ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొత్తగా యన్ టి అర్ తెలుగుదేశం ఆవిర్భావం .........?     

సీనియర్ నాయకులు అంత తెలుగుదేశం విడి బి జే పి లో చేరే క్రమంలో ఆలోచనలు చేస్తున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ని టార్గెట్ చేసి వ్యూహాలు అమలజరుగుతున్నాయి.


2019 ఎన్నికలు ఫలితలు, గెలుపు ఓటములు సహజమే కానీ మరి గోర పరాజయం అభిమానులను  క్రుంగతీస్తుంది అనేది వాస్తవం. ఎవరి మీద వ్యతిరేకత ఉన్నది లేనిది ప్రక్కన పెడితే పలువురు ప్రముఖులు వ్యాపారవేత్తలు పార్టీ లో విజయం పొందిన వారు తమని తము కాపాడుకోవటానికి ఇప్పుడు బి జే పి వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కిలకముగా ఉన్న కేడర్ మొత్తం చెల్లాచెదురు అయ్యిపోతుంది.
క్రింద స్థాయి లో కార్యకర్తలు పార్టీ నాయకత్వం పైన  పైకి అభిప్రాయాలు ఎలాగా వ్యక్తం చేసిన  , తమ సన్నిహితుల దగ్గర వారు పార్టీ లో అనుభవించిన ప్రతి పక్ష హోదా గురించి క్రింద స్థాయి లో పార్టీ ఎలాగా దెబ్బ తిన్నదో  క్లుప్తముగా చర్చించుకుంటున్నారు. చాల మంది నాయకత్వం మారాలి అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వారసత్వ రాజకీయాలలో ఎవరికైన స్థానం ఇస్తే తన వారసుడు పరిస్థితి ఏమిటి అనే ఆలోచన తో పార్టీ పగ్గాలు ఎవరికి ఇచ్చే ఉద్దేశం ఎక్కడ కనపడటం లేదు.

ఒక ప్రక్కన రాష్ట్ర  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అతి తక్కువ సమయం లో " ఆశ ", విశాఖ లో యువకుడి వైద్యానికి తక్షణ ఆర్ధిక సహాయం ప్రకటించి ఒక విధమైన క్రేజ్ సంపాదించారు.  డ్వాక్ర ఋణ మాఫీ ఇప్పుడికిప్పుడు చెయ్యకపోయినా ఒక సంవత్యరం తరువాత చేస్తాను అని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఎక్కడ దాపరికం లేకుండా ప్రమాణం చేసిన వెంటనే బట్టబయులు చెయ్యటం తో ప్రజలు అసంతృప్తి తో ఉన్న నమ్మకం మాత్రం కొలిపోలేదు.ఇంకా పోలవరం విషయానికి వస్తే, ప్రాజెక్ట్ గురించి ఓటరు అంతగా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని తేల్చి చెప్పేసారు, అలాగే ప్రాజెక్ట్ కి సంబందించిన పనులు ఆపేశారు, ఇందుకు గాను రాష్ట్రం పైన ఆర్ధిక భారం తప్పినట్టే.  అ వనరులు సంక్షేమ పధకాలకు ఉపయోగించే సూచనలు ఉన్నాయి . ఇంకా ముఖ్యమంత్రి తన తండ్రి లాగా రైతుల శ్రేయస్సు కోసం ఏమి చేస్తారు అనే విషయం సస్పెన్స్ గానే ఉన్నది.

ఒక వేళా విద్య, ఉద్యోగం , ఆరోగ్యం, రైతు సంక్షేమం వీటిని సమర్దవంతముగా  ఈ అయిదు సంవత్యరాల "లోపల " నిలపెట్టుకొని వస్తే ఇంకొక 5 సంవత్యరాలు కూడా పాలక పార్టీ నే రాష్ట్ర పగ్గాలు పట్టే అవకాశం ఉన్నది అనే ఆలోచన లు లేకపోలేదు.  చంద్రబాబు ఎక్కడ విఫలం అయ్యారు అనే విషయం పరిగణం లోకి తీసుకోని ప్రస్తుత పాలక వర్గం పని చేస్తే ?

ఇటువంటి అనుమానాలు ఎన్నో !  సీనియర్ నాయకులు పార్టీ ని విడి బి జే పి లో చేరితే, టి డి పి లో చీలికలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాల మంది భయటకు చెప్పలేకపోయిన జూనియర్ యన్ టి అర్ మీద మక్కువ చూపిస్తున్నారు. కానీ వారసత్వ పోరులో ప్రస్తుత తెలుగు దేశం పార్టీ  లో కీలక నేతలు అతనికి అవకాశం ఇస్తార లేదా అనేది ప్రశ్నార్ధకం. ఇంకా ప్రతిపక్ష నేత వయస్సు అందరికి తెలిసిందే, అయన సహకరించిన అయన వయస్సు సహకరించే పరిస్థితి లేదు అనే విషయం అందరికి తెలిసిందే, అయన తదనంతరం ఆయనంత పటిష్టముగా పార్టీ ని ప్రణాళికతో నడిపించే దిక్కు ఎవరు ?  ఒక వేళా తరువాత ఎన్నికలలో కూడా ఓటమి చవి చూస్తే పార్టీ పరిస్థితి ఏమిటి ? కార్యకర్తల పరిస్థితి ఏమిటి ?

ఒక వేళా రాష్ట్ర ముఖ్య మంత్రి క్రింద స్థాయి లో జరిగే అవినీతి ని పసిగట్ట లేకపోతే, అ కమిషన్ వ్యవస్థ మళ్ళి వై ఎస్ అర్ కాంగ్రెస్ లో కూడా పురుడు పోసుకుంటే ఒక్క అవకాశం కాస్త చేయ్యజరిపోయే అవకాశాలు ఎక్కువే ! ఒక వేళా టి డి పి కే మరో అవకాశం ఇస్తే యన్ టి అర్ టి డి పి ఆవిర్భావాన  ప్రస్థావన ఉండదు. కానీ అదే అవినీతి ని జగన్ మోహన్ రెడ్డి గారు అదుపు చెయ్యగలిగితే ప్రత్యామ్న్యాయం ఖచ్చితముగా అవసరం అ ప్రత్యమ్నయాయ ఆలోచనే ఈ   యన్ టి అర్ తెలుగుదేశం.


వీక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు  Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image