Skip to main content

కేంద్ర బడ్జెట్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చింతలపూడి శాసనసభ్యులు - వి ఆర్ ఎలిజా     

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కవ్విస్తున్న కేంద్ర ప్రభుత్వం. విభజన కి గురైన  ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లో ఉన్నది, ఇది సామన్య ప్రజలని ఎవరిని అడిగిన చెప్పుతారు, అ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదు అంటే ఎవరు నమ్మరు. 2019 కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం చేసిన ఖ్యాతి కేంద్ర ప్రభుత్వం దక్కించుకుంది. ప్రత్యేక హోదా ప్రక్కన పెడితే కనీసం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అయిన పోలవరం ప్రాజెక్ట్ కి కూడా తగిన ఎటువంటి కేటాయింపు చెయ్యలేదు కేంద్ర ప్రభుత్వం.రాజధాని ని కనీసం పరిధి లోకి కూడా తీసుకోలేదు, కేంద్రీయ, గిరిజన యూనివర్సిటీ లకు అతి తక్కువ బడ్జెట్  కేటాయింపు తప్ప ,  రాష్ట్ర అభివృద్ధి కి ఎటువంటి కేటాయింపు ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకి ఎలాగా బడ్జెట్ కేటాయించారో ఆంధ్ర రాష్ట్రానికి కూడా బడ్జెట్ అలాగే కేటాయించారు.


కవ్వించటం :- ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో బి జే పి కీలక పాత్ర పోషించాలి అని అనుకుంటున్నది, ఇది ఎవరు అంగీకరించిన అంగికరించకపోయిన పచ్చి నిజం. కానీ అప్పటిలో  రాష్ట్రం లో బి జే పి ని బల పరిచే విధముగా పని చేసే సరైన నాయకులు లేరు ఈ విషయం గ్రహించిన బి జే పి తన సొంత వ్యూహాలు రచించింది అనే చెప్పాలి, ఇక్కడ డిఫెన్సు కి మాత్రమే కొంత మంది ని ఎంపిక చేసిన కమలం , అసలు వ్యూహం కవ్వింపు చర్యల తో ప్రస్తుత పాలక పక్షాన్ని దగ్గర తీసినట్టుగా వ్యవహరించి పొమ్మనక పోగాపెట్టినట్టు అప్పటి పాలక పక్షాన్ని తనంతట తనే దూరం అయ్యే విధముగా చేసింది, అప్పటి పాలక పక్షం ఎన్ని విమర్శలు చేసిన ప్రధాన మంత్రి హోదా లో ఉన్న వ్యక్తీ పేరులు మర్చి సామజిక మాధ్యమంలో ఎన్ని దుర్భాషలు ఆడిన ఒక్క మాట తులలేదు , అన్నిటికి సమాధానముగా  "ఎన్నికలు వస్తున్నాయి చూస్కోండి " మోడీ చేసిన వ్యాఖ్య.

ఇప్పుడు పాలక పక్షానికి  కేంద్రం అదే పరీక్షా పెడుతుంది. అవే కవ్వింపు చర్యలు. ఒక వేళా రాష్ట్ర ముఖ్య మంత్రి అ కవ్వింపు చర్యలకు స్పందిస్తే , ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురుకునే పనిలో నిమజ్నం అవ్వాలి, అంటే రాష్ట్ర పాలన పైన అంతగా దృష్టి పెట్టలేరు, పైగా కేంద్రం పైన పోరు లో ఉపయోగం సున్యం, గుడ్డి గుర్రాన్ని నిల్ల వరుకు "నడిపించాగలం కానీ నిరు త్రాగించాలేము "  .

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఏమి చేసారు : ఏ ప్రదేశాన్ని అయిన పిడించేది నిరుద్యోగమే,  ఇప్పటికి ఇప్పుడు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కష్టమే, అందుకే ప్రైవేటు సంస్థలను ప్రోత్యహించి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయ్యించి నిరుద్యోగ యువత కు ఫార్మ వంటి కంపెనీ ల లో ఉద్యోగ అవకశాలు కలిపించారు, డి ఆర్ డి ఏ లో నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకశాలు ఇప్పించారు, అయిన తదనంతరం డి ఆర్ డి ఏ సంస్థ అయిన ఉన్నప్పటి లాగా పని చెయ్యలేదు. "తినటానికి తిండి  దొరికితే మీసాలకి సంపంగి నూనే వ్రాసుకోవచ్చు"

ఉద్యోగానికి  బడ్జెట్ కి సంబంధం ఏమి ఉన్నది ? ఖచ్చితముగా ఉన్నది రాష్ట్ర అభివృద్ధి అంటే ఆర్ధిక స్థిరత్వం కాదు రాష్ట్ర పౌరులు క్షేమముగా సుఖముగా ఉండటం, వనరులు లేనప్పుడు వనరులు సృష్టించాటమే నిజమైన నాయకుడి లక్షణం.  నిరుద్యోగం ఒక అంతర యుద్ధం, మానసిక అసంతృప్తి ఈ సమస్య ప్రభుత్వం మిద ఎప్పుడు తీవ్ర ప్రభావం  చూపిస్తుంది. పరిశ్రమలు ఏర్పాటు కి ప్రోత్యాహం చేస్తే చాలామందికి ఉపాధి దక్కుతుంది, ప్రభుత్వానికి ఉపాధి లేని వారికీ ఇచ్చే సొమ్ము మిగులతుంది , పరిస్రములు కట్టే పన్నులు రాష్ట్ర ఆదాయము లో  కీలక పాత్రా పోషిస్తాయి, ఎప్పుడు అయితే నిరుద్యోగ సమస్య తోలిగిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిద సగం భారం తోలిగినట్టే .

వనరులు సృష్టించటం తప్ప  ఆంధ్రరాష్ట్రానికి మరో అవకాశం లేదు అనే చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం  తో ఖయ్యం ఇప్పుడు అనవసరం, నిరుపయోగం. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తో అవసరం లేదు, వారి సరిపడా మద్దతు ఉన్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బి జే పి ఒక విధముగా బెదిరిస్తున్న సూచనలు కనపడుతున్నాయి, మమ్మల్ని ఎన్ను కొనిదె మీకు చేసేది ఏమి లేదు అని !

ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఒక మాస్ ఇమేజ్ ఉంది, మొండి వారు అని " మొండి వాడు రాజు కన్నా గొప్పవాడు " ఆర్ధిక వనరులు సృష్టించే శక్తి యుక్తులు ప్రస్తుత ముఖ్యమంత్రి కి ఉన్నాయి అనే వాదనలు లేకపోలేదు. హక్కు లు సాధించే అవకాశం లేనప్పుడు పోరాడే విధానాలు మార్చాలి, చెయ్యగలము అని చేసి చూపించాలి, గెలిచి చూపించినట్టు.చింతలపూడి నియోజకవర్గం  శాసనసభ్యులు వి ఆర్ ఎలిజ బడ్జెట్ లో ఆంధ్రరాష్ట్రానికి కేటాయించిన నిధుల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇండియన్ రెవిన్యూ సర్వీస్ గా విధులు నిర్వహించిన అయినకు రాష్ట్ర ఆర్ధిక స్థితి గతుల పైన అవగాహనా ఉండటంతో రాష్ట్రానికి కేటాయించిన నిధుల లో పోలవరం , రాజధాని ప్రస్తావన లేకపోవటం అయినను నిరాశ పరిచిన, తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన తమకు నమ్మకము ఉన్నదని, అయిన శక్తి మేరకు  రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపిస్తారు అనే నమ్మకం మాత్రం ఎక్కడ సడలలేదు అని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం.


     
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics