Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Monday, 1 July 2019

30 రోజుల పాలన కి రివ్యూ ఎందబ్బ ?     


యువకుడు, ఉత్యహవంతుడు , ఒక్క సంవత్యరం లోపల మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంట అనే ప్రకటన. రాష్ట్రం  లో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా, లేదా ముఖ్యమంత్రి పైన సినిమా ఏమైనా తీస్తున్నారా ? నెల కి రివ్యూ ఏంటి ?రాష్ట్రం లో ఉన్న సమస్యలే ఎక్కువ, ఆర్దికముగా రాష్ట్రం అతలాకుతలం అయ్యింది, ఒక ప్రక్కన ఇళ్ళు కూల్చి పడేస్తున్నారు అనే ఆవేదనలు, అక్రోదనలు, మరో ప్రక్కన ఇచ్చిన పధకాలకు ఆర్ధిక వనరుల కొరత ఇన్ని సమస్యల మధ్య ప్రభుత్వం ఉంటె ఒక నెల రోజులలో ఏమి మారుతుంది అని, ఎలాగా మారుతుంది అని చెప్పి నెల విశ్లేషణ.

ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఉన్న ప్రధాన సమస్య రాష్ట్ర ఆర్ధిక సంక్షోభం. అ సంక్షోభం నుంచి భయట  పడవేయ్యటం కష్టసాధ్యమే, అసాధ్యమేమి కాదు, అది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి తలుచుకుంటే.

వచ్చిన  ఒక్క అవకాశం, సువర్ణ అవకాశం అ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవటం లో ఉంటుంది అంత. ఆశ ఉద్యోగులకు జీతం పెంపు పైన నిర్ణయం తప్ప వచ్చిన నెలలో అన్ని ప్రకటనలే అలాగే   అక్రమ కట్టడాలు కూల్చివేతలు. ప్రభుత్వ ఆస్తులు ద్వంశం అయితే పర్వాలేదు నష్టం ప్రభుత్వం భరిస్తుంది కానీ పేద ప్రజల ఇళ్ళు కూడా అ కట్టడాలలో కొట్టుకొని పోయాయి వారి వ్యతిరేకత, శోఖలు పాలక పక్షానికి అంత మంచి పరిణామం కాదు.    "Lets live by example"ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వార తెలియచేసిన సందేశం, "వేరొకరు అనుసరించే విధముగా జీవనం సాగిద్దాము " అక్రమ కట్టడం ప్రభుత్వానిదే అయిన కూల్చి పడేస్తాము, అక్రమ కట్టడాలు ప్రోత్యహించము ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి తన చర్యల ద్వార ఇవ్వాలి అనుకున్న సందేశం.

బడ బాబుల జోలికి వెళ్ళకుండా, పేదవర్గం ఇళ్ళు కుల్చివేయ్యటం అనే అంశం కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది, అవే అనుమానాలు ఇప్పుడు చర్చనియంశం.  ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఇవే అంశాలని ఒక అస్త్రం లాగా సందిస్తున్నాయి.

బాబు పైన సానుభూతి : ఎక్కడో ఉన్న బాబు ని హడావిడిగా ఇక్కడికి రప్పించారు, ప్రజావేదిక కూలటం తో హడావిడి గా ఇక్కడికి వచ్చారు,  బాబు నివాసం ఉంటున్న ఇంటి కి సైతం నోటీసు లు అంటించారు ఇది ఏ చర్యో తెలియదు కానీ ప్రజలలో సానుభూతి మాత్రం విపరీతముగా పెరిగింది, పోయినసారి ఇదే అంశం ఇప్పటి  రాష్ట్ర ముఖ్యమంత్రి కి బాగా కలిసి వచ్చింది. " ప్రత్యర్ది దూరముగా ఉండటం కన్నా  కంటి  ముందలే ఉండాలి అనే ఆలోచన మంచిదే కానీ .....! "  అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నేతకు కూడా అదే విధముగా ప్రజలలో సానుభూతి వచ్చింది  అనే విషయాన్ని సందేహించనవసరం లేదు. ప్రతి పక్ష నేతకి ఈ అంశం కలిసి వచ్చే అంశమే.  అప్పటి పాలక పక్షం చేసిన తప్పే ఇప్పటి పాలక పక్షం చేస్తుందా ? ఎవరికి ఎవరు అవకాశం ఇస్తున్నారు

అందుకే నెలకి రివ్యూ అంటే కష్టం. పని చేసేవారిని పని చెయ్యకుండా తమ పొగడ్తలతో ఏ పని చెయ్యాలో తెలియని ఇబ్బందికి గురిచేసే స్వీట్ రివెంజ్ ఈ నెలసరి రివ్యూ . టి వి చానల్స్ కి ధీటుగా సోషల్ మీడియా పని చేస్తుంది, వారు ఎంత పొగిడిన, అభిప్రాయ వ్యక్తీకరణ మాత్రం ఎవరు ఆపలేరు.   అందుకే రివ్యూ కన్నా పని ని నమ్ముకుంటే ప్రతిఫలం దక్కుతుంది. ముఖ్యమంత్రి ముందుగానే చెప్పారు నాకు సంవత్యరం వ్యవధి కావాలి అని " సో " ......!
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image