Skip to main content

ఈ బి సి 10% అవసరమే - మోది నిర్ణయం తప్పుపట్టలేంఉద్యమం ఎవరి వైపు ఉండదు, అది ఎవరి సొత్తు కాదు, ఏ ఒక్కరో హక్కు కాదు. ఉద్యమం చెయ్యటం అవసరం, ఏ విధముగా చెయ్యాలి అనే మార్గం కీలకం, ఎంచుకున్న మార్గం, వెళ్ళే మార్గం ముఖ్యం. ఎవరైతే  అణచివేయ్యపడతారో వారు రక రకాలుగా తమ గుర్తింపు, జీవన మనుగడకు  గురించి పోరాటం చేస్తారు, మార్గాలు వేరు అయ్యి ఉండవచ్చు కానీ గమ్యం ఒక్కటే.అటువంటి నిరాశ, నిస్పృహ, అణిచివేత నుంచి తనకున్న మేధ సంపద తో అంబేద్కర్ గారు పోరాడి సాధించిన ఒక చారిత్రాత్మిక విజయం నేడు చాల మంది అనుభవిస్తున్న స్వేచ్చ్ఛ వాయువులు. కానీ కొంత మంది అనుకున్నట్టు అంబేద్కర్ గారు కేవలం ఒక్క  జాతి గురించి కానీ, ఒక్క తెగ గురించి కానీ పోరాటం చెయ్యలేదు. మనుషుల లో ఉన్న అసమానత మీద అయిన ఉద్యమించారు.

నేడు కొంత మంది కులం పేరు చెప్పుకొని అయినను ఒక కుల నాయకుడుని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాస్తవం ఏమిటి అంటే అయిన జాతీయ నాయకుడు, మానవత వాది ఈ విషయం భయటకు రానివ్వకుండా కొంత మంది స్వార్ధ పరులు తమ ఉణికి ని కాపాడుకోవటానికి అయన చిత్రపటాన్ని వాడుకుంటున్న నేటి ఈ పరిస్థితులను చూసి ఆయినే కానీ బ్రతికి ఉంటె అటువంటి వారికీ ఏ విధముగా బుద్ది చెప్పెవారో.

మనుషులంత ఒక్కటే, మానవజాతి లో అసమానత ఉండకూడదు అనేది అయిన ప్రయత్నం. ఈ అసమానత పోవాలి అంటే ప్రతి ఇంట అందరు సమానమైన జ్ఞాన విజ్ఞానం కలిగి ఉండాలి, ఆర్ధిక సమానత్వం మరియు సమానత్వం  రావాలి అనే అయిన ఆలోచన యొక్క ప్రయోగాత్మక విజయమే నేటి భవిష్యత్తు తరాల ఆశజ్యోతులు.

కాలం  తో పాటు  మనుషుల ఆర్ధిక పరిస్థితులు మారుతున్నాయి, ఆర్ధిక పరిస్థితులతో  పాటు సామజిక సమానత్వం ఒక ప్రక్క నుంచి మరో ప్రక్కకి మారుతుంది. ఈ విధముగా జరిగితే దేశం లో అంతర్గత విబేధాలు మొదలు అవుతాయి (నాటి పరిస్థితులు). ఆర్ధిక సమానత్వం, విజ్ఞాన వికాసం మరియు సమానత్వం అంబేద్కర్ గారు ఘడముగా కోరుకున్న పెను మార్పు, అలాగే అయిన  కుల రహిత వ్యవస్థ కు ఎంతటి  కృషి చేసారో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే కులం పేరు అడ్డు పెట్టి కొంత మంది అత్యుత్యహులు ఇప్పుడు 10% రిజర్వేషన్ పొందిన వారిని " పాలనా కులం పేరుతో పిలవచ్చ లేదా పాలనా కులం చేరినట్టేన " అని కుల రాజకీయం చేసేవారిని ఖచ్చితంగా అంబేద్కర్ గారు స్వర్గస్తులు అయ్యి ఉండకపోతే అయిన అటువంటి వారికీ ఏ విధముగా బుద్ది చెప్పెవారో ? అనే ఆలోచనలలో ఉన్న సమాధానం ఖచ్చితంగా రోమాలు నిక్క పొడుచుకునే విధముగా  ఉంటుంది.

అసలు ఈ బి సి బిల్ ఏమి చెప్పుతుంది రాజ్యాంగాన్ని సవరణ చేస్తు ఆర్దికముగా వెనుక పడిన వారికీ చదువులోను , ఉద్యోగ నియామకాలలో 10% వెసులుబాటు కలిగిస్తుంది. దిన్ని వ్యతిరేకించేవారు ఖచ్చితంగా పెట్టుబడి దారి వ్యవస్థ ను ప్రోత్యహించేవారుగా, ఫ్యుడలిస్ట్ భావాలు ఉన్నవారిగా అభివర్ణించవచ్చు.

ఆర్దికముగా రిజేర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఆశించినవారిలో రాజ్యాంగ లబ్ది దారులు లేకపోలేదు, వారు నిజమైన అంబేద్కర్ గారి అనుచరులు, కులం పేరుతో ఆర్ధికం గా వేనుకపడినవారిని ఎద్దేవా చేసే వారు వాస్తవానికి అయిన చిత్ర పటాన్ని వాడుకొని నిర్మొహమాటముగా కుల రాజకీయం చేసేవారే. విరి కి అంబేద్కర్ గారి ఆశయాలతో పని లేదు, వారి ఆలోచనలతో సంబంధం లేదు వారు ఎదగాలి దానికి ప్రజల మద్దతు కావాలి, అ సంఘమం  లో యెంత మంది ఎన్ని కొలిపోయిన వారికీ అనవసరం! వారి ఎదుగుదల మాత్రమే వారికీ ముఖ్యం ఇందుకు వారు అడ్డు పెట్టుకునే ఒకే ఒక మాట కులం, కులాన్ని ప్రేరేపించే స్టేట్మెంట్ లు. చుసిన ప్రజలు వీరిని పిచ్చిగా నమ్మాలి, కులం కోసం పాటు పడుతున్నాడు అనే అభిప్రాయం వారికీ కలగాలి, యువకులలో క్రేజ్ రావాలి, ఫాలోయింగ్ ఉండాలి. ఇందుకు మంచి ఉదాహరణ ఒక ఎన్ అర్ ఐ ఆంధ్రప్రదేశ్ కులం విభేదాలతో  చాల మంది మీద జరిగిన దాడి గురించి సామజిక మాధ్యమం లో సదరు చైర్ పర్సన్ కి ఒక ప్రశ్న వేశారు దానికి గాను అతనికి సమాధానం దిమ్మ తిరిగేలగా వచ్చింది అది ఏమిటి అంటే " నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు, నువ్వు  చెప్పు ఏమి చెయ్యాలో " అన్నటుగా , నిజమే పదవికి ముందు కులం జోలికి వస్తే ఉరి వేస్తాను అని చెప్పేవారికి పదవి వచ్చిన తరువాత వేరొక దేశం లో ఉన్న వారు సలహా ఇస్తే కానీ నిర్ణయం తీసుకోలేని మంద బుద్ది కి వెళ్ళుతుంది అని చెప్పటానికి ఇంతకన్నా ఉదాహదరణ ఇంకొకటి ఉంటుందా ?

కొంత మంది చేసే వ్యాఖ్యలు తమకి తెలియకుండానే మోది ని ఒక వర్ణనకి దేవుడు గా కొలిచే అవకాశం కలిపిస్తున్నారు . వ్యతిరేకతను బట్టి విషయ విలువ పెరుగుతుంది ఒకరికి నచ్చదు, అ నచ్చదు అనే విషయము మరొకరికి అమితముగా నచ్చుతుంది.

ఇక్కడ కొందరు కుల రాజకీయం చెయ్యబోయి మోది నిర్ణయం ప్రజలలోకి మరింత బలముగా, అయన పైన సానుకూల స్పందన వచ్చే విధముగా ప్రేరేపిస్తున్నారు. వాస్తవానికి మోది ఒక నూతన శకానికి  నంది పలికారు. అయన నిర్ణయం తప్పు పట్టటానికి లేదు. మోది అని చెప్పటం కన్నా భారత దేశం, భారత దేశ  ప్రభుత్వం ఒక నూతన ప్రయోగం చేస్తుంది, దాని పేరు ఆర్ధిక సమానత్వం.
       

EBC ఆర్దికముగా వెనుక పడినవారు

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics