ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జగన్ పార్టీ ఫిరాయింపులు అమోదిస్తారా !......కార్యకర్తల పరిస్థితి ఏమిటి ......?     


వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు  ఆమోదిస్తార ! ఎందుకంటె పైన స్థాయి లో ఉన్న నాయకులు అంత ఏదో ఒక పదవి లో తమకి నచ్చినట్టుగా ఉంటారు. ఏది ఏమైనా పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎంతో కొంత తేడ రాకుండా ఉండదు అది మానవ నైజం.  మరి క్రింద స్థాయి లో కార్యకర్త గా పని చేసిన వారి మనోభావాలు ఎలాగా ఉంటాయి.పార్టీ  ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఒక ప్రధాన పక్ష నేత గా వై  ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసిందే, అటువంటిది సామాన్య కార్యకర్త లు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు. ఒక కార్యకర్త కి కావలిసింది ఏమిటి గుర్తింపు, అ కార్యకర్త ని నమ్మి పార్టీ కి ఓటు వేసిన వారికీ సేవ చేసుకోవాలి .

పార్టీ పవర్ లోకి వచ్చిన తరువాత ఎవరైన జై కొడతారు, కానీ పార్టీ పవర్ లోకి రాకముందు జై కొట్టేవాడే నిజమైన కార్యకర్త. మరి అటువంటి పార్టీ కార్యకర్తలకు జగన్ ఎటువంటి న్యాయం చెయ్యబోతున్నారు.


  • ఎక్కువ మంది విక్షించింది 

టార్గెట్ బాబు ఎందుకు ? తెలుగుదేశం పగ్గాలు ఎవరి చేతిలో ?


పార్టీ లో కొత్తవారి చేరికతో ఎవరికి విభేదాలు ఉండవు. కానీ ప్రత్యర్ది పార్టీ లో దిర్గాకాలం పని చేసి, పార్టీ కార్యకర్తలను రక రకాల ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు పార్టీ మారి మళ్ళి రాష్ట్ర పగ్గాలు చెప్పటిన పార్టీ లో ఉన్న కీలక కేడెర్ మీద పెత్తనం చెలాయించి, వారిని వివిధరకాల అవమానాలకు గురి చేసి వారిలో వ్యతిరేక పవనాలు వీచే లాగా చేసి కార్య కర్తల మనోభావాలు దెబ్బతినే విధముగా ఒక కోవర్ట్ ఆపరేషన్ చేస్తే ?


నిజమే ప్రత్యర్ది పార్టీ లో ఎవరు ఉండకుడదు అని అందరికి ఉంటుంది, కానీ ఎవరి మీద అయితే పోరాటం చేసారో వారితోనే కలిసి పని చెయ్యమంటే " మండదా ?"  ఈ పార్టీ అ పార్టీ అని కాదు అన్ని పార్టీ లు ఒక్కసారి ఆలోచించాలి . బ్రిటిష్ వారు భారతీయ ద్రోహుల కి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు " మీ వారిని నువ్వే మోసం చేసావు మేము నిన్ను ఎందుకు నమ్మాలి అని " .


దమ్ము ఉన్న పాలన చేస్తే పార్టీ తో సంభందం లేదు వ్యక్తిగతంగానే ఓటులు పడతాయి. వేరే పార్టీ నుంచి  మన పార్టీ లోకి వచ్చారు అని చెప్పి కొత్తగా వచ్చినవారికి  క్రియాశీలక బాధ్యతలు అప్పచేప్పితే  9 సంవత్యరాలు ఏక దాటిగా పార్టీ కోసం ఎండని, వానని లేకుండా  లెక్కచెయ్యకుండా జెండా మోసిన కర్యకర్తల మనోభావం ఎలాగా ఉంటుంది అనేది నాయకులు చేసుకోవలిసిన ఆలోచన.గెలుపు తెలిసి వెంట నడిచేవాడికి, గెలుపు  కోసం వెంట నడిచేవాడికి చాల వెత్యాసం ఉంటుంది. వినటానికి రెండు ఒకరకముగానే ఉంటాయి కానీ చాల తేడ ఉంటుంది. ప్రజలు అన్ని గమనిస్తుంటారు ఇది "ముఖ్యమంత్రి " మాట, నిజమే, ప్రజలకి అన్ని గుర్తే - మరి అ సమయములో ఏ అవినీతి మీద పోరాటం చేసారో , వారితోనే కలిసి ప్రజలకి కనిపిస్తే " నమ్మకం " ?. Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image