Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Wednesday, 16 January 2019

టి అర్ ఎస్ తో కలయక ఎవరికి చేటు ?     
తెలంగాణా ఎన్నికల లో అడుగు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు మీద భావోద్వేగాలతో రగిలిపోయిన టి అర్ ఎస్ అధినేత చంద్రశేఖర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి అర్ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము ఆంధ్ర ఎన్నికల లో అడుగు పెడతాము అని చెప్పారు. కొన్ని రోజులకే ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత తో మంతనాలు జరిపిన అ విషయము భయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ లోపల ప్రధాన ప్రతిపక్ష నేత తన పాద యాత్ర ముగించుకోనియున్నారు. అయితే ఆంధ్ర కుక్కలు అని సంబోదించిన కే సి అర్ తనయుడు  టి అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే టి అర్ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ని కలవటం జరిగింది.  ఇప్పుడు ఇప్పుడే మంచి పేరు, ప్రజల లో నమ్మకం పొందుతున్న ప్రధాన ప్రతి పక్షం ఈ రకమైన వ్యూహ రచన చెయ్యటం లో అంతరార్దం ఎవరికి అర్ధం కావటం లేదు.


ఆంధ్ర వారు అంటే వారికీ గిట్టదు, ఆంధ్ర వారు వారి దృష్టి లో కుక్క తో సమానము కే సి అర్ చేసిన  వ్యాఖ్యలు విన్న ఎవరికైన ఈ విషయం అర్ధమవుతుంది. ఆంధ్ర లో తెలంగాణా నేతలను అంగీకరించే అది కే సి అర్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్న ఏ ఒక్కరు అంగీకరించే పరిస్థితి లో లేరు.

ఒక వేళా తెలంగాణా ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంటుంది అనే కోణం లో ఆలోచిస్తే గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే తెలంగాణా లో సెంటిమెంట్ ప్రకారం చుసిన 10 సంవత్యరాలు ఒకటే పార్టీ నిలపడింది, అక్కడ రూలింగ్ పార్టీ నే పగ్గాలు చేపట్టింది. లేదు స్ట్రాటజీ ప్రకారం చూస్తాము అనుకున్న ఇప్పుడు ఇప్పుడే సానుకూల భావన వస్తున్న తరుణం లో ఆంధ్ర వారిని తన నోటికి వచ్చినట్టు తిట్టి వారి ప్రమేయం లేకుండా ఏకంగా ఆంధ్ర ప్రజలు అందరిని, ఆంధ్ర వంటకాలను ఎద్దేవా చేసిన నాయకుల తో నేటి ఈ  భేటి శ్రుతి మించిన ఆత్మ విశ్వాసం క్రింద నే చెప్పవచ్చు.

నిజమే సోషల్ మీడియా లో ప్రధానప్రతి పక్ష పార్టీ వారు యాక్టివ్ గా ఉన్నారు వారు సమర్దించిన ఎవరు సమర్దించిన ఏమని సమర్దించాలి, ఒక వేళా సమర్దించిన పార్టీ వారు తప్ప వీక్షకులు అభిప్రాయం ఏ విధముగా ఉంటుంది ?  ఇక్కడ సత్యం ఏమిటి అంటే ప్రధాన ప్రతి పక్ష పార్టీ సభ్యులు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారు, వారు ఈ భేటి ని ఉద్దేశించి ఎన్ని విధాలుగా నైన సమర్దించవచ్చు కానీ విక్షకుడి మనోభావములో ఆంధ్రవారిని తక్కువ చేసి మాట్లాడని  వారి తో సత్య సంబంధాల ప్రభావం పోస్ట్ చేసే వారి మీద అభిప్రాయం ఏర్పడే సూచనలు కూడా లేక పోలేదు.

స్నేహం చేసే సమయములో స్నేహం చెయ్యాలి. ఆంధ్ర లో ఈ సారి ఎన్నికలు దెబ్బ దెబ్బ గా ఉంటాయి ఎవరు వస్తారో చెప్పలేము అనే అభిప్రాయము ప్రజలలో ఉన్నది, ఒక్క దెబ్బతో అంత తారు మరు చెయ్యటం అంటే ఇదేనేమో. కే సి అర్ ప్రధాన ప్రతి పక్షానికి సపోర్ట్ చెయ్యటం ఎవ్వరు తప్పు పట్టారు కానీ రాజకీయం లో ప్రతి పక్షానికి ఉన్న డిఫెన్సు మరియు ఆఫెన్స్ బెనిఫిట్స్ పాలక పక్షానికి ఉండవు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కొట్టింది, ఈ ఒక్క సంఘటన పాలక పక్షం  తనకి తెలియకుండానే ప్రధాన ప్రతి పక్షం చేతి కి అప్పచెప్పింది.

ప్రజల మనో భావాలకు సంభందించిన విషయం లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి, జగన్ మోహన్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్ గా స్ట్రైక్ అయ్యే అభిప్రయం ప్రజలలో ఉండేది, కానీ .....? ఒక్కసారి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గస్తులు అవ్వక మునుపు  ఆంధ్ర వారిని ఎద్దేవా చేసిన కే సి అర్ ని తన కంచు కంఠం తో ఎలాగా  వణికించారో చూస్తే ఇప్పుడు ప్రధాన ప్రతి పక్ష నేత నుంచి ఎవరు అయిన ఏమి ఆశిస్తారు ? ఇక్కడ అ మార్క్ మిస్ అవుతుంది అని అభిప్రయపడే వారు లేకపోలేదు.

ఏ సమయము లో ఎలాగా ఉండాలి, ఏ సమయము లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణం, ఏ బాణం ఎప్పుడు వాడలో తెలిసిన అర్జునుడు యుద్ధం గెలిచాడు, ఎవరిని ఏ సహాయం అడగాలో తెలిసిన ధర్మరాజు రాజ్యం గెలుచుకున్నాడు, ఏ సమయము లో ఏ సహయం చెయ్యాలో తెలిసిన కృష్ణుడు దేవుడు అయ్యాడు ఏ సహాయం ఎక్కడ చెయ్యాలో తెలియని కర్ణుడు నెలకి ఒరిగాడు,  ఎవరిని ఏ సహాయం ఏ సమయము లో అడగాలో తెలియక, సమయ పటిమ తెలియక, కుటిల రధశారధి సహాయం కోరి   కర్ణుడి మరణం మరువ కూడదు . ఈ అవసరం లేని సహాయం ఎక్కడి కి దారి తీస్తుంది అనేది కాలం చెప్పవలిసిన సమాధానం. 

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image