ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రైతన్న ......రాజన్న ......రాజ్యం ......

రైతులకి రూ.12,500/- ఎన్నికల వాగ్దానం, అమలు చేస్తారా లేదా, దివంగత నేత వారసుడిగా అయిన సిద్దాంతాలను జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారా ? లేదా ? వ్యాపారవేత్త అంటున్నారు రైతుల గోడు అతనికి అర్ధమౌతుంద లేదా ? ఇటువంటి అనుమానాలు ఎన్నిటికో ఈ రోజు ఒక సమాధానం దొరికింది. రైతులకి పెట్టుపడి ఇవ్వటమే కాకుండా  , గిట్టుబాటు  ధర కోసం మూడు వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ బడ్జెట్ లో పెడతాము అని అయిన తెలియచేసారు. అక్టోబర్ 15 నుంచి రైతు కి రూ.12,500/- రైతు భరోసా క్రింద ప్రతి రైతు కి అందుతుంది అనే విషయం స్పష్టం చేసారు . 

అలాగే కీలక శాఖలు తనే స్వయముగా పర్యవేక్షిస్తాను అని అయన తెలియ చేసినట్టు సామజిక మాధ్యమాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జగన్ తన నిర్ణయాలతో చాల మందికి  అయిన పైన ఉన్న బిన్న  అభిప్రాయాలు కి స్పష్టమైన సమాధానం చెప్పుతున్నారు, అది కూడా కార్య రూపములో.  తటస్థముగా ఉన్నవారు చూపు ఇప్పుడు సి యం వైపే ఉన్నది అని చెప్పాలి. 

"స్పీడ్ గా ఉన్నాడు " ఇది ప్రజల నాడి, వ్యవసాయం దండగ అని చెప్పేవారికి ఇది స్వయముగా ముఖ్యమంత్రి క్రియ రూపములో చెప్పిన  సమాధానమే. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి శకం మళ్ళి మొదలవుతుంది అనే అంచనాలతో  అక్టోబర్ వరుకు వేచి చూడవలిసివస్తుంది, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దృష్ట్యా వేచి చూడక తప్పక పోయిన, మాట తప్పారు అనే బ్రాండ్ మార్క్ తో నమ్మకం మాత్రం సడలటం లేదు . 

వైద్య, విద్య , వ్యవసాయ శాఖలు ముఖ్యమంత్రి  పర్యవేక్షణ లో ఉండటం అనే విషయం నిజమైతే, రాష్ట్ర ముఖ్యమంత్రి అ శాఖలను సమర్దవంతముగా నడిపించాగాలిగితే వై ఎస్ అర్ కాంగ్రెస్ మరో బి జే డి గా అవతరించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.   స్థానిక నాయకుల కమిషన్ వ్యవస్థ నుంచి ఈ మూడు శాఖలను కాపాడుకోవటం కొంచెం కష్ట సాధ్యమే, ఎందుకంటె ప్రజా వ్యతిరేకత ఈ వ్యవహారం తోనే మొదలవుతుంది . వస్తావా పరిస్థితుల దృష్ట్యా ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలు , ఉత్తమ పాలనా అనే కాన్సెప్ట్ కి ఇది సున్నితమైన , కీలకమైన సవాలు, చూసి చూడనట్టు వదిలేస్తే ప్రజలలో వ్యతిరేకత, వదలకుంటే నాయకుల లో వ్యతిరేకత, వారి ప్రభావితం ఓటరు మీద ఉంటుంది ఏమో అనే సందిగ్ద అవస్థ లో ప్రభుత్వం వ్యవహరిస్తే అ ప్రభావం ప్రజలలో అసంతృప్తి ని మిగులుస్తుంది అనేది పూర్వం ప్రజలు ఇచ్చిన తీర్పు.   

ఒక్కమాట మాత్రం వాస్తవం, రైతు ఆకలి తిర్చినవాళ్ళు ఈ నెల పైన ఆరాధ్యులు.


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image