Skip to main content

టార్గెట్ బాబు ఎందుకు ? తెలుగుదేశం పగ్గాలు ఎవరి చేతిలో ?     2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టి డి పి అధినేత  చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేసి జూనియర్ యన్ టి అర్ ని చంద్రబాబు నాయుడు కి ప్రత్యామ్న్యాయం గా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు, అలాగే కొడాలి నాని నందమూరి వంశస్తులు ఇకనైన జాగ్రత్త పడి టి. డి. పి  పగ్గాలు తీసుకోండి  లేకుంటే  యన్ టి అర్ స్థాపించిన టి డి పి మిగలదు అని  చేసిన వ్యాఖ్యలు టి డి పి శ్రేణులలో కొంత అలజడి లేపింది.

సామజిక మాధ్యమాలలో టి డి పి సోషల్ మీడియా  గ్రూపులలో   సైతం యన్ టి అర్ ని
ప్రత్యామ్న్యాయం గా కోరుకుంటు  కామెంట్ ల వర్షం కుర్పిస్తున్నారు. నందమూరి హరికృష్ణ జీవితకాలం లో అయిన నందమూరి కుటుంబానికి పార్టీ కి సమన్వయ కర్త గా ఉండేవారు . పెద్దరికాన్ని గౌరవించి ఇద్దరు తనయులు మౌనంగా తండ్రి మాట జవదాటకుండా ఉండేవారు .

ఒకనొకప్పుడు జూనియర్ యన్ టి అర్ ని ప్రచారకర్త గా వాడుకొని లబ్ది పొందిన తెలుగు దేశం అతన్ని పార్టీ కార్యకలపాలికి దూరంగా ఉంచటం, అ తరువాత దమ్ము సినిమా కి గాను పార్టీ కార్యకర్తలకి ఏ స్ ఏం ఎస్ లు రావడం, అ విషయం భయటకు పొక్కటం , ఈ మధ్యలో  కోడలి నాని పార్టీ మారటం, జూనియర్ యన్ టి అర్ ఏ పార్టీ అని చెప్పి మీడియా లో చర్చలు జరుగుతున్నా క్రమంలో తనే స్వయముగా టి డి పి పార్టీ ని వీడే సమస్యే లేదు అని చెప్పి స్టేట్ మెంట్  ఇవ్వటం తో పరిస్థితులు సద్దుమనిగినట్టు కనిపించిన లోపాయకారిగా అంతర స్పర్ధలు ఉన్నాయే అనే చెప్పాలి. నందమూరి హరికృష్ణ తెలుగు దేశం పార్టీ లో కీలక పాత్రా వహించే  వ్యక్తీ, అయిన లేక పోవటం పార్టీ కి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి, ఒక వేళ యన్ టి అర్ బ్రతికి ఉంటె, పార్టీ పగ్గాలు దివంగత నేత హరికృష్ణ చేతికే వెళ్ళి ఉండేవి అని స్వయముగా దివంగత నేత దేవినేని నెహ్రు ఓపెన్ హార్ట్ విత్ అర్ కే లో చెప్పారు. కానీ హరికృష్ణ గారి జీవిత కాలం అ వైపుగా వ్యుహాలు ఏమి రచించలేదు కేవలం తండ్రి స్థాపించిన పార్టీ ని పటిష్టముగా ఉంచటములో కృషి చేసి పార్టీ కి కుటుంబానికి ఎటువంటి అభిప్రాయబేధాలు లేకుండా చూసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పార్టీ కి కట్టుబడి ఉన్నారు. 

సీనియర్ యన్ టి అర్ ఫేం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిలతోక్కుకున్న జూనియర్ యన్ టి అర్ ని ప్రక్కన పెట్టి నందమూరి బాలకృష్ణ ను పెట్టి  యన్ టి అర్ చరిత్ర ను బయోపిక్ గా తియ్యటం తో , సీనియర్ యన్ టి అర్ ఇమేజ్ ని   బాలకృష్ణ కి ఆపాదించే ప్రయత్నం చేసినట్టుగా చాల మంది మనోభావం అంటే మరోకోణం లో ఆలోచిస్తే యన్ టి అర్ క్రేజ్ తగ్గించే ప్రయత్నం చేసారు అనే చెప్పాలి . చిత్రీకరించిన రెండు భాగాలు ఎక్కడ సక్సెస్ కాకపోవటం తో పెను ప్రమాదం తప్పింది.
యన్ టి అర్ ఘాట్ వద్ద యన్ టి అర్ సమాధిని అలంకరించకుండా వదిలివేయ్యటం తో ఆగ్రహించిన జూనియర్ యన్ టి అర్ ఇంకా నుంచి తాత వర్దంతి, జయంతి బాధ్యత  నేనే చూసుకుంటా ! అని బాధ తో తన బాధ్యత గా స్వీకరించి నట్టు గా వ్యాఖ్యలు చెయ్యటం తో యన్ టి అర్ అభిమానులు నుతనుత్యాహం తో ముందుకు సాగిన , చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి వరుకు తెలంగాణా ప్రభుత్వం మే అ ఏర్పాట్లు చేసేది అని ఇప్పుడు వారె చేస్తారు అనుకున్నాను అనే వ్యాఖ్యలు చేసారు.

మొత్తానికి ఈ అంశం మీద ఎవరికి క్లారిటీ లేదు కానీ ఖర్మ ఫలం దక్కే సూచనా కనిపిస్తుంది. టి డి పి లో అంతర్గత విబేధాలు , పార్టీ పనితీరులో సంక్షోభం , కార్యకర్తలలో అలజడి లేపి టార్గెట్ బాబు అనే అంశం తో ప్రస్తుత పాలక వర్గం తో బాబు గారి  రాజకీయ ప్రత్యర్డులు వ్యూహాలు రచిస్తున్నారు, అ భాగములో  ఒక అంశం బాబు గారిని అభద్రతా భావనకు గురి చెయ్యటం, అదే సమయులో తను చేసే అనాలోచిత చర్యలను వారికీ అనుకూలముగా మార్చుకోవటం.

బాబు గారి అభిమానులు మాత్రం మేము బాబు కే సపోర్ట్ అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఇప్పుడు ఒంటరి యోధుడు అనే చెప్పాలి .

వెస్ట్ బెంగాల్ మమత బెనెర్జీ కమ్యూనిస్ట్ లని అణచివేసారు, ఆమెను కలవటం తో తెలుగు రాష్ట్రం లో బాబు ఎవరి సపోర్ట్ కొలిపోయారు అనే విషయం ఒక్కసారి ఆలోచనచేసుకోవలిసిన అవసరం ఉంది.

ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రభుత్వ భూములలో అవకతవకలు మంత్రి వర్గ విస్తరణ జరిగిన వెంటనే భయట పెడతాము అని ప్రకటన చేసారు. ఈ అంశాలు అన్ని పరిశిలిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మీద దృష్టి కేంద్రికరించినట్టు అర్ధమవుతుంది.

* జూనియర్ యన్ టి అర్ ని తెరమీదకు తీసుకోని రావటం
* కొడాలి నాని వ్యాఖ్యలు
*రాంగోపాల్ వర్మ ట్విట్ లు
*యన్ టి అర్ ఘాట్ వివాదం
*ఫలించని వ్యూహాలు
*ప్రతి పక్షం
*రాజధాని భూముల అవకతవకల వివాదం
ప్రస్తుతం అలజడి రేపుతున్న అంశాలు. జూనియర్ యన్ టి అర్ ప్రత్యామ్న్యాయం మేనా  కాదా అనే ప్రశ్న కి కాలమే సమాధానం చెప్పాలి .
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics