ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కులాల ప్రస్థావన లేకుండా వి అర్ ఎలిజా కి మంత్రి పదవి దక్కుతుందా?
       " వి అర్ ఎలిజా " ఇంటి పేరు ఏదైన ప్రస్తుతం చింతలపూడి లో ఇయనకు వచ్చిన మెజారిటీ కి  "విక్టరీ " ఎలిజా అని పిలుచుకోవచ్చు . పోల్ మేనేజిమెంట్ , గ్రౌండ్ వర్క్ సమయ అనుసారం సందర్బునసరం మాట తులనడకుండా వ్యవహార శైలి తో చింతలపూడి నియోజకవర్గ ప్రజల మెప్పు పొంది, ఎవరు ఎన్ని విధాల ప్రలోభ పెట్టిన, అభద్రత  కి గురి చేసిన టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయిన పార్టీ ని వీడే సమస్యే లేదు అని తేల్చి చెప్పి పార్టీ కి కట్టుపడి పని చేసిన వ్యక్తీ. కి తగిన ఫలితం దక్కింది.

అయితే ఇక్కడ టి డి పి శ్రేణులను, వై ఎస్ అర్ శ్రేణులను ఒక ప్రశ్న అత్రుతకు గురి చేస్తుంది. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఈ ప్రశ్న కి దొరికే సమాధానాన్ని బట్టి నియోజకవర్గం లో దాన్ని  ఒక ఆయుధము గా మలుచుకునే అవకాశం ఉంది.

మాజీ శాసనసభ్యురాలు పితల సుజాత గారికి టి డి పి ప్రభుత్వం లో మంత్రి పదవి దక్కింది. అగ్రవర్ణాలు వారు ఉన్న అందరిని ప్రక్కన పెట్టి కులం తో సంబంధం లేకుండా ఆమెకు అప్పటి పాలక పార్టీ ఇచ్చిన పదవి అది, ఆమె మాజీ మంత్రి అవటం వెనుక కారణాలు జగము ఎరిగిన సత్యాలు ఇప్పుడు వాటి గురించి ప్రస్థావన అనవసరం.ఇంకా పోయిన ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ఒక సీనియర్ నాయకుడు ఒక సామజిక వర్గ అభ్యర్దిని ఉద్దేశించి చులకనగా మాట్లాడటం తో సీరియస్ గా తీసుకున్న నియోజకవర్గ ప్రజలు అగ్రవర్ణాల క్రింద మేము ఉండాలా?  అనే ఆలోచనతో ఉండగా వారికీ ప్రత్యామ్నయం  గా వై ఎస్ అర్ కాంగ్రెస్ తమ మనోభావాలను గౌరవించే విధముగా కనిపించటముతో ఒక ప్లస్ పాయింట్ గా నిలిచింది.

ఇది చాల సున్నితమైన గీత గా చెప్పవచ్చు. ఎలిజ గారికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ప్రక్కన పెడితే , ప్రతికూల ఫలితాలు వస్తే పాలక పక్షానికి విమర్శలు తప్పవు అనే చెప్పాలి . మేము మిమ్మలిని గుర్తించినటైన వారు మిమ్మల్ని  గుర్తించలేదు అనే విమర్శలు తప్పవు అనే చెప్పాలి.

ఇందుకు చాల కారణాలు ఉన్నాయి ! వాటి లో కొన్ని

* చింతలపూడి లో మొదటసారి విజయవంతముగా నిలపడిన  ఐ అర్ ఎస్ కేడెర్ రాజకీయనాయకుడు
* విద్యావంతుడు
* ప్రతికూల పరిణామాలలో కూడా పార్టీ ని విడలేదు

పలనా అనర్హత అని చెప్పటానికి, లేదా మాట దాటానికి కారణాలు కనపడటం లేదు. అయన సన్నిహితులు మనోభావం " మేము నమ్ముతున్నాము " అని.

ఒక్కసారి అర్హతలు విషయానికి వస్తే

* మొదటి పని చేసింది 1984 లో డిపార్టుమెంటు అఫ్ అటామిక్ ఎనర్జీ
*ఎస్ ఎస్ సి పోస్టల్ డిపార్టుమెంటు - 1988
* గ్రూప్ 1  - అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్
*సివిల్ సర్వీస్ ఐ ఐ ఎస్ (ఇండియన్ ఇంఫోర్మేషణ్ సర్వీస్ ) అవకాశం వచ్చిన తీసుకోలేదు
* సివిల్ సర్వీస్ ఐ అర్ ఎస్ , ఇండియన్ కస్టమ్స్ డిపార్టుమెంటు - 1991
మొత్తానికి ఉన్నత విద్య లో అగ్ర శిఖరాలు అనే చెప్పాలి.

ఇన్ని ఉన్నత  అర్హతలు ఉన్న " విక్టరీ ఎలిజా" కి  మంత్రి వర్గం లో చోటు దక్కుతుందా ?
దక్కకపోతే పరిణామాలు చింతలపూడి నియోజకవర్గానికి ఒక్కటే పరిమితం అవుతాయా  ?
సామజికవర్గ  మనోభావాలు ఎలాగా ఉంటాయి ?
విమర్శస్త్రాలు - పరిణామాలు ఓటరు మనోభావాన్ని ఏ విదమైన స్థితి కి తీసుకువెళ్తాయి  ?

సామజిక మాధ్యమాలలో తమ బిడ్డ  కి అవకాశం ఇచ్చిన పాలక వర్గాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు , భయట మా వాడు గెలిచాడు అంటున్నారు ఈ సమయములో ఈ ప్రశ్న కొంత ఆత్రుత కు గురి చేస్తుంది.

ఏది ఏమైనా అందరు వేచి చూస్తున్న ఉత్కంఠమైన ప్రశ్న - కి - సమాధానం కాలమే చెప్పాలి ?

ఎందుకంటే కులాల ప్రస్థావన ప్రక్కన పెడితే పార్టీ లో  ఉన్నత విద్యవంతులకి ఇచ్చే గుర్తింపు గురించి కూడా ఎంతో మంది మనసులో ఉన్న ఉహాలు - అపుహాలు తొలిగిపోతాయి .

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image