Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Friday, 26 April 2019

సుప్రీమ్ కోర్ట్ పైన స్థాయి దిగిన ప్రయత్నంలో మోది పాత్ర ?     

తన చేతి కి మట్టి అంటకుండా రాజకీయం చెయ్యటం మోది స్టైల్ అనే చెప్పాలి. అయితే రాఫాలే - అంబానీ తో చేసిన చిలకకొట్టుడు యవ్వరం రాహుల్ గాంధీ భయటకు లాగటం తో కాస్త తలనొప్పి వచ్చి పడింది. సి అర్ పి ఎఫ్ మీద జరిగిన దాడి ని సైతం దేశ ప్రజల మనోభావలు దెబ్బతినకుండా వెంటనే ప్రతి స్పందించినట్టు వార్తలు చెక్కర్లు కొట్టిన, సొంత పార్టీ వారె తుచ్ అక్కడ దాడి చేసిన మాట వాస్తవమే కానీ ఎవరు చనిపోలేదు అనే ట్వీట్  లు మోత మొగించటం తో వ్యవహారం బెడిసికొట్టింది.

ఇంకా అతని రాజకీయ పరిజ్ఞానాన్ని పొలిటికల్ సైన్సు లో ఒక ఛాప్టర్ గా పెట్టి మరి భోదించాలి. దేశ అత్యున్నత  దర్యాప్తు సంస్థ సి బి ఐ. ఒకరకముగా దేశం లో ప్రతి పౌరుడికి  సి బి ఐ అంటే ఒక నమ్మకం. వారు దర్యాప్తు చేసి తేల్చి చెప్పారు అంటే అచ్చోసిన అంబోతు కి ముద్ర వేసి భయటకు పంపించినట్టే. అంటే దేశ ప్రజలకి సి బి ఐ దర్యాప్తు మీద అంత నమ్మకం.కానీ సి బి ఐ ఖ్యాతి తగ్గించి, వారి లోను అవినీతి పరులు ఉన్నారు, వారి దర్యాప్తు ఫైనల్ కాదు అనే విధముగా ప్రజలని ఆలోచించే విధముగా పక్క ప్రణాళిక తో వ్యూహం రచించి, అర్ధరాత్రి అమలు చేసిన నిర్ణయం పైన కొన్ని రకాల భిన్న అభిప్రయాలు ఏర్పడిన, సుప్రీమ్ కోర్ట్ జోక్యం తో కొంచెం పరిస్థితి ప్రజాస్వామ్య దేశ గౌరవాన్ని కాపాడింది అనే చెప్పాలి. ముద్ర పడకుండా మోది సర్కార్ చాల జాగ్రత్త పడిన,  రాఫాలే పైన మాత్రం సుప్రీమ్ కోర్ట్ పట్టువిడవలేదు.

జాతీయ మీడియా  మీద అంక్షల ప్రభావమో ఏమో తెలియదు కానీ వారు మాత్రం ఇసుమంత  సమాచారం దొరికిన, ఏమాత్రం పట్టు విడవటంలేదు. సుప్రీమ్ కోర్ట్ అంటే దేశ ఉన్నత న్యాయ స్థానముగా పేరు. ఇక్కడ న్యాయం జరగపోయిన అక్కడ న్యాయం జరుగుతుంది అనే ప్రజల నమ్మకం.

రాఫాలే తో అంబానీ కుటుంబానికి ఋణం తీర్చుకున్న, పాశం మాత్రం సుప్రీమ్ కోర్ట్ రూపములో మెడకు చుట్టుకుంది. కాగితాలు పోయాయి అని చెప్పిన, పోయినవి ఫొట స్టాట్ కాపీ లు అని చెప్పిన సుప్రీమ్ కోర్ట్ విచారణ ఎక్కడ కూడా ఉపసమహరించలేదు. చేసిన తప్పుకి కోర్టుకి లెక్కలు చెప్పాలి! దానికి సిద్దపడ్డారు, కానీ జరిగే పరిణామాలు చూస్తే వేసిన వ్యూహం వేరుగా ఉన్నది !

సుప్రీమ్ కోర్ట్ ఒకవేళ వీరిని దోషులగా తేల్చి చెప్పితే, ప్రజలు వీరిని మళ్ళి నమ్మి ఓటు ఎలాగా వేస్తారు-   గుడ్ విల్ పోకూడదు అందుకుగాను, తిమ్మిని బమ్మిని చెయ్యాలి అంటే సుప్రీమ్ కోర్ట్ లోనే  ఏది సక్రమముగా జరగటం లేదు అనే విధముగా ప్రజల ఆలోచన విధానం సిద్దం చెయ్యాలి, అందుకు గాను సుప్రీమ్ కోర్ట్ మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలలో తగ్గించాలి. అ క్రమంలో వదిలిన అస్త్రమే ఈ "అఫ్ఫిడవిట్ కమల మంత్రం".

* చీఫ్ జస్టిస్ మీద నే రాజకీయ కుతంతరం మోది పని ఎందుకు కాకూడదు. ?
* ఈ విధముగా చేసి, మిగత న్యాయమూర్తులను, వారికీ వ్యతిరేక ముగా చేస్తే పరిణామాలు ఇలాగె ఉంటాయి  అనే బెదిరింపు చర్య ఎందుకు కాకూడదు ?
*  విచారణ చేపట్టింది "రాఫాలే" మీద, వ్యవహారం లోకి దిగింది రెండు కార్పొరేట్ కంపెనీ లు అందులో ఒకరి పేరు ఎవరు చెప్పకపోయినా అందరికి  సుపరచితమే, అ ఒక్కరు ఏ ఒక్కరికి అత్యంత అప్తులో అందరికి తెలిసిందే.

భారత దేశ అత్యున్నత న్యాయ స్థాన 46 వ  న్యాయమూర్తి మీద జరిగింది  ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని చెప్పటానికి ఏ మాత్రం సంకోచినవసరం లేదు.  ఇది ప్రజాస్వామ్య దేశానికీ అంత మంచి పరిణామం కాదు.
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image