ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేటి సీత - వై యస్ కుటుంబం పరిస్థితే ఇలాగ ఉంటె ఇంకా సామాన్య మహిళా పరిస్థితి ఏమిటి ?     


ఆమె ఒక్క మాజీ స్వర్గీయ  ముఖ్య మంత్రి కూతురు, ప్రధాన ప్రతిపక్ష నేత చెల్లెలు, అన్న లేని సమయములో ప్రధాన ప్రతి పక్ష నేత హోదా తీసుకోని పార్టీ తరుపున ప్రచారం చేసిన వనిత. ఇవన్ని ప్రక్కన పెడితే ఆమె ఒక మహిళా, తెలుగింటి ఆడపడుచు.

ఎప్పటి నుంచో జరుగుతున్నా రాజకీయ పోరులో, ప్రత్యర్ధులు కావచ్చు, రాజకీయ ప్రత్యర్ధులు కావచ్చు ఆమె పైన సామజిక మాధ్యమాలు ఆయుధాలుగా మార్చుకొని పుకార్లు సృష్టించారు అనేది ఆమె నేటి మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నా సత్యం.


ఆమె పైన ఒక్క అగ్ర హీరో పైన రక రకాల ప్రచారం ఉద్రిక్తత చేసారు. సామాన్యముగా ఇటువంటి విషయాల మీద స్పందించాలి అంటే ధైర్యం చేసి ఎవరు ముందుకు రారు, ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్పా! షర్మిల ఒక ప్రధాన ప్రతి పక్ష నేత చెల్లి హోదా లో, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి (మాజీ ముఖ్య మంత్రి) కూతురు గా ఆమెకు తన కుటుంబం నుంచి వచ్చిన పూర్తీ మద్దతు తో ఆమె ఈ రోజు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇచ్చి, తను హైదరాబాద్ పోలీస్ వారికీ ఎందుకు ఫిర్యాదు చేశాను అనే వివరణ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే హాట్ టాపిక్. కానీ అదే షర్మిల  ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మధ్య తరగతి  మహిళా అయితే ఆమె పరిస్థితి ఏమిటి? నిజమే ఒక వేళా ఇటువంటి పరిస్థితి ఒక మధ్య తరగతి అమ్మాయికి ఏర్పడి ఉంటె ?     

రాజకీయం లో కొన్ని వ్రాసుకొని నియమాలు ఉంటాయి, శ్రుతి మించి వ్యక్తిగత జీవితాలలో కి వెళ్ళకూడదు. ఎందుకంటె వాటి పర్యవసానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు షర్మిల ప్రజల ముందుకు వచ్చి చెప్పిన విషయం రాజకీయముగా ప్రత్యర్ది కి ఎంతో ముప్పు. రాష్ట్ర దర్యాప్తు సంస్థ మరియు మహిళా భద్రత మీద ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి.

మరి ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతి పక్ష నేత కుటుంబం నుంచి ఒక మహిళా తన పైన దుషప్రచారం చేస్తున్నారు అనే ఆవేదన తో మీడియా ముందుకు రావటం అనేది అంత తేలికగా తీసి పడేసే విషయం కాదు. అది ఆంధ్ర రాష్ట్రం లో మహిళా గౌరవం పైన దేశం చర్చించే దిశ గా దారి తీసే వైనం. ఆమె పరిస్థితే అలాగా ఉంటె ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి.

తెలుగింటి ఆడపడుచు అని సంబోదించి రాజకీయంగా దిశ నిర్దేశం చేసిన అన్నగారు ఏలిన ఈ నెల పైన అయన స్థాపించిన పార్టీ మీద నింద పడినప్పుడు అ నింద నిజాము కాదు అని నిరుపించుకోవలసిన అవసరం వారికీ  ఉంది. యాసిడ్ దాడి లో గాయపడిన వారికీ   " తక్షణ న్యాయం " చేసిన వై యస్ కుమార్తె కు ఇటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం. కానీ మీడియా ముందుకు వచ్చి అ విషయాన్ని ఖండించటం ప్రశంసనీయం, సున్నితమైన విషయం కానీ తేలికైన  విషయము కాదు అది ఆమె ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము డేరింగ్ అండ్ డాషింగ్ లో వై ఎస్ ని గుర్తు చేసిన ఆమె ను అభినందిన్చావలిసిందే .

   
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image