Skip to main content

పవర్ బ్రోకర్స్ ని జగన్ ప్రభుత్వం ఎలాగా డీల్ చేస్తుంది ? వారు మేధావులా? లేదా పవర్ బ్రోకర్స్ హ ?     

చలసాని శ్రీనివాస్ స్వయం ప్రకటిత మేధావి, ఈ మేధావికి పవర్ బ్రోకేరేజ్ కి సంబంధం ఏమిటి ?  అసలు పవర్ బ్రోకేరేజ్ అంటే ఏమిటి ? ఇటువంటి మేధావులు ఎలాగా పుట్టుకొని వస్తారు ? ప్రజాస్వామ్యం లో విరి పాత్ర ఏమిటి ? అది లోనే తుంచకపోతే ప్రమాదం ఏమిటి ?

ప్రజాస్వామ్య దేశం లో ముఖ్యముగా మూడు విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయి.  శాసనం చేసే వ్యవస్థ, అమలు పరిచే వ్యవస్థ, చట్ట వ్యవస్థ. వాడుకు భాష లో రాజకీయం, ప్రభుత్వ సంస్థలు , కోర్టులు.
కొంత మంది స్వయంగా తము మేధావులమని  ప్రకటించిన, ప్రకటించుకోకపోయినా ఎగ్జిక్యూటివ్ ( ఉద్యోగులు ,అధికార యంత్రాంగాన్ని ) లోబరుచుకోవటానికి శాసనం (ఎన్నికైన రాజకీయ నాయకులను ) ప్రలోభ పరిచి  వారిని తమ అదుపులో ఉంచుకుంటారు. వాస్తవానికి ఇది ఒక వైట్ కోలార్ క్రైమ్. వారినే పవర్ బ్రోకర్స్ అంటారు.

వీళ్ళకి పార్టీల తో సంబంధం ఉండదు, అలాగని పార్టీ కోసం ముందునుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా కాదు వీళ్ళు, పచ్చిగా చెప్పాలి అంటే ఈ పవర్ బ్రోకేరేజ్ అనేది పాలక వర్గానికి ఒక తెలివైన నేరస్తుడికి మధ్య జరిగే అక్రమ సంబంధం.  ఈ అక్రమ సంబంధం వళ్ళ పవర్ బ్రోకరేజ్ చేసేవారు, అతన్ని ప్రోత్యహించినవారు మాత్రమే సుఖపడతారు, ప్రజలు అష్టకష్టాలు పడతారు, పార్టీ ప్రజల లోని విశ్వసనీయత కొలిపోతుంది, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి చెందుతారు. 

విషయనికి వస్తే ప్రతి రాజకీయ పార్టీ కి మూడు ప్రణాళికలు ప్రాధమికంగా ఉంటాయి, పాలన లోకి వస్తే , ప్రతి పక్షం లోకి వెళ్తే, * పాలకపక్షాన్ని ప్రతిపక్షం లో కుర్చోపెట్టటం.

 పాలనలోకి వస్తే ప్రతి పక్షం గొంతు ప్రజలలోకి వెళ్ళకూడదు, ప్రతిపక్షనాయకుడు ప్రజలలో ఎలివేట్ అవ్వకుడదు, అందుకుగాను ప్రతిపక్ష నాయకుడు ఒక సమస్యను ప్రశ్నిస్తే , అ వెంటనే ప్రభుత్వ అనుకూల వ్యక్తులు అ సమస్య ఉన్న చోట ప్రత్యక్షం అయ్యీ ప్రజా సభలు ఏర్పాటు చేస్తారు లేకపోతే ప్రెస్ మీట్ లు పెడతారు, అ వెంటనే ప్రభుత్వం కొంత వెసులుబాటు ప్రకటిస్తుంది. అతను వచ్చాడు కాబట్టే సమస్య పరిష్కారము అయ్యింది ఇంతటి తో అతనికి పేరు వస్తుంది. రాజధాని  ల్యాండ్ పూలింగ్ లో   ప్రతిఘటించింది  పవన్ కళ్యాణ్,   సింగపూర్  రాజధాని నిర్మాణ కమిటి లో చలసాని శ్రీనివాస్ సభ్యుడు, అంత బాగానే ఉన్నది అని ద్రువికరణ. అసలు అతను ఎవరు అనే ప్రశ్న వస్తే ఆంధ్రప్రదేశ్  మేధావి సంఘం అధ్యక్షుడు అనే బ్యానర్ లు.
పవన్ కళ్యాణ్ కానీ పదవిలోకి వస్తే అనే ఆలోచన తో 

 ఇంతకీ ఈ మేధావి సంఘానికి రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా ? అనే ప్రశ్నలను లేవనేత్తుతున్నారు యువనాయకులు , ఎవరికి వారు స్వయం ప్రకటితముగా మేమే మేధావులము అని ప్రకటించుకుంటే ఎలాగా అనే ప్రశ్నలతో సోషల్ మీడియా దద్దరిల్లుతుంది.

ఇంతకీ చలసాని శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఓటు  హక్కు ఉన్నదా ? లేదా ? ఓటు హక్కు లేకుండానే ఆంధ్ర రాష్ట్రం కోసం తెలంగాణా లో ఆంధ్రప్రదేశ్ మేధావి సంఘం ఏర్పాటు చేసారా ?  అ సంఘం పేరు మిద ధర్మ పోరాట దీక్షలు నిర్వహించటం, మళ్ళి అప్పటి పాలక పక్ష నాయకులను కలవటం. విచిత్రం ఏమిటంటే అదే ప్రత్యేక హోదా గురించి నోరు మెదిపిన చాల మంది మిద కేసులు పెట్టి వేధించారు, కానీ ప్రభుత్వ అనుకూల వ్యక్తులు  దీక్షలు చేస్తే వారికి చట్టం అప్పటి చుట్టం అయ్యింది ? వారు ఒక్కసారిగా పేరు మోసిన వారు అయ్యిపోయారు ఎందుకు? ఎందుకంటె అక్కడ పాలక వర్గమే ఇటువంటి వారిని తాయారు చేస్తుంది కాబట్టి.  • ఎక్కువ మంది విక్షించింది : 

విజయగాధ వెనుక స్పూర్తిదాయకమైన ప్రయాణం - అనిత - శ్రీధర్


అందరు అనుకుంటున్నట్టు ఇది మేధావి సంఘం కాదు ఆంధ్ర మేధో వేధిక.  ఎవరు పవర్ లోకి వచ్చిన తోలు బొమ్మల ఆట ఆడి వారిని ముడ్డికి కట్టుకునే ప్రయత్నం లో భాగముగా ఇటువంటి వేధికలు ఏర్పడతాయ, తోలు బొమ్మైన,  దాని పాత్ర కి గుర్తింపు రావాలి అంటే "పేరు", ఒక గుర్తింపు పొందిన  పేరు కావాలి అదే మేధావి సంఘం యొక్క నామకరణ లో ముఖ్య ఆలోచన. ఎవరు అంటే పలన సంఘం అధ్యక్షులు అని  ప్రజలు అనుకోవాలి కదా !


ఏప్రిల్ 15 2018  న  అప్పటి ముఖ్యమంత్రి ని విమర్శించిన చలసాని 


https://www.youtube.com/watch?v=0EkXzljXhhA   -> అ వీడియో లు యొక్క యు ట్యూబ్ లింక్స్
https://www.youtube.com/watch?v=xBqQk820BhQ  -> అ వీడియో లు యొక్క యు ట్యూబ్ లింక్స్

ఏప్రిల్ 20 వ 2018 వ తేదిన అప్పటి ముఖ్యమంత్రికి మద్దతుగా 
ఏప్రిల్ 4 వ తేది 2018 వ తేదిన అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి ని కలిసినది 

https://youtu.be/M3Ioej4bLns -> వీడియో లింక్

ఉపయోగం ఏమిటి : వీళ్ళు పార్టీ కి కట్టుపడిన వారు కాదు, వీళ్ళు పార్టీ కోసం కష్టపడేవారు కానీ లేదా పార్టీ కోసం చెమట చుక్కని కార్చే వారు కానీ  కాదు. వీరికి కావలిసింది పవర్ తో వ్యాపారం చెయ్యటం, వ్యాపారం అంటే వ్యాపారమే, ఇది రాజకీయ వ్యాపారం. అధికారులని అధికారంతో లొంగ తీసుకునే స్వలబ్ది వ్యాపారం. వీళ్ళు ఏ పార్టీ కి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ విశ్వసనియముగా పని చెయ్యరు. ఉపయోగ పడతారు లబ్దిపొందుతారు నడుమున జరిగేది అంత నాటకమే. 


  • ఎక్కువ మంది విక్షించింది : 

పశ్చిమగోదావరి జిల్లా లో అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి దృష్టి ఎందుకు పెట్టడం లేదు ? తిగలాగితే డొంక అంత కదిలే అందుకే విద్యుత్తు ఒప్పందాలు విషయములో జాగ్రత్త పడ్డారా?


మేధావి సంఘం అంటే నువ్వు తెలివైన వాడివి అని అర్ధం , అంత తెలివైన వాడివి గత ప్రభుత్వం పోలవరం సందర్శన అని 60 కోట్లు వృధా చేస్తుంటే మౌనముగా ఎందుకు ఉన్నావు ? రాష్ట్రం అప్పటికే ఆర్ధిక సంక్షోభం లో ఉన్నది , స్పెషల్ ఫ్లైట్ లు అని డబ్బులు తగలేస్తుంటే నోరు మెదపలేకపోయవు ? అసలు ఆంధ్రప్రదేశ్ మేధో వేధికను ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు, ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగినవి ?   -   పట్టబద్రుడు  వర్రా రవీంద్ర రెడ్డి అతని స్నేహితులు చలసాని శ్రీనివాస్  ను అడుగుతున్నా ప్రశ్నలు ఇవ్వి !

ఒక వేళా ఇది ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్ట్ అయితే దిని పదవి కాలం ఎన్ని రోజులు ?
ఒక వేళా ప్రభుత్వ గుర్తింపు సంస్థ అయితే లెక్కలు ఎవరికి చెప్పుతున్నారు ?
ఒక వేళా రిజిస్టర్డ్ సంస్థ అయితే ఇప్పటి వరుకు సంస్థ ఎన్ని విరాళాలు సేకరించింది ? అ విరాళాలు ఎందుకు ఖర్చుచేసారు ? ఆదాయం ఎంత ? ఖర్చు ఎంత ? విరాళాలు ఇచ్చిన దాతలు డేటా ఎక్కడ ? ఈ సంస్థ విధి విధానాలు ఏమిటి ? ఇంకా ఇంకా ఇంకా వస్తనే ఉంటాయి !దిని కోసం సోషల్ మీడియా లో ఒక ఉద్యమమే నడుపుతున్నారు, ఎవరికి వారు విద్యార్హత లేకపోయినా స్వయం ప్రకటితముగా మేధావులము అని చెప్పుకుంటున్నారు, అందుకుగాను ఒళ్ళు మండిపోయిన పట్టబద్రులు  మేము విద్యవంతులము అని చెప్పి వారికీ వారె మేధావి సంఘంగా ఏర్పాటు చేసుకొని సామజిక మాధ్యమాలలో ఒక ట్రెండ్ సెట్ చేసారు. కొత్తవారికి అర్ధం కాకా వివరణ అడిగితే వివరణ సైతం ఓపికగా ఇస్తున్నారు. వారి పోరాటం వెనుక ఉన్న విషయన్ని అందరికి అర్ధం అయ్యే విధముగా తెలియచేస్తున్నారు.

ఆంధ్రరాష్ట్రం లో పవర్ బ్రోకేరేజ్ చాల ఏళ్ళ నాటి నుంచి వస్తుంది, అవి చాల రకాలుగా ఉన్నాయి, ఇది ఒక ఆర్ధిక నేరం తో సమానం, సమాజానికి ఈ పవర్ బ్రోకేరేజ్ అంత మంచిది కాదు. ఇంకా నియోజకవర్గ స్థాయిలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళే కనపడతారు. పవర్ బ్రోకరేజ్ లో అంతిమముగా నష్టపోయేది పార్టీ మరియు నిజమైన కార్యకర్తలే  నే ! ఈ విషయాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సీరియస్ గ పరిగణంలోకి తీసుకోవాలి. ఏ పార్టీ అధికారం లో ఉంటె అ పార్టీ లోకి పాగా వేసి, అక్కడ వ్యవస్థను సములముగా బ్రష్టు పట్టించి మళ్ళి గెలిచిన పార్టీ వైపు ప్రయాణం చేసి అక్కడ కూడా వీళ్ళు పవర్ బ్రోకరేజ్ చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తారు, అధికారులు కూడా ఏ పార్టీ పదవి లోకి వచ్చిన వీళ్ళు మాత్రం తప్పనసరిగా ఉంటారు అని మెడలు వంచక తప్పదు, అవినీతి చెయ్యకూడదు అనుకున్న చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది . ఇప్పుడు చెప్పండి ఎవరు మేధావులు - ఎవరు పవర్ బ్రోకర్స్ ?

  • ఎక్కువమంది విక్షించింది 

చింతలపూడి నియోజకవర్గం ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ కి స్పందించిన ఎమెల్య


పోయిన ప్రభుత్వం లో  పవర్ బ్రోకర్స్  చేసిన అవినీతిని ఎండగట్టము, ఇసారి అటువంటి పనులు జరిగి సామాన్య ప్రజలు ఇబ్బంది పడితే పవర్ బ్రోకర్స్ పేరులు రాసి మరి ప్రత్యేక కధనలు సాక్ష్యాలతో  ప్రచురితం చేస్తాము quickandhra.com ప్రశ్నించే గొంతు ఎప్పుడు ప్రతిపక్షమే - www.quickandhra.com Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics