Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Friday, 24 May 2019

స్థానిక నాయకులకు ఇది " గుణపాఠం " - ప్రజాస్వామ్యం     
ఒక ఓటమి ఒక గుణపాఠం. ఒక విజయం ఒక అవకాశం. 2014 ఎన్నికలలో.  మా అంత మొగాళ్ళు లేరు అని విర్రవీగి సామన్య ప్రజలని ఇబ్బందులకి గురి చెయ్యటం అప్పటి ప్రధాన ప్రతి పక్ష పార్టీ ఒక ఆయుధం గా మార్చుకుంది.

పార్టీ కార్యకర్తలను కూడా విడని కమిషన్ వ్యవస్థ ఒక పాశం గా మారింది.  కృష్ణ జిల్లా తెలుగు దేశానికీ కంచు కోట, అక్కడ కూడా తెలుగు దేశానికీ ఎదురుదెబ్బ తగలటం అంతు చిక్కని విషయం గా ఉన్నది.

ఒక్కసారి పార్టీ ల ప్రస్థావన ప్రక్కన పెడితే ప్రచారo ఎలాగా ఉన్నది అనే విశ్లేషణ చేస్తే - జగన్ తన సొంత ఇంటివారికి చెప్పినట్టు అయ్యా , అవ్వ, అమ్మ మన గుర్తు ఫ్యాన్ అని - అదే చంద్రబాబు నాయుడు ప్రచారం చూస్తే
నేను మీ ఇంటిలో పెద్దకోడుకుని - నన్ను గెలిపించటం మీ బాధ్యత - నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా - నేను హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను - " నేను " ఈ  " నేనే " అనే పదం ప్రజలు స్వికరించాలేకపోయారు అనే చెప్పాలి.

ఇంకా సోషల్ మీడియా : ఇప్పటిలో స్మార్ట్ ఫోన్ చేతి లో లేని వారు, అది జి యో వచ్చిన తరువత. ఎంతసేపు ప్రధాన ప్రతి పక్షాన్ని అవహేళన చెయ్యటం లో తప్ప తము ఏమి చేసాము అనే విషయం సోషల్ మీడియా కి చాల దూరముగా ఉంచారు.  కొన్ని రోజులు అప్పటి పాలక పార్టీ సోషల్ మీడియా లో మరి మొగబోయింది.

యువత : యువత పాలక వర్గం మీద మక్కువ చూపలేదు, కమ్యూనిటీ ట్రెండ్ అందుకు ముఖ్య కారణం అనే చెప్పాలి. అందరిని కలుపుకొని పోవటం, సోషల్ మీడియా టీం ఏర్పాటు, ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్ లు , వాటి షేర్లు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించాయి.

బి జే పి తో పోరు ప్రజలలో విశ్వసనియతను కోలిపోయింది. అప్పటి వరుకు సపోర్ట్ చేసినవారు ఒకసారే ప్లేట్ ఫిరయించే సరికి ప్రత్యేక హోదా కోసం అయితే పోరు కాదు అనే విషయం ప్రజలకు అర్ధమైంది.

పార్టీ కార్యకర్తలలో టచ్ లో ఉన్న, బెస్ట్ 5 అనే కాన్సెప్ట్ లో కొంత వ్యతిరేకత ఉన్నది. అందరి అభిప్రాయాలు తెలుసుకోలేరు. స్థానిక నాయకులు ఏ విషయం పార్టీ అధినేత కు తెలియాలి అనుకుంటున్నారో అ విషయం మాత్రమే పార్టీ అధినేతకు తెలుస్తుంది, అంటే వస్తావా వ్యతిరేకత దాచి ఉంచి, అ వస్తావా అనుకల విషయాలు మాత్రమే పార్టీ అధినేత కి తెలుస్తుంది. కార్యకర్తలకు చేరువుకవటం లో కూడా పార్టీ అధినేత విఫలం అయ్యారు అనే చెప్పాలి. ఇంకా ఆడవారు నాకే ఓటు వేస్తారు అనే విషయం ముందే ప్రకటించటం ఇంట్లో మొగవారి అహాన్ని దెబ్బతీసి వారిని వీరికి ఓటు వెయ్యకుండా చేసారు అనే అభిప్రాయాలు సీనియర్ రాజకీయ నేతలు చెప్పుతున్నారు.

ఇంకా అధినేత కుమారుడుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పటం తెలివిమిరిన పని. అతను రాజకీయ జీవితం ఆరంభ దశలో ఉన్నాడు, ఉదాహరణకు కే టి అర్ బాల్యం , కే సి అర్ ఏం ఎల్ ఏ గా ఉన్నపట్టినుంచి   చూసాడు, జగనమోహన్ రెడ్డి కూడా అంతే , కానీ లోకేష్ అలాగా కాదు ముఖ్యమంత్రి మనవుడిగా , ముఖ్య మంత్రి కొడుకుగా విదేశాలలో పెరిగినాడు. అందుకే వారు ఇరువురు అయినంత వక్త, రాజకీయ ఎత్తుగేడలలో  వారి ఇరువురు కి ఉన్నంత పట్టుత్వం ఇతని లో కనపడలేదు. అ విషయం ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. సమర్ధత లేకపోవటం పార్టీ వరుకు పరిమితం అయితే పరవలేదు, కానీ ప్రజల కళ్ళ ముందుకు వచ్చి నోరు జారటం అనేది ఒక రాజకీయ నాయకుడికి మంచి పరిణామం కాదు. సమయం, సందర్బం పటించలేని మాటలు చేటు.

కర్ణుడి చావుకి లక్ష కారణాలు , అదే విధముగా ఈ ప్రభంజనం కూడా అంతే. జగన్ అనుకున్నది సాధించారు ఇది జనం మాట. కాని తను మాత్రం కొంత పెద్దరికముగా " దేవుడు దయ , ప్రజల ఆశీర్వాదం " అనే మాట తో తను ఆహంకరిని కాదు అనే సూచనలు ప్రజలకు అందించినట్టే. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో జగన్ మంచి ముఖ్య మంత్రి అనిపించుకోవటం కాలం చెప్పవలిసిన సమాధానం.

 మొత్తానికి ఓడినవారికి ఇది  గుణపాఠం, గెలిచిన వారికీ ఇది ఒక అవకాశం, అవకాశాన్ని సరిగ్గా వినియోగించకపోతే ఎవరికి అయిన గుణపాఠం తప్పదు, మార్పుని ఆశించిన గెలుపు మార్పు తో నే నిలపడుతుంది.

స్థానిక నాయకులు ప్రజలని ఇబ్బందికి గురి చెయ్యటం, వారి మీద వ్యతిరేకత , అదే నాయకులు పార్టీ కార్యకర్తల దగ్గెర సైతం కమిషన్ ల కోసం కక్కుర్తి పడటం తో పార్టీ కార్యకర్తలలో తటస్థముగా ఉన్న వారు నేటి పాలక పార్టీ వైపు మక్కువ చూపించారు. కొత్త తరం నాయకులు కరువు అయ్యారు అనే చెప్పాలి.


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image