Skip to main content

జవాన్ నిజమైన మానవహక్కుల సంరక్షకుడు - కానీ భారతీయులు ?       జవాన్ నిజమైన మానవహక్కుల సంరక్షకుడు - కానీ భారతీయులు ?నిజమే సైనికుడు అనే వాడు నిజమైన మానవ హక్కుల సంరక్షకుడు. మనము ఎన్ని  లంచలు తీసుకున్న, కార్పొరేట్ పేరుతో ప్రజలను పిల్చి పిప్పు చేసిన, చదువును అమ్ముకున్న, కులాలు పేరుతో మతాలు పేరుతో  నరుకున్న, చంపుకుంటున్న,   గోవు కోసం మనుషులను చంపిన, యుద్ద యంత్రికల లో లంచలు మరిగిన, నిజాయతి ఏ కొస అయిన కనిపించని నాయకుల మధ్య బ్రతుకుతున్న  మన కోసం కుటుంబానికి దూరముగా, మండే ఎండలో, గెడ్డ కట్టించే చలి లో, కుండపోత వర్షం లో  పహారా కాసిన సైనికుడు నిజమైన మొగాడు. వారి త్యాగం వెలకట్టలేనిది.

కానీ మరి వారి త్యాగం మనకి వారు చనిపోయినప్పుడు మాత్రమే గుర్తుకురావటం వారిని గౌరవించినట్టె నా ? వారు వారి విధి సరిగ్గా నిర్వహిస్తున్నారు కాబట్టే మనము ఇక్కడ పెళ్ళాం పిల్లలతో, తల్లి తండ్రుల తో ప్రశాంతముగా ఉంటున్నాము, అందరికి తెలిసిన విషయమే.మరి అంత కష్ట పడి ఒక సైనికుడు ఎందుకు దేశాన్ని సంరక్షించుకోవాలి ?

జీతం కావాలి అంటే ఏ ఉద్యోగం చేసిన అంతకన్నా ఎక్కువ జీతమే దొరుకుతుంది. కానీ ప్రాణ హాని ఉన్న సైన్యం లో ఉద్యోగం లో ఎందుకు చేరతారు, ఎందుకంటె అది వారికీ దేశం మీద ఉన్న ప్రేమ, దేశాన్ని సంరక్షిన్చుకోవాలని ఆకాంక్ష. ప్రాణం పోయిన పర్వాలేదు నా దేశాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ దేశం అంటే మనుషులు అనే విషయం మరవకూడదు. మరి అక్కడ వారు అంత కష్టపడుతుంటే మనము ఇక్కడేమి చేస్తున్నాం. మన దేశ పరిస్థితి ఎలాగా ఉంది అంటే నిజంగా ఒక సైనికుడు ఏదైన సమస్య తో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళితే అతని జేబు వైపు కూడా కమిషన్ ఎంత అనే విచిత్రమైన చూపు చూసే పరిస్థితులు లెవ్వు అనే విషయం మీ గుండె మీద చెయ్య వేసుకొని చెప్పగలిగితే ఈ ప్రచురణ సారాంశం తప్పే అని మేము మనస్పూర్తిగా ఒప్పుకుంటాము.

వేరొక దేశం వారు మన దేశాన్ని ఆక్రమిస్తే మన హక్కులని కాల రాస్తారు, పాలనా వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, ఇవి జరగకుండా కాపాడే సైనికుడు నిజమైన మానవహక్కుల సంరక్షకుడు.   ప్రజలు అంటే ఈ దేశం లో నివసించే మనము, మనము ఇబ్బంది పడతం, బానిస బ్రతుకులు బ్రతకాలి, అలాగా బ్రతకకుడదు అనే ఉద్దేశం తోనే వారు వీర మరణం పొందుతున్నారు. నిజంగా వారి ఆత్మలు ప్రస్తుతం భారత దేశం లో ఎక్కడ సంచరించిన ఇక్కడ పరిస్థితులు చూసి వారి త్యాగాన్ని వారె ప్రశ్నించుకునే పరిస్థితి దేశంలో లేదు అని చెప్పగలరా !.

నేను నిజాయితి పరుడుని అని అనుకుంటే సరిపోదు, మన చుట్టూ జరిగే అవినీతి గురించి  స్పందిన్చాలేనప్పుడు, కనీసం భయటకు కూడా చెప్పలేకుండా బ్రతికే వారి  బ్రతుకుల కోసం కూడా వారు అక్కడ అన్ని వదులుకొని పహారా కాస్తున్నారు, ప్రాణాలు విడుస్తున్నారు, వీర మరణం పొందుతున్నారు.  ఇప్పుడే ఒక్క ఆర్టికల్ లైవ్ లా వారు ప్రచురించారు నువ్వు అవినీతి మీద పోరాడితే ని మీద ప్రభుత్వం పోరాడుతుంది , ఇది చెప్పింది ఐ ఎఫ్ ఎస్ అధికారి. భారత దేశ అత్యున్నత సర్వీస్ లో అయిన పని చేసిన సర్వీస్ ఒకటి,  ఆయినే అటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏమిటి ?


ఎవడు అవినీతి  చెయ్యటం లేదు ? ఇది ఒక పట్టబధ్రుడు ఒకరికి వేసిన  ప్రశ్న ! మరి వాడి చదువు ఎవడి బొంద మీద తగలపెట్టటనికి. మరి ఇటువంటి చేతకాని వారికోసం కూడా అక్కడ జవాన్లు తమ ప్రాణాలు విడుతున్నారు, అందుకే జవాను అనే వాడు నిజమైన మానవత వాది, మానవహక్కుల సంరక్షకుడు. చాలామంది సిగ్గు లేకుండా వారి సంరక్షణ పొంది, వారు ఇచ్చిన స్వేచ్చ వాయువులను పిలుస్తూ ,  అక్కడ వారంతా దేశం సరిహద్దు లో కష్టపడుతుంటే, ఇక్కడ కనీసం ఒక చిన్న అవినీతి మీద పోరాడటానికి కూడా మక్కువ చూపించకుండా భూమికి భారంగా బ్రతికేస్తున్నా పట్టబద్రులు ఎంతో మంది. అక్కడ వారు భయపడకుండా మొగడిలగా, వీరుడిగా దేశ సరిహద్దులలో తమ ప్రాణాలు సైతం విడి ఇక్కడ దేశం (ప్రజల ) కోసం పోరాడుతుంటే కొంత మంది  మన దేశం లోపల వారి వంతు కృషిగా ఒక్క అవినీతి మీద కూడా పోరాడలేకుండా పిల్లల్ని కనటం మాత్రమే మొగతనం గా, సంపాదించటం మాత్రమే పురషలక్షణముగా, గోవధ చేసిన వారి ప్రాణాలు తియ్యటమే వీరత్వం గా బ్రతికేస్తున్నరు.

అంత ప్రమాదకర పేలుడు పదార్థం దేశం లోకి ఎలాగా వచ్చాయి ?

సరిహద్దులలో సైనికుల పహారా చాల స్ట్రిక్ట్ గా ఉంటుంది, సరిహద్దు దాటి లోపలకి పేలుడు పదార్ధాలు వచ్చే అవకాశం లేదు, సర్జికల్ స్ట్రైక్ తరువత సరిహద్దు ఆప్రమత్తముగా ఉన్నది. దేశం లోపలినుంచే పేలుడు పదార్ధాలు వచ్చి ఉండాలి. మరి ఎంత మంది చేతులు తడిపితే ఒక కారు, మళ్ళి అందులో 365 కిలోల పెలుడుపదర్ధాలు పెట్టి దాడికి పాలుపడతారు.  సరే ఒక సి యం కాన్వె వెళ్తేనే రోడ్ మొత్తం బ్లాక్ చేస్తారు మరి దేశాన్ని కాపాడే సైనికులకి రవాణా సమయములో అటువంటి ఏర్పాటు చెయ్యని ప్రభుత్వాలు వారికీ ఏ పాటి విలువ ఇస్తున్నాయో అర్ధమౌతుంది.

ఒక్కసారి ఆలోచించండి అంతటి బరి పేలుడు పదార్ధాలు దేశం లోకి ఎలాగా వచ్చయ్యి. ఎవడో ఒకడో , లేదా అంతకమించి అవినీతి పరులు చెయ్యి జచకుండా అంతటి బరి పేలుడు పదార్ధం రవాణా ఎలాగా జరుగుతుంది.

ఇంటలిజెన్స్ వ్యవస్థ నిర్వీర్యం ఎవరి పని ?

అంతక ముందు జరిగిన దాడి తో దేశ ఇంటలిజెన్స్ సంస్థ జాగ్రత్త పడుతుంది. మరి వారి రిపోర్ట్ లు పైన అధికారులకు ఇవ్వకుండా ఉండి ఉండరు. వీటిని ఖాతరు చెయ్యని వారు ఎవరు ? వారిది కాదా నైతిక బాధ్యత.

26/11 లో కూడా సముద్ర మార్గం నుండి ఆయుధాలు రవాణా చేసుకున్నారు అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఆలోచించవలిసిన విషయం శత్రువులను ఇంటి దొంగలే లోపలకి అనుమతిస్తున్నారు. ఇంటి దొంగలను పట్టుకున్న మళ్ళి మళ్ళి ఇటువంటి అవంచనియ సంఘటనలు జరుగుతున్నాయి, ఇందుకు కారణం ఏమిటి ?

కేవలం ఒక్క రోజులో ఒక గంట కూడా మన చుట్టూ ప్రక్కల జరుగుతున్నా అవినీతి పైన స్పందిన్చాలేకపోవటం, నేను బాగున్నా, నేను నిజయతిగా  ఉన్న, ఎటువంటి పాపం నాకు అంటదు అని చుట్టూ ప్రక్కల జరుగుతున్న  అవినీతి మీద స్పందించకుండా యాంత్రిక జీవితం గడిపేస్తున్న చాల మందికి తెలియని విషయము ఏమిటి అంటే వారిలాంటి  వారు దేశం లో 50% పైగా ఉన్నారు, వారు స్పందించలేని సంఘటనలు, అడగలేని ప్రశ్నలే, వారి వ్యవహార శైలి,  ఈ రోజు ఇంత మంది చనిపోవటానికి ఒక్క కారణం.

ప్రతి సమస్యని  నోరు మూసుకొని ప్రశ్నించలేని కొంతమంది చేతకాని తనం, కనీసం చేతనైన వారి కి సపోర్ట్ చెయ్యలేని భూమికి భారమైన జీవితాలకోసం ఇంకెంత మంది సైనికులు మరణించాలో అనేది కేవలం అభిప్రాయం మాత్రమే కాదు వాస్తవము కూడా.   విరి వీర మరణాన్ని ప్రస్తుత దేశ రాజకీయాల దృష్ట్యా మత రాజకీయం చెయ్యకుండా ఉంటె బాగుండు అని కోరుకోవటం తప్ప చేసేది ఏమి లేదు.  శత్రువులు సరిహద్దు అవతల, సరిహద్దు లోపల కూడా ఉన్నారు, అ లోపల ఉన్నవారు భయట ఉన్నవారికన్నా ప్రమాదం, సైన్యం అవసరం ప్రస్తుతం దేశ సరిహద్దు తో పాటు, దేశం లో కూడా ఉంది

పుల్వామా ఉగ్రవాద దాడి దేశం కోలుకోలేని దాడి, దానికి నైతిక బాధ్యత వహించావలిసినవారు ఎవరు ? 43 మంది మరణించిన ఈ ఉగ్రవాద దాడి లో 43 కుటుంబాల లో తండ్రిని కోల్పోయిన వారు, కొడుకుని కొలిపోయినవారు, భర్త ని కొలిపోయినవారు, విరి శోకాలు శాపాలు గా మరి పిరికి కుక్కలా పైశాచిక చర్యలు భారత సైన్యం తిప్పి కొట్టాలి.

దేశ ప్రజలు ప్రశ్నించుకోవలసిన విషయాలు కొన్నిటికి ప్రజలు ఖచ్చితముగా సమాధానాలు ఆశించాలి


 •   350 కిలోల పేలుడు పదార్ధం దేశం లోపలకి ఎలాగా వచ్చింది ?
 • కారు సమకూర్చింది ఎవరు ?
 • స్థానిక దర్యాప్తు సంస్థలు, ఇంటలిజెన్స్ వ్యవస్థ కి సంకేతలు రాలేదా ?
 •  ఒక సి యం కాన్వె వెళ్ళితేనే ఒక రోడ్ మొత్తం బ్లాక్ చేస్తారు (ప్రోటో కాల్ ) మరి అటువంటిది సైనికుల వాహనాలు వెళ్తునప్పుడు అటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు ?
 • అ దారి లో అంతమంది జవాన్లు వెళ్తున్నరు అనే  సమాచారం చేరవేసింది ఎవరు ?
 • సర్జికల్ స్ట్రైక్  తరువత ఉగ్రవాద దాడిని అంచనా వెయ్యకుండా ప్రభుత్వం ఉంటుందా ?
 • ఇంటి దొంగలు ఎంత మంది ?
 • ఇంటి దొంగాలలో స్థానిక  ఉన్నత అధికారులు ఉన్నారా ? లేరా ?
 • ఏ మార్గం మీదుగా 350 కిలోల పేలుడు పదార్ధం వచ్చింది ?
 • అటువంటి సున్నితమైన ప్రదేశం లో 350 కిలోల పేలుడు పదార్ధం వచ్చింది ,అంటే, ఇంకా భద్రత పటిష్టముగా లేని మహానగారాలకి పేలుడు పదార్ధాలు తరలించటం ఎంతటి పని ?
 • దేశం సురక్షితముగా ఉన్నదా ? 
 • ప్రభుత్వాలు మారిన దాడులు ఆగటం లేదు, 350 కిలోల పేలుడు పదార్ధం దేశ రక్షణ ను ప్రశ్నిస్తుంది.
         
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics