ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మోది ఎందుకు సూపర్ అంటే ? ఇంతకి ప్రణాయ్ హత్య గుర్తుందా ?



     
నిజమే మోది సూపర్, ఎందుకంటె ఏ దేశం అయితే తనని తిడుతుందో అదే దేశం తో తనని పొగిడే విధముగా ప్రణాళిక రచించారు,  ఒక్క దెబ్బతో రాఫాలే మరిచిపోయారు, ఒక్క దెబ్బతో గోవుల గురించి చేసిన దాడులు, హత్య లు మరిచిపోయారు, కుల మతహంకర హత్యలు మరిచిపోయారు,  ఒక్క దెబ్బతో కధువ ఉద్దంతం మరిచిపోయారు, ఒక్క దెబ్బతో చమరు ధర పెంపు మరిచిపోయారు, ఒక్క దెబ్బతో నిరావ్ మోది ని మరిచిపోయారు, ఒక్క దెబ్బతో మాలియను మరిచిపోయారు, ఒక్క దెబ్బతో రాజ్యాంగాన్ని తగలబెట్టిన వారిని మరిచిపోయారు, ఒక్క దెబ్బతో అద్వానీ కి  జరిగిన అవమానం మరిచిపోయారు.



మొత్తానికి దేశం అనే ప్రదేశం లో బ్రతుకుతు మట్టిని మతి కి ఎక్కించుకున్న చాల మంది చాల విషయాలు మరిచిపోయారు.

ఇంతకి ప్రణాయ్ హత్య గుర్తుందా ? అదే సర్ అప్పుడు ఎవడో ఒకడు చేసిన తప్పుకి అగ్రవరణ లందరినీ ఎకి పడేసారు గుర్తుందా ? చాల మందికి తెలియన విషయం ఏమిటి అంటే అతని హత్యను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల వారు అన్ని ప్రాంతాలలో  సానుభూతి తెలియచేసారు మరియు ఖండించారు. కానీ బి జే పి అనే ఒక్క పార్టీ, అందులో ఉన్న  ఏ ఒక్క అభ్యర్ది కానీ  కనీసం కొవ్వొత్తి కాదు కదా అ హత్యను ఖండిస్తూ  ఒక  పత్రిక ప్రకటన  కూడా చెయ్యలేదు.

కుల మత వ్యవస్థలను మరింతగా ప్రజలలో, మన ప్రజాస్వామ్య దేశం లో  భాలోపెతం చెయ్యడం లో ఎవరు ఏ పాత్రా వహిస్తున్నారో  ఇంతక మించి ఉదాహరణ అక్కర లేదు !

ఎవరు ఎవరిని ఉపయోగించుకుంటున్నారు ? ఎవరు ఎవరికి ఉపయోగ పడుతున్నారు? అరె ఛి ఛి మరిచిపోదము అన్ని మరిచిపోదము.  బానిస బతుకులకి అలవాటుపడిపోయము కదా ఎవరు ఏమి చేస్తే ఏమిటి, ఎవరు ఎవరిని సమర్ధిస్తే ఏమిటి, ఎన్ని సారులు మనోభావాలు దెబ్బ తింటే ఏమిటి ? కనీసం ఒక కులంహకర హత్య మీద ప్రతిఘటించలేని వారి మీద మన నమ్మకం వమ్ము కనివద్దు. వారిని నమ్మిన వారి నీడలో ఉన్నవారి తోడుతో  సరైన సంరక్షణ కోసం ఇటువంటి ఎన్ని హత్యలు జరిగిన హత్యల మీద కనీసం నోరుమెదపకుండా, కాలు కదపకుండా విశ్వసనియముగా అన్ని మరిచిపోయి జయ హా అంటు హాయిగా అన్ని మరిచిపోయి వారిని అంటిపెట్టుకొని అంటకగేవారి కోసమే .......?


మోది ఒకరిని ఉద్దేశించి బెయిల్ మీద ఉన్నారు అన్నారు అయన మరో ప్రక్క న చెప్పేది ఏమిటంటే రాష్ట్రంలో  ఇద్దరు కీలక వ్యక్తులు బెయిల్ మీదనే ఉన్నారు కదా అని అర్ధం. ఎవరి మీద మక్కువ లేదు ఒక్క ఆంధ్ర రాష్ట్రం లో బి జే పి ని బలోపేతం చెయ్యటము తప్ప. మరి దేశం మీద ప్రేమ ఉన్నవారు తమ పార్టీ కో లేదా నోటకో వోట్ గుద్దామని ఎందుకు చెప్పలేదు. అయన ఒకరికి ఓటు వెయ్యవద్దు  అని  చెప్పటం లేదు మరొకరికి ఓటు వెయ్యమని చెప్పటం లేదు, మరో విధముగా మా అభ్యర్ధుల ఎటువంటి నేర చరిత్ర లేని వారు అనే సూచనలు ఇస్తున్నారు అందుకే మోది మరొకసారి సూపర్.

అయిన కోరుకునే రామ పాలన జరగాలి, అంటే ఎవరి స్థానం లో వారు ఉండాలి, అసమానముగా సమానత్వనికి సమాన్వ్యయముగా కర్త, కర్మ, క్రియ గా వ్యవహరించి, అంటే రాజుని రాజు లాగా, బంటు ని బంటుగా, అందుకే ప్రణాయ్ హత్య గురించి ఎవరు నోరు మెదపలేదు.  మోది చెప్పారు కే సి అర్ వచ్చారు, మోది చెప్పారు ప్రశాంత్ కిషోర్ వచ్చారు, ఇంకా మోది చెప్పితే ఏమైనా జరగవచ్చు? అయిన చెప్పితే గుజరాత్ లో చాలమందికి  జరిగిన అన్యాయం, అవమానం  ఇక్కడా జరగవచ్చు అనే ఆలోచన ఎవరి కలగలేనందుకు, మోది మరోసారి   సూపర్. 

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement