Skip to main content

బంచత్ ని కా ళ్ళు మొక్కుతా దొర ? ఈ పరిస్థితి ఆంధ్ర లో వస్తుందా ?     


ఒకరి కల ముఖ్యమంత్రి, మరొ ఇరువురి  కల ముఖ్యమంత్రి  పతనం, అసలు ఆంధ్రవారి మీద మోది కి ఎందుకంత చిన్న చూపు ?

గుజరాత్ అల్లరుల సమయములో మత విద్వేషాలు రెచ్చగొట్టిన వైనం లో మోది కి వ్యతిరేకముగా గాలులు వీస్తున్న రోజులలో అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయం మోది అడిగినారు, కానీ అతను అప్పుడు ఇటువంటి మత విద్వేషా  సంబంధ విషయాలలో ఎవరిని ఉపేక్షించలేను అనే విధముగా వ్యవహరించాడు. అప్పటికి నైతిక బాధ్యత తోనో  లేదా అధిష్టానం నిర్ణయమో గుజరాత్ ముఖ్య మంత్రి పదవి కోలి పోయారు.  అప్పుడు సహాయం అడిగిన వ్యక్తి మోది, కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి  నారాచంద్రబాబు నాయుడు.

ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక శాసన సభ్యుడు తనకి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పి తెలంగాణా నినాదం తో కొత్త పార్టీ ఆవిర్భవించాడు. ఇదే విషయన్ని గౌరవ శ్రీ దివగంత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ లో అందరి ముందు ప్రశ్నించారు.  రాష్ట్రం విడిపోవటం తెలంగాణా సెంటిమెంట్ పని చెయ్యటం అతనికి కలిసి వచ్చి సి యం పదవని అలంకరించారు.త్రికోణ యుద్ధం ఎందుకు ?

ప్రధాని అయిన దగ్గర నుంచి మోది ఆంధ్ర రాష్ట్రం పైన చిన్న చూపే, ఆంధ్ర వారి పైన చిన్న చూపే చూస్తూ వచ్చారు. కనీసం ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళితేనే మన జేబులో ఉన్న ఎంతో కొంత గిఫ్ట్ ప్యాక్ చేస్తాము, అలాంటిది మట్టి నిరు తెచ్చి ఆంధ్ర వారిని స్థాయి తక్కువవారిగా ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అ రోజు, అ నాటి  అ వార్త ప్రపంచం మొత్తం విక్షించింది " చెంబుడు నీళ్ళు  , పిడికెడు మట్టి " ఇచ్చారు తప్ప రాజధాని నిమిత్తం  ఎటువంటి ఆర్ధిక సహయం ప్రకటించలేదు.  కొందరు విశ్లేషకులు మనోగతం ఏమిటంటే అ విషయాన్ని వ్యతిరేకించిన వెంకయ్యనాయుడు గారిని సైతం పార్టీ కి దూరం చేసిన వైననికి దేశం అంత సాక్ష్యులు గా నిలిచాము.

ఆంధ్ర రాష్ట్రం పైన పట్టు కోసమే నా ? 

ప్రతిపక్ష పార్టీ కి సహకారం గా ప్రశాంత్ కిషోర్ ని పంపించిన జాతీయ పార్టీ, ఆంధ్ర రాష్ట్రం మీద ఏనాడో కన్నేసింది అనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రం లో స్థానిక పార్టీ లని దెబ్బ తీసి అ స్థానాన్ని జాతీయ పార్టీలు భర్తీ చెయ్యాలి అనేది ఒక ప్రణాళిక కావచ్చు అనే అభిప్రాయాలు లేకపోలేదు.

ఇందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మినహాయంపు కాదు !

ప్రధాన ప్రతి పక్ష నేత మీద ఉన్న కేసులు గురించి దేశానికీ తెరిచినా పుస్తకమే. ఎందుకంటె అప్పటిలో కేంద్ర ప్రభుత్వాన్ని, స్థానిక ప్రతి పక్షాన్ని ఖాతరు చెయ్యని వైఖరి జాతీయ గుర్తింపుని తీసుకోని వచ్చింది. అయితే కొన్ని కేసుల లో ఉరట కలిగించటం  వలన జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షానికి వేనుదండగా ఉన్నది అనుకోవటం పొరపాటు అనే చెప్పవచ్చు.

ప్రస్తుతం తెలంగాణా సర్కార్ మద్దతు తో ప్రధాన ప్రతి పక్షాన్ని బల పరిచి, అ తరువాత కేసు ల విచారణ ముమ్మరం చేస్తే, ప్రధాన ప్రతి పక్ష నేత బలహీన పడిన క్షణాన్న, అతని చేతిలోనుంచి పార్టీ పగ్గాలు తీసుకోవచ్చు, లేదా విలీనం  చేసుకోవచ్చు అనే వాదనలు లేకపోలేదు, తమిళనాడు వ్యవహారం లాగా.

తెలంగాణా ఎన్నికలలో వేలు పెట్టారు

తెలంగాణా ఎన్నికలలో వేలు పెట్టారు అనే నెపంతో తెలుగుదేశం పైన టి అర్ ఎస్ యుద్ధం ప్రకటించలేదు, అందుకు కారణాలు వేరు. స్థానిక పార్టీ మరియు జాతీయ పార్టీ లు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి. స్థానిక పార్టీ లు ఎటువంటి పనులు చెయ్యాలి అన్న జాతీయ పార్టీ ల ప్రోత్యాహం ఖచ్చితంగా కావలిసిందే.

తెలుగు రాష్ట్రం లో తను  బల పడాలి అనే ఉద్దేశం తో, ఇక్కడ ముఖ్య మంత్రి మీద కక్ష సాధింపు చర్యతో ఆస్థాన సలహాదారుడు అయిన ప్రశాంత్ కిషోర్ ని ప్రధాన ప్రతిపక్షానికి అండగా నియమించారు. అంతక మునుపే జాతీయ పార్టీ కి ఇక్కడ స్థానిక పార్టీ కి మధ్య దౌత్యం జరిగింది, బలహినముగా ఉన్న వ్యవస్థను బల పరచటానికి ప్రశాంత కిషోర్ నియమితులు అయ్యారు.  ఈ వ్యవహారం ఇంటలిజెన్స్ ద్వార రాష్ట్ర ముఖ్య మంత్రి కి చేరకుండా ఉంటుందా ? దాని ఫలితం  ఓర్పు గా రాష్ట్రానికి రావలిసిన ఫండ్స్ మొత్తం తీసుకోని, స్పెషల్ స్టేటస్ ఇవ్వను అన్న నోరు మెదపని పరిస్థితి మరియు అరెస్ట్ లు చేయించే పరిస్థితి  వచ్చింది. స్పెషల్ స్టేటస్ రాదు, రాష్ట్రం లోటు బడ్జెట్ తల వంచిన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తప్పలేదు ఇది ఒక వాదన. మొత్తానికి రాష్ట్రానికి సరిపడా బడ్జెట్ రాబట్టుకున్నారు అలాగే నిధులు.


ఇంకా ముసుగులో గుద్దులాట చెదిరిపోయింది , పరస్పరం నేరుగా బరిలోకి దిగి మరి దుషించుకున్నారు, ఒకరి మద్దతు మరొకరు విరమించుకున్నారు. ఉహించని కలయకలు జరిగాయి.

మరోవైపు ప్రధాన ప్రతి పక్ష నేత టి అర్ ఎస్

మరోవైపు ప్రధాన ప్రతి పక్ష నేత టి అర్ ఎస్ తో జట్టు కట్టటం వారి నుంచి వీరికి సపోర్ట్ రావటం, సమాజం లో నేమ్ అండ్ ఫేం ఉన్న వ్యక్తులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లో చేరటం అంత కే సి అర్ మహిమే అని అందరికి తెలిసిన విషయం. ప్రధాన ప్రతిపక్ష నేత ను కే సి అర్ సామంత రాజు గా సంబోదిస్తున్నారు కానీ కే సి అర్ ఏ ఒక సామంత రాజు అనే విషయం మరుస్తున్నారు.

ఈ కలయకతో ప్రధాన ప్రతిపక్ష నేత ఎంత బలం చేకూరింది కానీ, విమర్శలు గురి అవ్వక తప్పటం లేదు. అప్పటివరుకు ఒఫ్ఫెన్సివె ఫార్మాట్ లో దూసుకుపోతున్న ప్రధాన ప్రతిపక్ష నేత  ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు అనే చెప్పాలి.  అది అయన మీద ఉన్న వ్యతిరేకత కాదు కేవలం కే సి అర్ ఆంధ్రప్రజల మనోభావాలు దెబ్బతినే విధముగా వివిధ ప్రజా సభలలో దూషించిన చర్యల కి ప్రతిఫలం.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక్ష పోరు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక్ష పోరు ప్రధాన ప్రతి పక్ష పార్టీ కి పాలక పక్ష పార్టీ కి అయిన పాలక పక్షం ముగ్గురి తో యుద్ధం చెయ్యవలసిన పరిస్థితి.  ఒక ప్రక్క నుంచి జాతీయ పార్టీ తో మరో రెండు స్థానిక పార్టీ ల తో. ఒకరి కల సి యం అవ్వాలి అని చెప్పుతున్నారు, మరొకరు విజన్ అంటున్నారు ఎవరు గెలవాలి అనేది వారి పని తీరును బట్టి ఉంటుంది.


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics