Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Saturday, 23 March 2019

చింతలపూడి నియోజకవర్గం లో గెలుపు ఎవరిది ?


 

చింతలపూడి నియోజకవర్గం లో ఏ పార్టీ గెలిస్తే అ పార్టీ రాష్ట్రం లో జండ పాతుతుంది అనే సెంటిమెంట్ తెలుగు రాష్ట్రం లో ఉంది

ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం లో,  ప్రధానముగా ఇద్దరి పేరులు మారుమోగుతున్నాయి.  కర్ర రాజారావు మరియు వి అర్ ఎలిజా. ఒకరు డాక్టర్, మరొకరు ఐ అర్ ఎస్. ఇద్దరు విద్యావంతులే. ఇద్దరు సమాజంలో కీలక పాత్రలు పోషించినవారే.  ఎవరి మీద కూడా ఇప్పటివరుకు రిమార్క్స్ లెవ్వు. చాలామంది వెతకటానికి ప్రయత్నం చేసిన ఏమి దొరకలేదు.  ముఖ్యముగా ఎలిజా మీద.

వీరిద్దరూ బరిలోకి దిగటం తో విభిన్న చర్చలకు తావు తీస్తున్నది. ఇద్దరు లో ఎవరో ఒకరు గెలవాలి, మరొకరు ఓడిపోవాలి దాన్నే పోటి అంటారు. పార్టీ ల ప్రస్థావన ప్రక్కన పెట్టి వాస్తవాలు ప్రస్తావిస్తే ఏరకముగ ఎవరు ప్రస్తుతం బల పడుతున్నారు అనే విషయం విశ్లేషించ వలిసిన అవసరం ఉంది. • ప్రభుత్వ పధకాలు ప్రజలలో కి వెళ్ళాయి. కొన్ని అవకతవకలు జరిగిన ప్రజలు మాత్రం అలవాటు పడిపోయారు.  కేవలం ఇలాగ అలవాటు పాడటానికి ప్రతి పక్షం ఒక కారణం అనే చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీ వారు అవినీతి ని వెలికి తియ్యటం మీద ఉంచిన దృష్టి లో 10% అయిన ప్రధాన ప్రతిపక్షం వారు పెట్టి ఉంటె బాగుండేది. కనీసం వారు సాక్ష్యలతో భయట పెట్టిన విషయాల పైన నేరుగా పోరాటం చేసిన బాగుండేది. కేవలం అధికార పక్ష పార్టీ అధినేతను తిట్టటం  పైనే దృష్టి పెట్టటం లో అంతరాయం ఎవరికి అర్ధం కావటం లేదు. 
 • స్థానికముగా ఉన్న అవినీతిని, అవకతవకలను అందుకు పాలుపడిన స్థానిక నాయకుల మీద కనీసం తమ సామజిక మాధ్యమం లో కూడా ఒక పోస్ట్ పెట్టలేని పరిస్థితి . రాష్ట్ర స్థాయి నాయకులు అప్పటికే విమర్శా అస్త్రాలు ముఖ్యమంత్రి మీద సంధించారు, ఇంకా మండల స్థాయి కార్యకర్తలు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ స్థానికముగా ఉన్న అవినీతి, అవకతవకలు, ఇబ్బందులు మీద నోరు మెదపకుండా ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రి ని విమర్శించినందుకు ఓటు వేస్తారు అనే ఆలోచన ఎంత బలమైనది ?
 • ఇంకా ఘంట మురళి గారు పార్టీ ని విడటం వలన ప్రతిపక్ష పార్టీ కి ఇంతటి నష్టం, అంతటి నష్టం అని మేము చెప్పాము, ఎందుకంటె అయిన పార్టీ విడటం వలన ఎంతటి నష్టం అనేది విచక్షణ ఉన్న ఏ రాజకీయ నాయకుడికి అయిన అర్ధం అవుతుంది. అయన ఒకప్పటి శాసనసభ్యుడు, అయిన ఓటమి తో వేనుతిరగాలేదు, 20 సంవత్యరాల చింతలపూడి నియోజకవర్గ చరిత్రను తిరగావ్రాసిన వ్యక్తీ.  మరి అంతటి వ్యక్తీ కి జన బలం ఏ విధముగా ఉంటుంది అనే విషయం ఆలోచించాలి.  అయిన వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తారు?  కామవరపుకోట లో అయిన వర్గం వారు, మరియు పాలక పక్షం పార్టీ వర్గం  చేక్కుచేదరదు, అయిన పార్టీ మారటం తో రాజకీయ ప్రత్యర్దులకు  ఎంతోకొంత నష్టం తప్పదు అనే విషయం  చాల మంది మనోభావం.
 • ఇంకా అక్కడ స్థానికి జెట్ పి టి సి ఘంట సుదీర్ బాబు నియోజకవర్గం లో సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ, అవసరమైతే తన జేబులో డబ్బు తీసి  ప్రజలకి  పెడతారు అనే మార్క్ తెచ్చుకున్నారు. తన వర్గాన్ని  సమర్దవంతముగా విభేదాలు లేకుండా తనవంతు కృషి చేస్తూ పార్టీ కి కట్టుబడి తన పరిధి వరుకు పార్టీ ల బేధం లేకుండా సమర్దవంతముగా అయిన విధులు నిర్వర్తించుకుంటు వచ్చారు అనే స్పష్టత వచ్చింది. 
 • ఇంకా మాజీ  శాసనసభ్యులు మద్దాల రాజేష్ గారు సైలెంట్ గా ఉండటం అనేది ఎవరికి మైనస్ అనే విషయం వేరే చెప్పనవసరం లేదు.  అయన తరహ ఫోల్లోవర్స్ ఆయినకు ఉన్నారు. అయిన న్యూట్రల్ గా ఉండటం వలన ఒక పెద్ద చెయ్య వేనుతిరిగినట్టే. 
 • సోషల్ మీడియా సైనికులు మాత్రం ప్రతి పక్షం లో అలుపు సొలుపు లేకుండా పోరాడుతున్నారు. ముఖ్యముగా యంగ్ స్టార్స్ చింతలపూడి నియోజకవర్గం పరిధికి మాత్రం ఒక వార్త సంస్థ లాగా పనిచేస్తున్నారు. ఒక కట్టుతో పని చేస్తున్నారు. వారి ప్రభావం మాత్రం సోషల్ మీడియా లో అద్బుతముగా పని చేస్తుంది. 
 • జానకి రెడ్డి రెడ్డి గారు, బొడ్డు వెంకటేశ్వరరావు గారు, ఖాదర్ బాబు గారు, చుండూరు నాగేశ్వరరావు తదితరులు  పార్టీ  ని ప్రజలలోకి విస్తృతముగా తిసుకేళ్ళుతున్నారు.  
 • ఎలిజా గారు స్థానికులు కాకపోయినా , ఇక్కడ ప్రజలతో మమేకం అయ్యి పాలక పక్ష కార్యకర్తలను తన పార్టీ లో చేర్చుకోవటం, ప్రజలలో బాగానే కలిసి పోయారు. వలసలు విషయం లోనే కొంచెం ఆలోచించాలి, సీనియర్ నాయకులు పార్టీ నుంచి ప్రక్కకి తప్పుకోవడం, ప్రత్యర్ది పార్టీ లో చేరటం శుభ పరిణామ కాదు కొంచెం ఆలోచించాలి.


ఇంకా స్థానిక మాజీ  శాసనసభ్యులను " ఐరన్ లేడీ  " గా పెరుకోవచ్చు. ఆమె పోరాట పటిమ మేచ్చుకోలేని వారు లేరు, కానీ, రాజకీయం పోరాటం లో నలిగిపోయే జీవితాలు చిన్నవే. 5 సంవత్యరాలు  సమర్దవంతముగా నియోజకవర్గం లో ఒక కేడెర్ ని ఏర్పాటు చేసుకొని " బోలా శంఖరుడిగా  " పేరు తెచ్చుకున్నారు. కానీ అ పోరాటం లో నలిగి పోయిన చిన్న ప్రాణులలో పార్టీ కార్యకర్తలే ఎక్కువ అవటం, అ పోరాటం లో ఆమె పవర్ ని ఉపయోగించుకొని, ఆమె కు తెలియకుండా తీవ్ర అవినీతి కి పాలుపడి, ఆమెకే వెన్నుపోటు పొడిచిన వైనం ప్రజలలో విస్తృతముగా ప్రచారం లో ఉన్నది.  పార్టీ మీద వ్యతిరేకత లేదు.   


 • పాలక పక్షం లో గ్రూప్ గొడవలు బహిర్గతం అవ్వటం తో, ముందు చూపుతో పార్టీ నాయకుడు స్థిరత్వంతో నిర్ణయం తీసుకున్నారు. 
 • రాజారావు గారి మీద సానుభూతి మరియు ప్రజలతో కలమషం లేకుండా, చిన్న పెద్ద లేకుండా అందరిని పలకరించటం 
 • నియోజకవర్గ ముఖ్య నాయకుల సపోర్ట్ ఉండటం, ఘంట మురళి గారి వర్గం కూడా తెలుగు దేశం లో కలవటం, స్థానిక వ్యక్తి అనే ననుడు ప్రజలలో ఉండటం
 • ఇంతక మునుపు ఓటమి సానుభూతి ఉన్నాయి.
 • సోషల్ మీడియా లో ఈ నియోజకవర్గం  కొంచెం  బలహినముగానే ఉంది అనే చెప్పాలి. ముఖ్య నాయకులు తప్ప అ సెక్టార్ కి కేడర్ ని కేటాయించలేదు అని అర్ధం అవుతుంది. ఒకప్పటి సోషల్ మీడియా ఇంపాక్ట్ 19% మాత్రమే కానీ ఇప్పుడు జియో వచ్చిన తరువాత  చాల మందికి తెలియకపోవచ్చు ఒక్కసారి గమనిస్తే మంచిది.
 • చింతలపూడి నియోజకవర్గానికి ఏమి చేస్తారు అనే విషయం పైన మౌనం వహించటం ( ఇరు పార్టీ వారు ) ? 
 • సీతానగరం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పొల్యూషన్  విషయం లో ఎటువంటి ప్రకటన చెయ్యకపోవటం, కనీసం విద్య సౌఖర్యాల నిమ్మిత్తం నోరు మేధాపకపోవటం, చింతలపూడి అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవటం, నియోజకవర్గ స్థాయి అభివృద్ధి గురించి ప్రస్థావన లేకపోవటం మైనస్ అంశాలు గా పరిగణించవచ్చు.
 • పధకాల లబ్దిదారులు ఎక్కువమంది ఉన్నారు, పార్టీ ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు న్యాయమే చేసారు, అవమానాలు ఏమైనా ఉంటె వారె పడ్డారు కానీ కార్యకర్తలు లబ్దిదరులవరుకు రాన్నివకపోవటం కలిసివచ్చే అంశం .
 • అధికారం లో ఉన్న ప్రతిపక్ష న్ని చవిచూసిన సీనియర్ నాయకులు పార్టీ ని విడకపోవటం, పార్టీ కోసం పని చెయ్యడం,  కలిసివచ్చే అంశాలు   
 • రెడ్డి, కమ్మ సామజిక వర్గాల విభేదాలను విస్తృతం చేసే ప్రయత్నం చేసిన రెడ్డి సామజిక వర్గం వారు పార్టీ ని విడకపోవటం, పార్టీ ని నమ్ముకొని ఉండటం కలిసివచ్చే అంశం 
 • ఇబ్బంది పడిన కార్యకర్తల మనోభావం ఎవరు చదవలేదు, ఈ విషయం లో సంకోచం తప్పదు 
 • పితల సుజాత గారు సి యం మీటింగ్ కి రావకపోవటం తో ఆమె వర్గీయులు పార్టీ తో విభేదిస్తున్న సూచనలు ఉన్న, ఆమె ద్వార లబ్ది పొందినవారు చాలామంది మునపటి ఎన్నికలలో ప్రతిపక్షం తరుపున పని చేసినవారు కావటం తో ఉహించినంత ప్రమాదం లేక పోవచ్చు అనే అభిప్రయాలు ఉన్నాయి 
 • టికెట్ ఆశించిన వ్యక్తులు నిరాశ కి గురి కావటం తో వారి మనోభావం ఏమిటో ఎవరికి అర్ధం కావటం లేదు 
 • విరోచితముగా పోరాటం చేసినట్టు  పేరు తెచ్చుకున్న, కొంత మంది మదిలో చెరగని అభిప్రాయాలు మిగిలిచి వెళ్ళిన వారు అ చేదు అనుభవాలను మేము లేక్కచేయ్యము, అభ్యర్ది ఎవరు అయిన మా మద్దతు పార్టీ కే అని అభిప్రాయాలు వ్యక్తం చేసే కార్యకర్తలు ఉండటం కలిసి వచ్చే అంశంఈ మధ్యలో మారుముడి థామస్ గారు  నేను లోకల్ అనే స్లోగన్ తో ముందుకు దూసుకుపోతున్నారు, అలాగే జనసేన్ కార్యకర్తలు ముఖ్యముగా యువత జనసేన పైన మక్కువ చూపించడం తో ఓట్లు విపరీతముగా చిలుతవి అనే అంశం క్లియర్ గా అర్ధం అవుతుంది.

ఈ రేస్ లో  థామస్ గారు కీలక పాత్రా వహించే సూచనలు ఉన్నాయి.  మరి ముఖ్యముగా ఓట్లు బాగా చిలటం అనే వ్యవహారం లో థామస్ దే పెద్ద చెయ్య అవుతుంది. ఎందుకంటె అందరికి సుపరిచితుడు, అందుబాటులో ఉంటాడు అనే అభిప్రాయాలు ఉన్నాయి,  ప్రధాన పార్టీ వారు ఒకే సామజిక వర్గానికి సీట్ లు కేటాయించారు, సరిగ్గా పని చేస్తే పరిణామాలు ఎవరు ఉహించని విధముగా ఉంటాయి.
 


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image