Skip to main content

ఈ విధముగా ఉంటె ఎవరికైన ప్రాణ ఘండమే !     
 ప్రమాదం ఎప్పుడు ఎక్కడనుంచి వస్తుందో ఎవరికి తెలియదు,  కానీ రోడ్ ప్రమాదం మాత్రం మనుషులం మన అంతట మనమే కొని తెచ్చుకుంటున్నాం, మరోసారి మనంతట మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఒక్కసారి గతం తవ్వి చూద్దాం రండి. భారతదేశం లో  2002 లో రోడ్ ప్రమాదాలలో 84674 చనిపోయారు , 2011 లో  142485 మంది చనిపోయారు.  2016  నాటికీ  1,50,785 మంది రోడ్ ప్రమాదములో చనిపోయారు.

2017-2018 లో యెంత మంది చనిపోయారో  ఇంకా తెలియలిసి ఉంది. 

కానీ ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవలిసిన విషయం ఏమిటి అంటే రోడ్ ప్రమాదాల సంఖ్య తగ్గటం వలన ఎటువంటి  ఉపయోగం లేదు, ఎందుకంటె ఒక్క ప్రమాదం జరిగిన ఒక్క ప్రాణం పోయిన తిరిగి తేవటానికి ప్రాణం వస్తువు కాదు.

జాగ్రత్త గా నడిపితే !

రోడ్ ప్రమాదం అంటే ఒకరు నెమ్మిదిగా వాహనం నడిపి ,  మరొకరు వేగంగా  వాహనం  నడపటం వలన జరిగేది కాదు. వాహనన్ని అదుపు చెయ్యలేకపోవటం వలన జరిగే ఘటన అని మనం మరువ కూడదు.  మనకి బండి నడపటం వస్తే సరిపోదు ఎదుటవాడు కూడా బండి సక్రమముగా నడపగాలగాలి.

డ్రైవింగ్ లో  మానసిక స్థితి :

ప్రభుత్వానికి  మనుషుల ప్రాణాలు ముఖ్యమా ? లేదా వాణిజ్యం ముఖ్యమా ? ఆలోచించవలిసిన ప్రశ్న. 

* ఇంజన్ హై పవర్ ఇచ్చి స్పీడ్ లిమిట్ పెడితే మానసిక భావ చలనం ఉన్న మానవుడు తన మనసు మాట వినకుండా ఉండడు.  అంటే తనకి కావలిసింది, తను చెయ్యాలి అనుకున్నది తన చేతిలో ఉంటె ఖచ్చితంగా చేసి తిరతాడు. నిజంగా ఇప్పుడు ఉన్న విజ్ఞాన పరిజ్ఞానికి స్పీడ్ లిమిట్ సిస్టం ని టెంపర్ చెయ్యటం పెద్ద విషయం కాదు. 

* శిక్ష విధిస్తే శిక్షించపడినవడిలో పరివర్తన వస్తుంది కానీ, కొత్త వారి పరిస్థితి ఏమిటి ?

* జరిమానా విధించి, శిక్ష విధించి భయపెట్టి మనిషి లో మార్పు తీసుకోని రావటం చాల కష్టం 

* భారత దేశం లో రోడ్లు యెంత అస్తవ్యస్తముగా ఉంటాయో, టెక్నికల్ గా మలుపులలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, హై వే మీద కానీ, అర్ ఎన్ బి  రోడ్ల మీద కానీ, పంచయతి రోడ్ల్ మీద కానీ ఎన్ని గోతులు ఉంటాయో, అసలు ఒక ఉరిలో ఎన్ని స్పీడ్ బ్రేక్ ర్ లు ఉంటాయో అందరికి తెలిసిన రహస్యమే. ఇన్ని అస్తవ్యస్త పరిస్థితులలో మనకి హై పవర్ ఇంజిన్ లు ఉన్న వ్యవస్థ అవసరమా ? 

** దీనికి ఒకటే మార్గం కేవలం ఆరోగ్యం, అత్యవసర సంస్థలకే హై పవర్ ఇంజన్ లు, అతి వేగముగా నడపగలిగే వాహనాలు అనుమతించాలి.  వస్తు రవాణా కి రైలు రవాణా  మాత్రమే  ఉపయోగించాలి. 50 సిసి కి మించిన మోటార్ సైకిల్ లు తయారీ, అమ్మకాలు నిషిద్దం చెయ్యాలి. ద్విచక్ర వాహనాల కి 40 కి మించి వేగంగా నడపడానికి విలు లేకుండా తయారు చెయ్యాలి.  వాణిజ్య రవాణా సామర్ధ్యం ఉన్న వాహనాలు యొక్క వేగ పరిమితి తగ్గించలి. వాణిజ్య రవాణా రైల్వే వ్యవస్థ ప్రతి పల్లెకు వ్యాప్తి చెందేలగా కొత్త అమొదలు, పద్దతులు మొదలు పెట్టాలి. కారులు కూడా సాధ్యమైనంత వరుకు తక్కువ వేగం తో నడిచే విధముగా రూపొందించాలి. 

     
    
అభివృద్ధి అంటే పాలు పోసిన పాము కాకూడదు. వేగాన్ని నియంత్రించలేని మనషికి వేగవంతమైన వస్తువులు అనవసరమా?. ఇక్కడ మనుషులను వద్దు అన్న  పని చెయ్యకుండా నియంత్రించటం   కష్టం, అసాధ్యం కూడా కానీ మనసు , మేదస్సు తో ఆలోచిస్తే వస్తువును నియంత్రించటం అనేది ఆచరణ  సాధ్యం.  వాహనం వస్తువు అది పాడు అయిపోతే మళ్ళి బాగు చేసుకోవచ్చు, కానీ మనిషి ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళి దాన్ని తయారు చెయ్యాలి అంటే సాధ్యము కానీ విషయం.   పశ్చిమ గోదావరి జిల్లా నడిపల్లి లో జరిగిన వాహన ప్రమాదం లో మృతి చెందిన 3 ఏళ్ళ  చిన్నరి
డిస్మిత మరణం లాంటి విషాదం ఇంకెక్కడా జరగకూడదు అని కోరుకుంటున్నాము, ఎంతో భవిష్యత్తు  చూడవలిసిన చిన్నారి, ఎన్నో చిట్టి చిట్టి  పలుకులు  పలకవలిసిన గొంతు మొగపోయ్యింది. ఎవరి నిర్లక్ష్యం అనేది అక్కడ ఉన్న వారికే తెలియాలి, కానీ  రవాణా పేరుతో నియంత్రించలేని రెండు వాహనాలు చేసిన మారణకాండ అనే చెప్పాలి. ధాన్యం రవాణా చేస్తున్న ఒక లారి, కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్న ఒక ద్విచక్ర వాహనాము చేసిన భారి విధ్వంసానికి బలి అయిన చిన్నారి , ఆమె ఉసురు తీసిన అభివృద్ధి వ్యవస్థ పైన, వాణిజ్య వ్యవస్థ పైన నియంత్రణ ఖచ్చితంగా అవసరమే. 

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics