Skip to main content

" రాజధాని " రాజకీయం లో ..... బి జే పి....జనసేన ...టి డి పి? బోత్య వ్యాఖ్యలు సాక్ష్యాలు     


ఆంధ్రరాష్ట్రం లో బోత్య వ్యాఖ్యలకు .....పొరపాటు బోత్య వ్యాఖ్యలు కాదు ఒక ప్రముఖ ఛానల్ విలేఖరి అడిగిన ప్రశ్నకి కి చెప్పిన సమాధానం లో నుంచి వచ్చిన రాద్దాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు.  నమ్మలేకపోతే ఈ క్రింద వీడియో చూడండి శివరామకృష్ణ కమిటి గురించి అడిగిన ప్రశ్న కి బోత్య చెప్పిన సమాధానం ఏమిటి అంటే అక్కడ అది సురక్షితం కాదు అనే విషయం మిరే చెప్పుతున్నారు (రాజధాని అక్కడ సురక్షితం కాదు అనే ప్రశ్న వేసిన విలేఖరి ) మిస్టర్ .*** అని, శివరామకృష్ణ కమిటి కూడా అదే సిఫార్స్ చేసింది, వేరొక చోట లక్ష ఖర్చు అయితే అక్కడ నిర్మనలకి అయ్యే ఖర్చు రెండు లక్షలు, అలాగే ప్రభుత్వం ఈ విషయం పైన సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. క్రింద వీడియో లో బోత్య  మాట్లాడిన మాటలు వినవచ్చు.


మరో వైపు కొడాలి నాని రాజధాని మార్పు అనే అంశాలు అవాస్తవం అని తేల్చి చెప్పేసారు. 

అసలు రాజధాని అంశం పైన రాజకీయ పరిణామాలు ఏ విధముగా ఉండవచ్చు ?


ప్రతి పక్ష పార్టీ ఈ విషయం గురించి ప్రజలలో ఒక అలజడి సృష్టించింది అది వాస్తవం, ఈ విషయం పైన రాజధాని ప్రాంతం వారు అ చుట్టు ప్రక్కల వారు అయోమయ పరిస్థితిలో పడి పోయారు. వారి ఆందోళన వారి బంగారు కళలు భగ్నం అయిపోతాయి ఏమో అని అంశం పైన, తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకం గా మారుతుంది అనే అంశం పైన.

ఈ కోణం లో ప్రతిపక్ష నేత సామజిక వర్గం వారికీ న్యాయం చేసారు అనే వాదనలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆలోచించవలిసిన విషయం ఏమిటి అంటే ప్రస్తుత పాలక వర్గాన్ని గెలిపించే ప్రయత్నం లో అదే సామాజికవర్గానికి చెందిన వారు అ ప్రాంతం లో చురుకుగా పని చేసిన   విషయాన్ని మరువకూడదు. ఒకవేళ రాజధాని మార్పు అనే ప్రస్థావన వాస్తావా రూపందలిస్తే వారు పశ్చాతాప పడినంత ఎవరు పడకపోవచ్చు. అవి ఎటువంటి పరిణామాలకి దరితిస్తావి అనే విషయం ఖాతరు చెయ్యకపోవటం అంత మంచి పరిణామం కాదు. 

పాలక పార్టీ   లో కీలక వ్యక్తి నోటి వెంట అ మాట వచ్చింది అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యమంత్రి నోరు మెదపకపోవటం, బి జే పి నుంచి కీలక నాయకులు వచ్చి ఇక్కడ రాజధాని రైతుల మిద జాలి చూపించటం, జనసేన పార్టీ అధినేత అ ప్రాంతాన్ని పర్యటించటం, రైతులని పరమర్శించటం లో ఒక వర్గం వారు రాజధాని రైతుల పక్షాన నిలపడినట్టు, పాలక వర్గం రాజధాని పరిధిలోని ప్రజలకు మరియు రాజధాని రైతులకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ప్రజలలో అభిప్రాయలు ఏర్పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్న్యాయం గా స్థిరపడలి అని అనుకున్న బి జే పి కలకు, ఈ అంశం ఒక అస్త్రం క్రింద ఉపయోగపడుతుంది అనే చెప్పాలి, ఎందుకంటె ఆంధ్ర రాష్ట్రం లో మతతత్వం తో ముందు అడుగు వెయ్యటం కష్టం, ఇటువంటి అంశాలు కలిసి వచ్చే అంశాలు అనే చెప్పాలి. ఒక వేళా రాజధాని మార్పు పైన స్థిరమైన నిర్ణయం పాలక పార్టీ తీసుకుంటే, రాష్ట్రం లో బి జె పి నేతలకు అంతకు మించిన మంచి  అవకాశం లేదు, కేంద్రం ప్రమేయం లేకుండా రాజధాని మార్పు సాధ్యం కాదు, ఒకవేళ రాజధాని మార్పు విషయం లో కేంద్రం సహకరించకపోతే రాజధాని పరిధిలోకి వచ్చే ప్రాంతం వారిని, అలాగే రాజధాని రైతులను బి జే పి వారు కాపాడిన వారు అవుతారు, ఒక హీరోటిక్ ఇమేజ్ బి జే పి కి  రాష్ట్రం లో దక్కుతుంది, బి జే పి అప్పుడు మండల స్థాయి నుంచి బల పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ( కొత్త వారిని ఆహ్వానించి ప్రోత్యహిస్తే ), ఒకరి ఆలస్యం మరొకరి అవకాశం.

ఇంకా వివిధ జిల్లాల వారు పలన  చోటనే ఎందుకు రాజధాని ని ఏర్పాటు చేసారు మా వద్ద ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు అనే అంశాల , " అమరావతి " పైన నాడు ఎన్ని విధాలుగా విమర్శలకు గురిచేసారో అదే విధముగా వేరొక " చోటు " ప్రస్తుత ప్రతిపక్షానికి విమర్శ అస్త్రం గా  మరియు మంచి పబ్లిసిటీ అస్పెక్ట్ గా ఉపయోగపడుతుంది. వారు చూపించిన దోవ వీరికి ఉపయోగ పడుతుంది. 

ఏ ఆరోపణలు అయితే  అప్పటిలో ప్రతిపక్షం పైన సంధించి ఈనాడు గేద్దనేక్కరో అ ఆరోపణలే తిరిగి వెంటాడతాయి అని చెప్పటానికి  సంకోచిన్చానవసరం లేదు.

రాజధాని మార్పు అనే అంశం పైన  ఎవరు నష్టపోతారు: రాజధాని పరిధిలో ఉన్న ప్రజలు అందరు నష్ట పోతారు,  అదే విధముగా పాలకవర్గం రాజధాని పరిధిలో పట్టు కొలిపోవటమే కాకుండా అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబల ఆదరణ కూడా కొలిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు , కన్స్ట్రక్షన్ విభాగం వారు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.   

రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టటానికి సంకోచించే పరిస్థితులు ఏర్పడతాయి, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితులలో, ఇటువంటి వార్తలు పాలక పార్టీ కి అంత మంచిది కాదు. ప్రకటనల వెనుక లాభం పొందే వారు ఎవరో తెలియదు కానీ, ఖచ్చితముగా ఇటువంటి విషయల కి సమాధానం ఐదు సంవత్యరాలకి ఒక్కసారి తెలుస్తుంది. 

ముఖ్యమంత్రి మౌనం : ఖచ్చితముగా రాష్ట్ర  ముఖ్యమంత్రి ఈ విషయం  పైన ఏదో ఒక రోజు   మౌనం విడతారు అనే ఆశించాలి, కానీ ఏ రోజు అనేది ఇక్కడ ముఖ్యం పూర్తిగా రాజకీయ వ్యుహాలు ప్రత్యర్డులు రచించిన తరువత మౌన విడితే అది ప్రత్యర్దుల ఖాతాలోకి వెళుతుంది, " మా పోరాటం పలిచింది" అనే వ్యాఖ్యలు వస్తాయి లేదా అంతకన్నా భిన్నమైన వ్యాఖ్యలు రావచ్చు.......? ఈ అంశానికి కట్ కట్ అని చెప్పగల ఒకే ఒక సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనం విడటం.              Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics