Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Sunday, 9 June 2019

పశ్చిమగోదావరి జిల్లా లో అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి దృష్టి ఎందుకు పెట్టడం లేదు ? తిగలాగితే డొంక అంత కదిలే అందుకే విద్యుత్తు ఒప్పందాలు విషయములో జాగ్రత్త పడ్డారా?   ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పైన కేంద్ర ఇంధన శాఖ స్పందించింది నిజమే.  ఒప్పందాలు పునః పరిశిలన చేస్తే పారిశ్రామిక అభివృద్ధి కి మంచిది కాదు అని చెప్పి, ఇందుకుగాను అ శాఖ ఇచ్చిన సూచనా ఏమిటి అంటే పెట్టుబడిదారులు భవిష్యత్తు లో పెట్టుబడులు పెట్టటానికి వెనకడతారు, ఒప్పందం లో  కుట్ర జరగటం లేదా మితిమీరిన లబ్ది చేకురింది అని నిరుపించపడితే అప్పుడు పునః పరిశీలన చేస్తాము అని చెప్పారు. అలా కానీ పక్షములో గత ఒప్పందలతో కొనసాగాలి అని నిర్దేశించారు.ఇది ఒక కోణములో చూస్తే  కుదరదు అని తెల్చిచేప్పినట్టు ఉన్నది! కానీ తిక్షణముగా పరిశీలిస్తే ఎన్నో కోణాలు ఆవిష్కరిస్తాయి.


తిగలాగితే డొంక అంత కదిలే సూచనలు ఉన్నాయి : ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తే ఒక్క ఆంధ్రరాష్ట్రం లోనే కాదు, యావత్తు భరత్ దేశం లో కేంద్ర ప్రభుత్వ ఆధీనములో ఉన్న రాష్ట్రాలు అన్నిటి లో కూడా ప్రతి పక్ష పార్టీ ఇదే అంశాన్ని లేవనెత్తితే, అ వైపుగా అడుగులు వేస్తే పరిస్థితి ఏమిటి ?అదే కేంద్ర ప్రభుత్వం సంకోచం కూడా........  ఈ ఉద్దంతాన్ని ఉదాహరణ గా  తీసుకోని దేశ వ్యాప్తముగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధముగా నిర్ణయాలు తీసుకోని, ఆంధ్రలో ఆమోదించారు ఇక్కడ కూడా ఆమోదించండి అనే సూచనలు లేక పోలేదు. అప్పుడు అవినీతి ఆరోపణలు ఎదురుకోవటములో, ఇరకటములో  పడేది కేంద్ర ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు చాల తెలివిగా రాజకీయ వ్యూహం రచించారు, రాష్ట్రం లో పదవిలోకి వస్తే ఆర్ధిక వణరులు వచ్చే విధముగా పెట్టుబడికి దారులు ఉంచారు, అలాగే ఒక వేళా రాష్ట్ర పగ్గాలు చేపట్టకపోతే రాష్ట్ర ఖజానా కాలిగానే ఉంటుంది. ఒక్కసారి పరిశిలిస్తే అంత క్షుణ్ణముగా అర్ధమవుతుంది.తను కాకుండా కొత్తగా ఎవరైన ప్రభుత్వం ఏర్పాటుచేస్తే వాళ్ళు ఆర్ధిక సంక్షోభం ఎదురుకోవలిసిందే. రాజకీయ వ్యూహం లో ఇది ఒక భాగం.

బి జే పి ప్రభుత్వం ఆకాంక్ష ప్రతిపక్ష పార్టీ ని ఇబ్బంది పెట్టడం కాదు, ఆంధ్రరాష్ట్రం లో తమ రాజకీయ వ్యూహాన్ని అమలుపరచాలి. వారికీ ఎవరు ప్రత్యక్ష శత్రువులు లేదా మిత్రులు కాదు.  ఒక్కసారిగా ఆంధ్రరాష్ట్రం లో బిజెపి ని బలోపేతం చెయ్యటం కష్టం,  నెమ్మదిగా పుంజుకోవాలి, అందుకుగాను స్నేహ పూర్వక సంబంధాలు అనుసరిస్తే ఎప్పటికి ఆంధ్రరాష్ట్రం లో మిత్రపక్షాలుగా ఉండిపోవలిసిన పరిస్థితి. రాష్ట్రం లో బలమైన నాయకత్వం లేదు! పార్టీ ని ఎదగనివ్వకుండా పార్టీ లో ఉన్నవారు చేస్తున్న చర్యలు అధిష్టానం గమనిస్తూనే ఉంటుంది. అందుకని కొత్త కేడెర్ ని బి జే పి ఏర్పాటుచేసుకోవాలి , ఇప్పటికిప్పుడు కొత్త కేడెర్ ని ఏర్పాటు చెయ్యాలి అంటే కష్టం, అందుకుగాను స్థానిక రాజకీయ పార్టీ ల నుంచి ముఖ్య నేతలు తన అదుపాజ్ఞలలో పెట్టుకోవటం అవసరం . ప్రస్తుతం ఉన్నవారు పార్టీ ని ఆంధ్రరాష్ట్రం లో బలోపేతం చెయ్యటానికి ఎటువంటి కృషి చెయ్యటం లేదు అనేది వాస్తవం, అందుకని టి డి పి లో ఉన్న ముఖ్యనేతలు బి జే పి లో చేరితే ? ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిపక్ష హోదాలో ఉండవచ్చు, నెమ్మదిగా పార్టీ పుంజుకునే అవకాశం ఉంది, మొత్తానికి ఆంధ్రరాష్ట్రం లో కమలం వికసించాలి అనేది అధిష్టానం లోగుట్టు. బాబు కి ఈ విషయం బాగా తెలుసు అందుకే ఓపిక పట్టలేకపోయారు, ఒక్కసారిగా బి జే పి స్నేహాన్ని దిక్కరించారు, కాంగ్రెస్ తో దోస్తీ చేసారు, నిజానికి బి జే పి కి కావలిసింది కూడా అదే, వొద్దు అనక పోమ్మనటం.

ఇక్కడ ఎవరికి ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లెవ్వు అన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తప్ప , రాజకీయముగా ఒక్క నిర్ణయం తీసుకోవాలి అంటే దాని అది అంతము కూడా ఆలోచించాలి,!ఉదాహరణకు " ఒక మారుమూల పల్లెటూరులో ప్రజల నివాసస్థలము లో మైనింగ్ పర్మిషన్ ఏ పద్దతిలో,   ఎలాగా ఇస్తారు? "  పశ్చిమగోదావరి జిల్లా లో చింతలపూడి నియోజకవర్గం లో     పచ్చటి పొలాల మధ్య జరుగుతున్నా ఈ ఉదంతమే ఒక ఉదాహరణ,    పర్మిషనలు  ఎలాగా వచ్చాయి?  వ్యతిరేకించిన ప్రజల మీద కేసులు ఎందుకు నమోదు చేసారు ? పర్యావరణన్ని పట్టించుకోకుండా నివాస స్థలాల మధ్య మైనింగ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది ఎవరు ? అసలు అ డీల్ ఎవరిది ? సంతకం పెట్టిన వారు ఎవరు ? పెట్టించిన వారు ఎవరు ? అ మంత్రి శాఖ ఎవరిది? అ శాఖ ఎవరి అదుపాజ్ఞలలో ఉండేది? పచ్చటి పల్లెల లో  ఎన్నిటిలో ఇటువంటి పర్మిషన్లు ఇచ్చారు?  ఒక్కక పర్మిషన్ కి ఎంత ముడుతుంది ?  బాధిత ప్రజల మీద ఉక్కుపాదం మోపిన అప్పటి పోలీస్ బసులు ఎవరు ? ఎవరు దగ్గెర ఎంత  ముట్టింది? కాగితాలలో ఉన్నదానికి, భయట ఉన్నదానికి తేడ ఉన్నదా లేదా.? ఇలాగ రాష్ట్రం లో ఎన్ని చోట్ల, ఎక్కడ, ఎన్ని విధాలుగా జరిగాయి ?

సాక్ష్యాలు సేకరిస్తున్నాము! త్వరలో - తిగలాగితే డొంక కదిలేది ఇలాగె !


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image