమోదించే విధముగా ఉండాలి, * కనీస విద్యార్హత, ప్రొఫెషనల్ అర్హత మొదలైనవి చేస్తే ఖచ్చితముగా ప్రజలు ఆమోదిస్తారు , *వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది * అప్పుడు వివేకం తో కూడిన విశ్లేషణ లు ప్రచురణలు ఉంటాయి.

* ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది*, ఆ గ్యాప్ లో విద్యావంతులు కు అవకాశాలు దొరుకుతాయి. వార్త సంస్థలు స్త్రింగ్ ర్ల కి కనీస వేతనాలు, ఆ వేతనాలు ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగితే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత లేకుండానే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరే అవకాశాలు ఎక్కువ .

ఆంక్షలు విషయం లో వ్యూహ రచన ఎవరిదో కానీ , మొత్తానికి వ్యూహ రచన మాత్రం ప్రత్యర్థులు అని భావిస్తున్న వారికి బలం చేకూర్చే విధముగానే ఉన్నది అనే చెప్పాలి.
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics