Skip to main content

విజయగాధ వెనుక స్పూర్తిదాయకమైన ప్రయాణం - అనిత - శ్రీధర్   
ప్రతి మనిషి జీవితం లో చాల ఘట్టాలు ఉంటాయి, ముఖ్యముగా  రాజకీయ నాయకుల జీవితంలో. అయితే ఇక్కడ ప్రస్తావించేది ఏం పి శ్రీధర్ గురించి కాదు, ఏం పి అవ్వటానికి మునుపు కోటగిరి శ్రీధర్ ప్రయాణించిన విధానం అందుకు సహకరించి సోదరి, ఒడుదుడుకులను ఎదురుకున్న రక్త సంబంధం. ఈ ఆర్టికల్  ఎంత మందికి నచ్చుతుంది అనే విషయం మాకు తెలియదు,కానీ గెలవాలని కసి ఉండి, మిశ్రమ పరిస్థితులలో కూడా అవమానాలు దిగమింగి, ఎదురు దెబ్బలు లేక్కచేయ్యకుండ, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, అన్ని  గమనిస్తూ,  గ్రహించి వ్యూహాలు రచించి నెగ్గుకొచ్చి తన ఎదుగుదలను అడ్డుకున్న వారి ముందల కాలర్ ఎగరేసి, కళ్ళల్లో కళ్ళు పెట్టి " చూసావా నేను గెలిచాను ఏం .....?" అనే విధముగా గెలిచి చూపించాలి అనుకునే వారి కి మాత్రం ఈ ఆర్టికల్ ఖచ్చితముగా నచ్చుతుంది స్పూర్తినిస్తుంది అని ఆశిస్తున్నాం .


దివంగత నేత కోటగిరి విద్యాధరరావు అంటే  చింతలపూడి నియెజకవర్గం మరియు ఆంధ్రరాష్ట్రం లో ఈ పేరు తెలియని వారు ఎవరు లేరు  1978 నుంచి 2004 వరుకు ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రం లో ఒక నాయకుడు ఎన్ని కీలక పదవులు చెయ్యగలడో దాదాపు ఆయన మొత్తం అన్ని పదవులు చేసియున్నారు. అటువంటి కుటుంబం లో ఉన్నవారికి పదవి లో ఉన్నంత కాలం సమాజం అడకకుండానే  మర్యాద గౌరవం ఇస్తుంది, కానీ పదవి లో లేని సమయం లో వారితో నడిచే వారు చాల కొద్ది మంది. ఒక్కసారి అనుభవం అయిన తరువాత కానీ వాస్తవాన్ని గ్రహించలేని పరిస్థితులు ఏర్పడతాయి.

కానీ ఒక్కసారి ఇంటి పెద్దని కొలిపోతే అ పరిస్థితులు వేరు ? కొన్ని సంబంధాలు తెగిపోతాయి, కొన్ని సంబంధాల నిజా రూపాలు భయట పడతాయి, ప్రపంచం మొత్తం కొత్తగా ఉంటుంది, ఎవరు పట్టించుకోరు, గుర్తించరు, అవకాశాలు ఇవ్వటానికి కూడా లెక్కలు వేస్తారు,  అవకాశాలువచ్చిన చేతికి రానివ్వకుండా ఎన్నో అడ్డంకులు, చులకన చేసే  మాటలు, అక్కరలేని పుకారులు ఒకటి కాదు రెండు కాదు అటువంటి సమయములో భయపడినవాడి గురించి అయితే ఇప్పుడు ప్రస్థావన కాదు కానీ. 

మాకున్న సమాచారం ప్రకారం   ప్రస్తుత పార్లమెంటు సభ్యులు   కోటగిరి శ్రీధర్ గారి తండ్రి చనిపోయిన తరువత రాజకీయ అరంగేటం బి జే పి నుంచి చేసారు, అప్పుడే రాజకీయ భవిష్యత్తు మొదలుపెట్టిన శ్రీధర్ కి అనుభవపుర్వక పరిస్థితులు ఎదురుపడ్డాయి. రాజకీయముగా ఎదగనివ్వకుండా కొంత మంది ముమ్మరముగా ప్రయత్నం చేసారు, అందులో నియోజకవర్గ పెద్దలు చాల మంది ఉన్నారు, సామాన్యముగా రాజకీయం అంటేనే భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణ, తండ్రి బ్రతికి ఉన్న సమయములో నడిచినవిధముగా ఏది అంత సులువుగా నడవలేదు. ఎదగానివ్వకుడదు అనే ఆలోచనతో ప్రత్యర్డులు చేసిన ఆలోచనలను, వేసిన వ్యూహాలు  అంతే సమర్ధత తో తిప్పి కొట్టటానికి చాల సమయమే పట్టింది.


కలిసివచ్చిన అంశాలు : శ్రీధర్ సోదరి అనిత ఆమె సోదర భావనతో వేనుదండగా ఉండటంతో, ప్రచారం లో కూడా ఆమె సోదరుడి వెంట ఉండటము వలన, శ్రీధర్ చింతలపూడి లో జరిగిన సభ లోనే బహిరంగంగానే చెప్పారు " నా ప్రక్కన మా అక్క ఉన్నది, కోటగిరి విద్యాధరరావు గారి అమ్మాయి, ఎవరో ఏదేదో చెప్పారు అది తప్పు అని చెప్పండి, మేమంత ఒకటే కుటుంబం  " ఇవి అప్పటి శ్రీధర్ చింతలపూడి లో  వై ఎస్ జగన్  సభ లో చేసిన వ్యాఖ్యలు.

శ్రీధర్ సోదరి అనిత కూడా ప్రచారం చాల ముమ్మరంగా  చేసారు. రక్తసంబంధికులు ఇద్దరు పూనుకొని మరి టి డి పి లోని ముఖ్య నాయకులను పార్టీ మరే దిశ గా వ్యూహాలు రచించారు , సక్సెస్ అయ్యారు, టి డి పి లో కూడా వారి ప్రభావాన్ని చూపించే స్థాయి కి చేరుకున్నారు.  ఐకమత్యం తో ముందుకు సాగారు, వారసత్వ పరంపర కొనసాగించారు.

కానీ ఎంత మంది ఎన్ని వ్యుహాలు రచించిన అక్క తమ్ములు ఇద్దరు ప్రతివ్యుహలు రచించి ఎత్తులకు పై ఎత్తు వేసారు, అప్పటికే స్థానిక నాయకుల పైన ఉన్న వ్యతిరేకత అన్ని కలిసి వచ్చాయి.


ప్రతికూల పరిస్థితి లో నాకెందుకు అని వెను తిరుగుంటే ?

ఇద్దరు కసిగా నిలపడ్డారు, ఎదగానివ్వకుడదు  అనే ఆలోచన  ఇప్పుడు ప్రత్యర్దుల మనసులో ఉంటుందో లేదో తెలియదు కానీ విరి ఇద్దరి కి ప్రత్యర్డులు ఎదురు పడితే ..........మనలని అవమానించిన వారి ముందల గెలిచి నిలపడితే, వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే, మనలని తొక్కేయాలి అనుకునే వారి ముందు రొమ్ము విరుచుకొని నిలపడితే  ..........   ఎలాగా ఉంటుంది ?. ప్రజాస్వామ్యం లో గెలుపు ఓటములు సహజమే, ఇక్కడ గెలుపు ఓటమిని గురించిన ప్రస్థావన కాదు- ఐకమత్యం , సమర్ధత, ఓపిక , పోరాటం గురించిన విశ్లేషణ ఈ నాలుగు అంశాలు నిర్దేశించిన దిశలే   "ఈ విజయగాధ వెనుక స్పుర్తిదయకమైన ప్రయాణం"  .
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics