Skip to main content

జాగ్రత్త పడవలసింది టి డి పి కాదు ......     

ఆంధ్రరాష్ట్రం లో మారుతున్న రాజకీయ పరిణామాలు, సుజనా చౌదరి, సి యం రమేష్ , టి జి వెంకటేష్, గరికపాటి మోహనరావు మొత్తం ఆరుగురు లో నలుగురు ఏం పి లు బి జే పి లో చేరియున్నారు. ఇందుకు షాక్ కి గురి అవ్వలిసింది టి డి పి కాదు  , ప్రస్తుత పాలక పక్షమే ఇందుకు షాక్ కి గురి అవ్వాలి.  బి జే పి తన రాజ్యవిస్తరణ భారత దేశం మొత్తం చేయ్యదలుచుకుంది, ఎవరికి శాశ్వత శత్రువు కాదు, ఎవరికి శాశ్వత మిత్రువు కాదు అనే సూత్రం అందరికి తెలిసిందే.


  • ఎక్కువమంది విక్షించిది 

విజయగాధ వెనుక స్పూర్తిదాయకమైన ప్రయాణం - అనిత - శ్రీధర్


టి డి పి కి 2019 ఎన్నికలు మరువలేని పరాజయమే, ఒక రకముగా చెప్పాలి అంటే ఇళ్ళు కాలి ఉన్నవాడికి గడ్దేము తగలపడితే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు టి డి పి ని విడిన ఏం పి ల విషయం లో కూడా అ పార్టీ అధినేతకి అంతే బాధ ఉంటుంది తప్ప, పార్టీ కి నష్టం ఉండదు.

రెండు పార్టి ల కి జరిగే యుద్ధం లో  తగలడిపోతున్న రాష్ట్ర భవిష్యత్తు లో  బి  జే పి చలి మంట కాగుతుందిఅనే చెప్పాలి.
సుజనా చౌదరి, సి యం రమేష్ ఇద్దరు టి డి పి అధినేతకు   ఎంత విధేయులో అందరికి  తెలిసిన విషయమే, పూర్వపు స్నేహం ఎలాగో ఉంది, తమని తము కాపాడుకోవటానికో లేదా స్వామి భక్తీ చూపించటనికో వారు పార్టీ ఫిరాయించారు అనే అనుమానాలు లేకపోలేదు.

మొత్తానికి రాజకీయ వ్యూహాలు మొదలు అవుతున్నాయి, అ వ్యూహాలు చేసిన పొరపాటుని  సరిచేసుకోవటానిక లేదా పూర్తిగా పార్టీ ని బిజేపి లోకి విలీనం చెయ్యటానికా? 

అధికారికముగా ప్రకటించకపోయిన మోడీ దీవెనలు ప్రస్తుత పాలక పార్టీ కి లబించాయి అనేది వాస్తవం, అదే విధముగా తెలంగాణా లో కే సి ఆర్ సర్కార్ కు కూడా. అయితే ఏ స్వార్ధం లేని రాజకీయం ప్రపంచం లో ఎక్కడ ఉండదు. ఇప్పటి వరుకు అంత బాగానే జరిగింది.....టి డి పి  హయంలో జరిగిన అవినీతి ని ఎండకట్టాలి అని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రయత్నా లోపం లేకుండా అన్ని విధాల ప్రయత్నం చేసారు, అ క్రమంలో పోలవరం లో 2500 కోట్ల కాంట్రాక్టు టెండర్లు లేకుండా ఒక్కరికే ముట్టచెప్పిన విషయం గురించిన కీలక విషయాలు భయటకు వచ్చే సమయములో ఏం పి లు బి జే పి కి సరెండర్ అయిపోయారు.

మళ్ళి బి జే పి గూటికి టి డి పి ?: ఏమో చెప్పలేము, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఏ క్షణన ఏమి జరుగతుంది అనేది ఉత్కంఠె. బిజెపి ని టి డి పి విడుతుంది అని ఎవరు ఉహించలేదు, వై ఎస్ ఆర్ సి పి కి మోది మద్దతు ఎవరు ఉహించలేదు, మాహకూటమి టి డి పి అభిమానులకి మింగుడు పడలేదు. 


ఇప్పుడు టి డి పి కి కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికితే, చేసిన పొరపాటు కు ప్రయశ్చిత్తం చెయ్యమని మోకరిల్లితే ?

ఒకవేళ కమలం ఉద్దేశం రాష్ట్రం లో బి జే పి ని దృడముగా వ్యవస్తాపించాలి  అని అయితే మోకరిల్లిన, పోరులు దండలు పెట్టిన కనికరివ్వకపోవచ్చు, ఎందుకంటె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన  బి జే పి కి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు అవసరం, స్థానికత్వ ముద్ర అనేది అవసరం, బి జే పి లో,  ఆంధ్రరాష్ట్రం లో, కీలక నాయకుల కరువు ఉంది, రాజకీయ ప్రత్యామ్నయం గా బి జే పి ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భవిస్తే తమకు ఉన్న స్థానిక గుర్తింపు పోతుంది అని ఆలోచించే కొంత మంది నాయకులు పార్టీ ని ఎదగానివ్వటం లేదు అనేది వాస్తవం. ఈ విషయం అధిష్టానం దృష్టి కి కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు బి జే పి కి ఆంధ్రరాష్ట్రం లో వెరూ  దగ్గెరనుంచి నరుక్కొని వచ్చే నాయకులూ కావాలి.

ఇక్కడ బి జే పి దృడముగా పాతుకుపోవాలి అంటే ఏదో ఒక పక్షాన్ని  దెబ్బతియ్యాలి, అది పాలక పక్షమైన కావాలి లేదా ప్రతిపక్ష మైన కావాలి.  కొంచెం కవ్వించే సరికి అధినంలో లేని వ్యాఖ్యలు చేసి, ప్రణాళిక లేని వ్యూహాలు రచించి మోది వ్యూహం లో బలి అయ్యింది టి డి పి అధినేత అనే చెప్పాలి.

శాసనసభ్యులు బి జే పి లోకి దూకితే : ప్రస్తుత ముఖ్యమంత్రి తనకు జరిగిన అన్యాయాన్ని తను స్వయముగా ప్రోత్యహించాను అని చెప్పి బహిరంగ ప్రకటనే చేసారు, ఒక వేళా టి డి పి శాసనసభ్యులు వై ఎస్ ఆర్ కి ప్రత్యమన్యయం గా బి జే పి లోకి దూకి పార్టీ మారితే అప్పుడు ఎవరు ప్రతిపక్షం. 

పాతవారు పోయిన కొత్తవారు వస్తారు, కొత్తవారు పార్టీ ని ఎలివేట్ చెయ్యటానికి టైం పడుతుంది. అప్పుడు రాష్ట్రం లో మిగిలే రెండే రెండు ప్రధాన రాజకీయ పార్టీ లు ఒకటి వై ఎస్ ఆర్ సిపి రెండు బి జే పి.

ఏ పోటి లో నైన ఒక్కరే గెలుస్తారు, ఈ రాజకీయ రణరంగం లో ఒకరిని ఓడించాలి అంటే మరొకరు ఓడిపోవాలి, కేంద్రం చేతిలో చట్టాన్ని అమలు పరిచే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటి నుంచి భయట పడేవరుకు చాలామంది స్వేచ్చ ని అనుభవిస్తున్న బందిలే. ఒక వేళా విరా వారా అనే విధముగా రాజకీయ వ్యూహం రచించి  కమలం తమ పార్టీ ని    ఆంధ్ర రాష్ట్రం లో బలోపెతముగా స్థాపించాగాలిగితే, పరిణామాలు ఎలాగా ఉంటాయి అనే విషయం పైన కాలమే సమాధానం చెప్పాలి.

పార్టీ ఫిరయంపులు అయిన, పార్టీ వ్యవస్థికరణ ప్రయత్నం అయిన ఈ రెండిటిలో కేంద్రం వ్యూహం ఏదైన టి డి పి కి జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది ఇప్పుడు,  జాగ్రత్త పడవలిసింది పాలక పక్షమే ....! 

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics