ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

వీళ్ళు టార్గెట్ చెయ్యకపోతే జగన్ సి ఏం ........?



     


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారం  నాడు తన మనసులో మాట గా టి వి 5, ఏ బి ఎన్ , ఈనాడు సంస్థలను టార్గెట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ప్రచరం చేస్తే కేసులు పెడతాము అని బహిరంగంగా ప్రకటన చేసియున్నారు. కానీ ముఖ్య మంత్రి హోదా లో ఉండి అటువంటి ప్రకటన చెయ్యటం సరి కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  


ఒక వేళా వారు కానీ విమర్శస్త్రాలు సందించకుండా ఉంటె జగన్ అంత కసిగా, పట్టుదలతో , పకడ్బందిగా  పని చేసి ఉండేవార ? ఎందుకంటె మనలని విమర్శించే వారు ఉంటేనే మన పని తిరు , పట్టుదల పెరుగుతుంది.  తగిన సమాధానం చెప్పాలి అనే కసి పెరుగుతుంది. 

విమర్శించే వారు లేకుంటే మనిషి పని తీరు లో పట్టుత్వం ఉండదు. అదే విషయం లో  మునపటి ప్రభుత్వం విఫలం అయ్యింది.  ఏ మీడియా లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు స్పష్టముగా ప్రచురించలేదు, ఎంతవరుకు అప్పటి ముఖ్యమంత్రి ని పొగడ్తలతో, ప్రభుత్వ సానుకులతతో ముంచి తెల్చడినారు,  పార్టీ కాల్  కాన్ఫరెన్స్ లో ఫీడ్ బ్యాక్ నుంచి, అప్పటి మీడియా ప్రచురితం వరుకు ఎక్కడ కూడా అ పార్టీ అధినేతకు చేతులు కాలే వరుకు ఎవరుకూడా ప్రభుత్వ వ్యతిరేకతను చేరనివ్వలేదు. 

ఇప్పుడు ఈ మూడు సంస్థలు మౌనం వహిస్తే, ఎక్కడ అవినీతి జరుగుతుంది అనే అంశం తెలుసుకోవటం కష్టమే, అటువంటి పరిస్థితులలో ప్రభుత్వం పైన వ్యతిరేకతను గుర్తించి  వస్తావా కారణాలు వెలుగులోకి రావటం కష్టం అనే చెప్పాలి.  ప్రత్యర్ది క్రియలను అనుకూలముగా  వినియోగించుకోవటమే నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం, మితి మిరితే అస్త్రలు  చేతిలోనే ఉన్నాయి ఉపయోగించటం ఏపాటి పని ఇందుకు ప్రకటన చెయ్యవలిసిన అవసరం లేదు అని సీనియర్ నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  

పత్రిక వ్యవస్థ అనేది ప్రతి పక్ష పాత్రా పోషిస్తేనే ఏ ప్రభుత్వం అయిన వస్తావా విషయాలను గ్రహిస్తాయి, భజన బృందం లాగా తయరు అయితే,  తల మాత్రమే పనిచేస్తుంది మిగత భాగలు ఎవ్వి పని చెయ్యవు , అంటే పార్టీ వ్యవస్థాపకుడు కి వస్తావా విషయాలు గ్రహించే సమాచారం ఉండదు . మీడియా స్వేచ్చని హరించటం అ విధముగా ప్రకటన చెయ్యటం అంత మంచి విషయం కాదు, వ్యతిరేకత వార్త లేకుంటే క్రింద స్థాయి లోని వారు  పని చేసే విధానం, అసంతృప్తి ని   వలయం లాగా చుట్టిముట్టిన  భజన బృందం దరి చేరనివ్వదు. 

  



 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement