Skip to main content

"సైనర్జి అవుట్ సోర్సింగ్ ప్రైవేటు లిమిటెడ్ " పేరుతో నిరోద్యోగులను యువతను మోసం .......సాక్ష్యాలతో     


నిరుద్యోగ యువత, యువత నే వారి టార్గెట్, రూపాయి కట్టనవసరం లేదు మీరు క్వికర్ లో రిజిస్టర్ చేసుకోండి అని అంటారు, రిజిస్టర్ చేస్తే ఫోన్ కాల్ వస్తుంది, మిమ్మల్ని ప్రాసెస్ చెయ్యాలి అంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది అంటారు, లేదు కుదరదు అంటే రిజిస్టర్ చేసుకుంటారు , ఫారం ఫిల్ చేసి మాకు పంపించటమే అని అంటారు కానీ చేసిన పనికి డబ్బులు ఇవ్వరు, చికాకు వచ్చి మీరు పని చెయ్యకపోతే ఒక లాయర్ నోటీసు మీ ఇంటికి వస్తుంది, మీరు చేసిన పనులలో తప్పులు ఉన్నాయి, క్లైంట్ అందుకు గాను మీరు ఇంత కట్టాలి అని నోటీసులు వస్తాయి, గంట కి ఒకరు  వివిధ ఫోన్ నెంబర్ ల నుంచి ఫోన్ చేస్తారు, " మీరు డబ్బులు కట్టక పోతే మీ వ్యవహారం కోర్ట్ లో తెలుస్తాము " అని బెదిరిస్తారు ,    నిజమే సైనర్జి అవుట్ సోర్సింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే పేరు తో డేటా ఎంట్రీ జాబ్ లు అని మధ్యతరగతి యువతను, కాలేజీ చదివే యువత ను టార్గెట్ చేస్తారు, ఎందుకంటె ఈ రాకెట్ నిర్వహించేవారికి బాగా తెలుసు కోర్టు, కేసు లు అంటే విధ్యార్ది దశలో ఉన్నవారు భయపడతారు అని. ఈ ప్రక్రియ లో వారికీ రూపాయి ఖర్చు ఉండదు మొత్తం ఈమెయిలు ద్వార వ్యవహారం మొత్తం నడిపిస్తారు, ఫ్రీ కాల్స్ ఎలాగో ఉన్నాయి.


వీళ్ళు పంపించే నోటీసు లో అడ్రస్ నాసిక్ అని ఉంటుంది కానీ హెల్ప్ లైన్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. మినిస్టర్ అఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారిని సంప్రదిస్తే వారు    "సైనర్జి అవుట్ సోర్సింగ్ ప్రైవేటు లిమిటెడ్" (Synergy Outsourcing Services Pvt ltd) అనే పేరు మిద ఎటువంటి కంపెనీ రిజిస్టర్ చెయ్యబడలేదు అనే సమాచారం ఇచ్చారు. ఈ క్రింద అ సంభాషణ ఉంచాము వినవచ్చు.

అలాగే ఇన్వెస్టిగేషన్ లో భాగముగా   "సైనర్జి అవుట్ సోర్సింగ్ ప్రైవేటు లిమిటెడ్ " అనే కంపెనీ ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ 9542332569 కి ఫోన్ చేస్తే వారు చెప్పేది ఏమిటి అంటే వారిది సైనర్జి అవుట్ సోర్సింగ్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ అని, వారు ఇంటి వద్ద నుంచే డేటా ఎంట్రీ చేసుకునే జాబ్ లు చూపిస్తాము అని, మిది  రిజిస్టర్డ్ కంపెనీ అనే ప్రశ్న వేస్తే " ఎందుకు సర్ అలాగా అడుగుతున్నారు , ఏమి లేదు మీరు క్వికర్ లో హోం బేస్డ్ జాబ్స్ కి అప్లై చెయ్యండి మేమే కాల్ చేసి పని గురించి వివరాలు చెప్పుతము అని కాల్ కట్ చేసింది . ఈ క్రింద అ సంభాషణ పొందుపరిచాము, మీరు వినవచ్చు.అసలు ఎవరు వీళ్ళు అని అరా తీస్తే ఇది ఒక నకిలీ కంపెనీ, ఈ కంపెనీ కి రిజిస్ట్రేషన్ ఉండదు, డమ్మీ ఫోన్ నెంబర్లు,   హోం బేస్డ్ వర్క్స్ అని చెప్పి పార్ట్ టైం జాబ్ కోసం ఎదురుచూసే విద్యార్దులను ట్రాప్ చేసి, కొన్ని డమ్మి ఫారాలు పంపించి వాటిని నింపించి డబ్బులు ఇవ్వరు, పని మానేస్తే మీ వాళ్ళ మా కంపెనీ కి  ఇంత నష్టం వచ్చింది అని చెప్పి ఒక మెయిల్ పెడతారు, అలాగే వాళ్ళు ఒక నోటీసు ఈమెయిలు ద్వార జారి చేస్తారు, ఈ కోర్టులు గొడవలు మాకు ఎందుక అనుకునే విద్యార్ధులు (చట్ట పరిజ్ఞానం లేని వారు ) ఆన్లైన్ ద్వార ఈ నఖిలిలకి  డబ్బులు ఇచ్చేస్తారు అదే విరి వ్రుత్తి, క్వికర్ లో ఫ్రీ ఎకౌంటు, ఈమెయిలు సంభాషణలు ఫ్రీ, చివరికి నోటీసు పంపించేది కూడా ఈ మెయిల్ ద్వార వస్తే డబ్బులు వస్తాయి పోతే అంత ఫ్రీ ఇదే విరు నిరుద్యోగులతో చేస్తున్న లేటెస్ట్ దంద .

ఇది నిజంగానే ఆన్లైన్ జాబ్ కానీ, మోసం చేసేవాడికి మాత్రమే ఇది ఆన్లైన్ జాబ్.  వీళ్ళ బెదిరింపులు ఎలాగా ఉంటాయి అంటే ఒక బాధితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమెకు నోటీసు వచ్చింది...మీరు మాకు డబ్బులు కట్టకపోతే మీకు లోన్ లు రావు, ఒక వేళా మీరు విద్యార్ధులు అయితే మీ విద్య సంస్థలకు ఈ విషయం తెలియచేస్తాము, ఈ నోటీసు కూడా నషిక్  నుంచి వస్తుంది అండి, ఒక ఫేక్ కంపెనీ, రిజిస్టర్ కానీ కంపెనీ ఎన్ని లొసుగులు అడ్డం పెట్టుకుంటుందో అర్ధమయ్యిందా ? ఆన్లైన్ జాబ్ అంటే అంత సులువు కాదు " డబ్బులు ఎవరికి ఊరికినే రావు " సైబర్ నేరగాళ్లతో జరా భద్రం. ఈ క్రింద   ఒక బాధితురాలికి వచ్చిన ఈమెయిలు లో కొన్ని విషయాలు పొందు పరుస్తున్నాము చూడండి (కొన్ని కారణాల వాళ్ళ భాదితుల పేర్లు ఇందులో ప్రస్తావించటం లేదు ).
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics