ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

పార్కింగ్ కి చోటులేని చింతలపూడి గ్రామ పంచాయతి



     
చింతలపూడి మండలం, చింతలపూడి గ్రామ పంచాయతి లో పంచాయతి స్థలాలు అన్యాక్రాంతం చేసిన పెద్దలు, మరి చింతలపూడి గ్రామ అభివృద్ధి లో భాగముగా పంచాయతి కి ఒక పార్కింగ్ స్థలాన్ని ఎందుకు కేటాయించలేకపోతున్నారు. చింతలపూడి పంచాయతి ఆస్తులు మిగలలేదా? లేకుంటే మనసు ఒప్పుకోవటం లేదా ?

చింతలపూడి గ్రామ పంచాయతి లో ఉన్న ప్రతి పౌరుడు తెలుసుకోవలిసిన ప్రాధమిక సమాచారం అసలు చింతలపూడి గ్రామ పంచాయతి కి స్థిర చర ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని .  ఎందుకంటె అప్పుడే ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయ్యయో అందరికి తెలుస్తుంది.  ఇక్కడ ఒక సమస్య ఉంది సమాచారం తెలుసుకోవాలని అని ప్రయత్నం చేసిన వారికీ  సమాచారం ఇవ్వరు ?


విషయానికి వస్తే చింతలపూడి గ్రామ పంచాయతి మేజర్ పంచాయతి. కానీ ఇప్పటి వరుకు ఈ పంచాయతి ని అభివృద్ధి బాట లో నడిపించిన ఆనవాలు లేదు. అసలు చింతలపూడి గ్రామ పంచాయతి లో పార్కింగ్ సమస్య రావటానికి ప్రధాన కారణం పంచాయతి నిర్లక్ష్య ధోరణి అనే చెప్పాలి.

ప్రభుత్వం ప్రతి ఊరిలో ను వాహనదారులు వాహనాలు నిలుపుకోవటానికి ఒక స్థలాన్ని నిర్దేశించాలి, కానీ చింతలపూడి గ్రామ పంచాయతి ఇప్పటి వరుకు అ వైపుగా అడుగులు వెయ్యలేదు అది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. రోడ్ మిద పశువులు సేద తిరుతున్న పట్టించుకోకుండా, ఎంత మంది ఎన్ని ఫిర్యాదులు చేసిన దున్నపోతు మిద వన కురిసినట్టుగా ఉన్న వ్యవహార శైలి ని పలువురు తప్పు పడుతున్నారు. కనీసం రోడ్ మిద ఉన్న పశువులను జంతు సంరక్షణ కి  తరలించలేక పోతున్నారు. రోడ్ మిద సేద తిరుతున్న జంతువులను తప్పించుకున్న అవి అదుపు లో లేక వాహనాల రాకపోకలకు మరియు ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి.

రోడ్లు వెడల్పు చేసిన పశువులు రోడ్ కి అడ్డముగా ఉండటం, ప్రమాదవశాత్తు వాహనాలు అ పశువుల మీద వెక్కటం అవి గాయపడటం, వాటి యజమానులు నష్టపరిహారం కోసం గొడవ చెయ్యటం ఇలాగ చాల సంఘటనలు చింతలపూడి పంచాయతి లో చోటు చేసుకున్నాయి. ఈ మధ్య లో ట్రాఫిక్ సమస్య రావటం అసలు కారణం పంచాయతి వారు కావటం, కానీ మాట పడటం పోలీస్ వారి వంతు అయ్యింది.

పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చెయ్యటం వళ్ళ చింతలపూడి పంచాయతి కి ఆదాయం తప్ప నష్టం లేదు, రైతు బజార్ ఏర్పాటు చెయ్యటానికి ఏ ఏం సి పరిధిలో కావలసిన స్థలం ఉన్నది, కానీ పంచాయతి వారు కలగా చేసుకొని రైతు బజార్ ఏర్పాటు చెయ్యటం అభినందనియమే కానీ చింతలపూడి గ్రామం లో ఒక పబ్లిక్ టాయిలెట్ కూడా లేదు ఇందువలన ఇబ్బంది పడేది మహిళలే, అ విషయాన్ని దృష్టి లో పెట్టుకొని వేరొక పంచాయతి స్థలం లోనైన  పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఉంటె బాగుండేది.   

→ https://www.mayoclinic.org/diseases-conditions/kidney-infection/symptoms-causes/syc-20353387

" ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు ఆలోచించుకోవలసిన ప్రశ్న - మొగవారికి ఈ స్వాతంత్ర భారత  దేశం లో మూత్ర విసర్జన చేసుకునే స్వేచ్చ ఉన్నది, కానీ బహిరంగ ప్రదేశాలలో, ప్రయాణ సమయాలలో మన కూడా ప్రయాణించే స్త్రీల యొక్క పరిస్థితి ఏమిటి అని ? - మొగవారు ఒక గంట మూత్ర విసర్జన చెయ్యకుండా  ఆపుకుంటే వారు చెప్పుకోలేని బాధ అర్ధమౌతుంది " 

మూత్రవిసర్జన సరైన సమయములో చెయ్యకపోవటం యురిన్ ఇన్ఫెక్షన్ కి ఒక కారణం,   యురిన్ ఇన్ఫెక్షన్  వలన కిడ్నీ దెబ్బతింటుంది, అశ్రద్ధ చెయ్యటం వలన ప్రాణాపాయం ఉంటుంది.

ఇంకా పార్కింగ్ సమస్య విషయానికి వస్తే ఎవరి కొంపలు కుల్చనవసరం లేదు, పార్కింగ్ చేసుకోవటానికి ఒక స్థలాన్ని పంచాయతి నిర్దేశిస్తే దాని వలన పంచాయతి కి ఆదాయం వస్తుంది, అలాగే ఒక కుటుంబం లో ఒకరికి ఉద్యోగం దొరుకుతుంది. 













 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement