Skip to main content

పధకాల విషయం లో పరిక్ష కాలము వస్తుంది ......     ఒకప్పుడు టార్గెట్ జగన్, ఒంటరి పోరాటం, కేంద్రం మద్దతు లేదు, పైగా దిక్కరానికి అధికార నిర్భందన. ఇప్పుడు అదే వ్యూహాన్ని బాబు మీద సంధించారు. ఒకరు ఒకప్పుడు ముఖ్యమంత్రి మరొకరు ప్రతిపక్ష నేత, ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత, అప్పటి ప్రతి పక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి. కాలము చెప్పే సమాధానాలు ఎలాగా ఉంటాయి అంటే, జగన్ మోహన్ రెడ్డి పార్టీ గెలిచినా తరువాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు, రాహుల్ గాంధీ అదే సమయములో ఒక ప్రెస్ మీట్ పెట్టారు కానీ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర ముఖ్య మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్  హై లైట్ అయ్యి అదే సమయములో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ప్రసారం కనుమరుగు అయ్యిపోయింది.  అప్పటి నిర్భంధనకు ఇప్పుడు కాలం చెప్పిన సమాధానం.  అలాగే ప్రస్తుత ముఖ్య మంత్రి కి పరిక్ష కాలం ఏమైనా ఉంది అంటే అది పధకాలలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలందరికి  చేరువ చెయ్యటమే.

ప్రశ్నించే గొంతు ఏ పార్టీ పదవిలో ఉన్న ప్రతిపక్షమే.  దాదాపు చాలామంది వై ఎస్ అర్ గెలుపు ని నమ్మి అ పార్టీ లో కి మారినారు, కానీ పార్టీ లో ముందునుంచి ఉండి గెలుపు కోసం  కష్టపడిన వారు వేరు.
  • ఎక్కువమంది విక్షించింది 

చింతలపూడి నియోజకవర్గం ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ కి స్పందించిన ఎమెల్యకోవర్ట్ ఆపరేషన్స్ - ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్యం చేతి లో ఓడిపోయారు, విద్య నేర్చినవాడి దగ్గెరనుంచి విద్యను దూరం చెయ్యలేరు, అలాగే పవర్ అయితే కొలిపోయారు కానీ రాజకీయ మేదస్సు కాదు. క్రింది స్థాయి లో జరిగిన అవకతవకలు సామాన్య ప్రజల లో అసంపుత్రుప్తి ని మిగిల్చినవి, ఇప్పటివరుకు వీళ్ళని చూసాం ఒక్కసారి వారికీ అవకాశం ఇద్దాము అనుకున్నాం - ఎక్కడికి వెళ్ళిన ఇదే మాట. అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత ని ప్రజలు నమ్మినారు, దివంగత నేత వారసుడిగా అయిన పాలించిన విధముగా పాలిస్తారు అనే ఆశ తో పట్టం కట్టారు. 

ఎక్కువమంది విక్షించింది 

పశ్చిమగోదావరి జిల్లా లో అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి దృష్టి ఎందుకు పెట్టడం లేదు ? తిగలాగితే డొంక అంత కదిలే అందుకే విద్యుత్తు ఒప్పందాలు విషయములో జాగ్రత్త పడ్డారా?


అయితే ప్రతిపక్షం వారిని, మరి అప్పుడు క్రింద స్థాయి నాయకులను మీరు కంట్రోల్ చెయ్యలేకపోయారు గా అని ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం ఒక్కటే " చూద్దాం వీళ్ళు ఎంత బాగా చేస్తారో మేము చూస్తాము  " అని. ప్రతిపక్షం మౌనం వహిస్తుంది అంటే వారు అంత గమనిస్తున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అని అర్ధం.  

ప్రజా శ్రేయస్సు కోసం పధకాలు పెట్టి ప్రజల వద్ద డబ్బులు  వసులు చేస్తే  , వచ్చిన లబ్ది కన్నా ఇచ్చిన కమిషన్ నే గుర్తుపెట్టుకుంటాడు ప్రతి సామాన్యుడు, ఇంకా వారికీ వీరికి తేడ ఏమిటి ?  

  • గ్రామ వాలేంటరిస్ గా ఉన్న వారిని స్థానిక నాయకులు ప్రభావితం చెయ్యకుండా ఉంటారా ? 
  • అవినీతి ని పై స్థాయి నాయకుల ద్రుష్టి కి తీసుకోని వెళ్ళితే, క్రింద స్థాయి నాయకుల వేధింపులు సామాన్య పార్టీ కార్యకర్తలుకు ఉండకుండా ఉంటాయా?   
  • నాయకుల మనసు నొప్పకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా దివంగత నేత చేసినట్టుగా సమన్వయముగా ఇద్దరి మన్ననలు ప్రస్తుత ముఖ్యమంత్రి పొందగలరా?
  • ఆరోపణలు మొస్తూ పాలక పార్టీ ఆశ్రయం తీసుకున్న వారితో ఎటువంటి జాగ్రత్తలు వహిస్తారు ?
ఏ పార్టీకి  అయిన గ్రౌండ్ లెవెల్ పర్యవేక్షణ లేకపోతే నష్టం అర్ధం కాదు, పార్టీ అధినేతలు " నేను పధకాలు బాగానే ఆమలు చేశాను " అని అనుకుంటారు కానీ క్రింది స్థాయిలో  పధకాలు ఎలాగా అమలు అవుతున్నాయి అనే విషయం పైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తీ  దగ్గెర ఉండే సమాచారం తక్కువే, ఎందుకంటె ఎప్పుడు కూడా స్థానిక నాయకులు తమకి అనుకూలముగా ఫీడ్ బ్యాక్ తయారు చేసి ఇస్తుంటారు.  

సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి పరిక్ష కాలము దగ్గెర పడుతుంది, చిన్న అవకాశం కోసం ప్రతిపక్షం ఎదురు చూస్తుంది, రాజకీయం లో ఆరితేరిన అనుభవజ్ఞుడు చంద్రబాబు, ప్రజాస్వామ్యం లో గెలుపు ఓటములు సహజం, ఒక ప్రక్కన ముఖ్యమంత్రి మీద రాష్ట్ర భాద్యత మరో ప్రక్కన పర్యవేక్షణ, ఈ సమయములో నిజమైన  పార్టీ కార్యకర్తలనే ఒక నిఘా  వ్యవస్థ లాగా వాడుకోవాలి లేదా ప్రత్యామ్న్యాయం చూసుకోవాలి, ఈ పరిక్ష లో గెలవాలి అంటే పర్యవేక్షణ తో పాటు అదుపులో ఉంచగలిగే సమర్ధత కూడా ఉండాలి.      Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics