ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి ఎత్తిపోతల పధకం లో జరిగిన అవినీతి ని అసెంబ్లీ సాక్షి గా కడిగి పడేసిన "ఎలిజా" - రైతులకి అన్యాయం జరిగింది అని తేల్చి చెప్పేసారు



   
  • చింతలపూడి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం 
  • సాగు నిరు లేకపోవటం వళ్ళ  రైతులు ఇబ్బంది 
  • అది గమనించిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చింతలపూడి ఎత్తిపోతల పధకం అమలు చేసారు 
  • గత ప్రభుత్వం ఫేస్ 1 పూర్తి చెయ్యకుండా ఫేస్ 2 మొదలపెట్టారు 
  • భూమి కొలిపోయిన రైతులకు నష్టపరిహారం సరిగ్గా ఇవ్వకుండా, రైతులను ఇబ్బంది పెట్టారు 
  • రైతులకి ఇచ్చే నష్ట పరిహారం విషయం లో ఒక్కక్క చోట ఒక్క పరిమాణం  తీసుకున్నారు 
  • ఒక మండలం లో 22 లక్షలు ఎకరానికి ఇచ్చి - ప్రక్క మండలానికి 12 లక్షలు 15 లక్షలు నష్ట పరిహారం ఇచ్చారు 
  • దాన్ని అప్పటిలో రైతులు అడ్డుకొని , రైతులని కోర్టు మెట్టులు ఎక్కే పరిస్థితి తీసుకోని వచ్చారు 
  • ఈ బడ్జెట్ లో నష్టపరిహారం విషయం పైన మంచి కేటాయింపు ఇచ్చి రైతులకి న్యాయం చెయ్యవలసింది గా అసెంబ్లీ సాక్షి గా సంబంధిత మంత్రిని కోరిన చింతలపూడి శాసనసభ్యులు వి ఆర్ ఎలిజా
  • పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అనేక మంది నిర్వాసితులు ఉన్నారు, భూ సేకరణ లో దొంగ డాక్యుమెంట్ లు సృష్టించి అక్రమ లబ్ది పొందిన లబ్దిదారులు ఎక్కువ నిజంగా భూమి కొలిపోయినవారికి న్యాయం జరగలేదు  
చింతలపూడి ఎత్తిపోతల పధకం లో చింతలపూడి  నియోజకవర్గం లో రైతులకి అందచేయ్యవలిసిన నష్టపరిహారం లో పక్షపత ధోరణితో వ్యవహరించిన మునపటి ప్రభుత్వం యొక్క పని తీరుని " చింతలపూడి ఎత్తిపోతలు " ప్రస్తావనతో అసెంబ్లీ సాక్షి గా కడిగి పడేసిన చింతలపూడి శాసనసభ్యులు,  పోలవరం నిర్వసితుల విషయం లో జరిగిన అవకతవకలు, భూ సేకరణ లో జరిగిన అవినీతి  మొత్తం సాక్ష్యాలతో ప్రస్తవనలోకి తీసుకోని వచ్చారు. 



ప్రతిపక్ష హోదా లో ఉన్నప్పుడు ప్రస్తుత చింతలపూడి  శాసనసభ్యులు వి ఆర్ ఎలిజా నష్టపరిహారం విషయం లో అసమానతను ఖండిస్తూ నిరహరదిక్ష చేసిన రైతులకి మద్దతుగా ఉన్నారు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా రైతులకి మద్దతుగా నిలిచి పోరాడారు.

చింతలపూడి ఎత్తిపోతల పధకం వళ్ళ భూమి ని కొలిపోయిన రైతులకి తగిన న్యాయం చేసి వారికీ సమాన న్యాయం చేస్తూ నష్టపరిహారం ఇవ్వాలి అని సంబంధిత మంత్రిత్వ శాఖను అభ్యర్దించారు. 

వై ఎస్ ఆర్ వారసుడిగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సంబంధిత మంత్రి శాఖ వారు చింతలపూడి ఎత్తిపోతల లో భూమి ని కొలిపోయి అసమానత పరిహారానికి గురైన రైతులకి తగిన న్యాయం చెయ్యాలి అని రైతుల, అప్పటి పోరాటానికి సహకరించిన నాయకులు కోరుకుంటున్నారు. 

రైతుల పక్షపాతిగా నిలిచిన చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా కు సామజిక మాధ్యమాలలో  పార్టీ  యువనాయకులు ధన్యవాదాలు తెలియచేసారు.

నష్ట  పరిహారం లో అసమానత కి గురైన రైతులు అందరు ప్రస్తుత పాలక వర్గం పైనే నమ్మకం పెట్టుకోనియున్నారు, ఈ విషయాన్ని సున్నిత అంశం గా పరిగణంలోకి తీసుకోవాలిసిందే, ఎందుకంటె " "ఇవ్వరా " ఎలాగా ఇవ్వరో చూస్తాను  " అని అప్పటిలో  అన్న మాటల ప్రభావం చింతలపూడి నియోజకవర్గం లో  నేటి ఎన్నికల ఫలితాల మిద ఎంత ప్రభావం చూపించిందో ?  అనే అంశం పైన కూడా పరిశీలన చెయ్యాలిసిన అవసరం ఉన్నది !




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement