ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హిట్లర్ భావాలు - ఒక్కప్పటి జర్మన్ల బైబిల్హిట్లర్ భావాలు - ఒక్కప్పటి జర్మన్ల బైబిల్

హిట్లర్ పదవిలోకి రాకముందు, 1924 జైలు లో ఉన్నప్పుడు , నా పోరాటం (Mein Kampf) అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం లో హిట్లర్ తన సిద్దాంతాలను భావాలను వివరించాడు. హిట్లర్ జర్మనీ అధినేత అయిన తర్వాత ఈ పుస్తకం జర్మన్లకు బైబిల్ అయ్యింది.

ప్రతి జర్మన్ దగ్గెర ఈ పుస్తకం ఉండటం పరిపాటి అయ్యింది.

హిట్లర్ భావాలూ

1. జర్మన్ జాతి ఆర్యన్ జాతి, మానవ నాగరికతలో, కళ్ళల్లో, శాస్త్రాలలో , సాంకేతిక రంగం లో సాధించిన ప్రగతి అంతా ఆర్యన్ జాతే సాధించింది. అర్యన్లు తక్కువ జాతి వారిని అణచివేయ్యడం ద్వారన ప్రగతిని సాధించగలిగారు. తక్కువ జాతులను జయించి, తను యజమానిని అనే స్పృహతో నిర్ధాక్షణ్యముగా వాటిని అనిచిపెట్టి ఉంచినంత కాలం ఆర్యన్ జాతి వర్దిల్లింది. జాతులన్నీ సమానమే అని నేషనల్ సోషలిజం ( హిట్లర్ పార్టీ ) అంగీకరించాదు అదే అతని పార్టీ సిద్దాంతం కూడా. అణచిపెట్టిన జాతి యజమాని జాతి కి చేరుకుంటేనే యజమాని బానిస మధ్య వేత్యాసం తోలోగుతుంది. యజమాని భాష బానిస నేర్వడం వలన ఇది జరిగి ఉండవచ్చు .భాష కంటే రక్తం ముఖ్యమైనది. ఆర్యన్ రక్తం కలుషితం అయినప్పుడు వారి పతనం మొదలైనది. ఇతర జాతుల రక్తం కలిసి ఆర్యన్ జాతి తన సంస్కృతిని కోల్పోయింది, ప్రపంచం లో ఆర్యన్ జాతికి చెందని వారు అంత పనికిమాలిన వారె . 

 2.అన్ని దేశాల్లో ఉన్న జర్మన్లను ఐక్యం చెయ్యాలి. జర్మనీ తన బలహినతలను అధిగమించి ప్రపంచాధినేత కావాలి. 

 3. జర్మనీ ప్రపంచాధినేత ఎలా కాగలదు ? మొదట ఫ్రాన్సును నాశనం చెయ్యాలి. ప్రాన్సును నాశనం చేసిన తర్వాత జర్మనీ తూర్పు వైపు సాగాలి. జర్మనీకి జీవించడానికి స్థలం(lebensraum) కావాలి . ఈ స్థలం ఎక్కడో ఆఫ్రికాలో కాదు, ఇక్కడే, యురోపులోనేకవాలి. కానీ యూరోప్ అంత ఇప్పటికే వివాద జాతులతో అక్రమించిపడి ఉంది. అయితే ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఏ జాతికి రిజర్వు చేసి ఉంచలేదు. రాజ్యం విరభోజ్యం. గెలుచుకున్న వాడిదే రాజ్యం. శాంతియుతముగా తమ దేశాన్ని అ దేశ ప్రజలు జర్మనీ వశం చెయ్యకపోతే ? ప్రతిఘటిస్తే ? బలవంతుడే నిలుస్తాడు. చరిత్ర జర్మనీ కి ఎంతో అనుకలముగా ఉంది. రష్యాను బోల్షివిక్కుల పరం చేసి బలహీన పరిచింది. బోల్షివిక్ రష్యా శిధిలమై కూలిపోవడానికి సిద్దముగా ఉంది. 


 4. ప్రజాస్వామ్య వ్యవస్థ అర్ధం లేనిది. నాజీ జర్మనీ నాయకత్వం మాత్రం (Fuhrerprinzipi) ప్రకారం నడుస్తుంది - అంటే నాయకుడి (ప్యురర్ ) నియంత్రత్వమన్న మాట. అన్ని స్థాయిలలోనూ నాయకులు పని చేస్తుంటారు. నాయకులకు సలహాదారులు ఉండవచ్చు కానీ నిర్ణయం అతనిదే. మెజారిటీ నిర్ణయం అనే సమస్య లేదు. నాయకుడు తన పై నాయకుడికి జవాబుదారి. పై నాయకుడి నిర్ణయాలను అమలు పరచడానికి బాధ్యుడు. నాయకుడి నిర్ణయాలు అతని అనుచరులు తూచా తప్పకుండ అమలు జరపాలి. సర్వాధికారాలు నాయకుదివే, ఆ విధంగా పైనుంచి క్రింద వరుకు ఒక నాయక వర్గం ఉండి పాలిస్తుంది

కాస్త చరిత్ర నుంచి ఇప్పుడు మన భారత దేశానికి వద్దాము. హిట్లర్ మనోభావాల లో భారీగా నాటుకుని పొయ్యింది జాతీయ భావం కాదు, జాతి భావం. నేను అనే అహంకారం. అదే అహంకారాన్ని దేశంలోకి వ్యాప్తి చెందించాడు. హిట్లర్ ది ఒంటరి పోరు కాదు, అప్పటి కార్పొరేట్ దిగాజ్జలు అతనికి ఆర్దికముగా ఎంతో సహాయం అందించాయ. ఇప్పుడు కూడా మన దేశం లో నాయకులు జాతీయ వాదం అనే ముసుగు దరించి జాతి వాదం చేస్తున్నారు. అదే ప్రజలలో నాటుతున్నారు. ఒక వేళా మోది రాఫాలే అవినీతి ఋజూవు అయితే ఇటువంటి భావాలూ కలిగిన పుస్తకం ఖచ్చితముగా ఒకటి వెలుగులోకి వస్తుంది. అక్కడ జాతి వాదం ఇక్కడ మళ్ళి జాతీయ వాదం ముసుగులో చలామణి అవుతంది.

     

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image