ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మహా కూటమి మాయం! నిజంగా అ ఉపు ఉండేదా ?





     



మహా కూటమి అలియాస్ ప్రజా కూటమి  టి అర్ ఎస్ ఉపు ని తట్టుకోలేక పొయ్యింది. నిజంగా మహా కూటమి కి  మీడియా ఇచ్చిన హైప్ ఉన్నదా ? వాస్తవం చెప్పాలి అంటే లేదు అనే చెప్పాలి. మరి ఎక్కడ నుంచి వచ్చింది అంత హైప్ అంటే కేవలం కే సి అర్ అప్పటిలో మీడియా మీద విధించిన ఆంక్షలు అనే చెప్పాలి.

నలుగు అయిదు వారలు కంటి మీద కునకు లేకుండా, జరిగేది నిజమేనా, అనే విధముగా ఒక మానసిక వ్యధను గెలిచిన వారికీ మిగిల్చిన చేదు నిజం. పధకాలు ప్రజలు వరుకు చేరుతున్నాయి, రైతు కి  ఎక్కడ అన్యాయం జరగనివ్వలేదు, రైతు సంక్షేమ పధకాలు  ఎన్నో, ప్రజా సంక్షేమ పధకాలు ఎన్నో , ప్రజా సమస్యల పైన వెంటనే స్పందన , తెలంగాణ అభిమానం వీటన్నిటి మీద  తప్ప, ఏదో ఒక అంశం మీద అయితే టి అర్ ఎస్ విజయం సొంతం చేసుకోలేదు.


టి. అర్ . ఎస్  కొన్ని నియోజకవర్గాలలో ఓటమి చవి చూడవలిసిన అవసరం వచ్చింది అందుకుగాను బలమైన కారణాలు లేకపోలేదు. ఉదాహరణకు సతుపల్లి నియోజకవర్గం ఇక్కడ పార్టీ ని బలోపేతం చేద్దాము అనుకున్న అధిష్టానం యొక్క ఆలోచన అందరికి తెలిసిందే. కానీ స్థానికముగా ఒక నాయకుడు కమిషన్ వ్యవస్థను ప్రోత్యహించడం తో ఇక్కడ కధ అడ్డం తిరిగింది.

రైతు పధకాలు మాత్రం ప్రజలలోకి బాగా వెళ్ళాయి, ఇంకా చెప్పాలి అంటే అది పెద్ద సక్సెస్ అని చెప్పాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందలే చెప్పారు అప్పటి వరుకు ప్రచారం బాగానే నడిచింది కానీ చివరి రోజులలో మాత్రం చంద్రబాబు నాయడు   కొంచెం మాటలు ఎక్కువ పేల్చరు అది అంత శుభా సంకేతం కాదు అని చెప్పి. అయన అందుకు వివరణ కూడా ఇచ్చారు ప్రజలు అంత గమనిస్తారు అహంకార పూరిత మాటలు మాట్లాడినప్పుడు వారిలో స్థానికత్వం అనేది మేలుకుంటుంది అని.

ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ వారు  వారి ధోరణి మర్చుకోవలిసిందే ఎవరో ఒకరితో జత కట్టడం కన్నా వారు స్వయం గా బరి లో కి దిగితే ఓటరు మనసులో ప్రత్యేక స్థానం పొందుపరుచుకోగలరు. గెలుపో ఓటమో ముందల వారికంటు ప్రత్యేక గుర్తింపు వస్తుంది లేదంటే ఫలితాలు ఇలాగె ఉంటాయి. ఉనికిని కూడా కొలిపోయే పరిస్థితి భవిష్యత్తు లో ఏర్పడిన ఆశ్చర్య పడనవసరంలేదు. ఓటమి అయిన గెలుపు అయిన ఒంటరి పోరాటం లో గౌరవం, గుర్తింపు రెండు లభిస్తాయి.

కోడంగల్ లో విజయనకి కేవలం రేవంత్ రెడ్డి కే సి అర్ కి విసిరినా అ ఒక్క సవాలు కారణం  అనే చెప్పాలి, అహంకార పూరిత సవాలు. ప్రత్యర్ది మనకంటే బలమైన వాడు అయనప్పుడు గెలుపు ని దృష్టి లో పెట్టుకొని వ్య్వహరించాకుడదు, గెలిచినా తరువత మాట్లాడాల్సిన మాటలు గెలవక ముందలే మాట్లాడితే ప్రత్యర్ది తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తే ఇటువంటి పరిణామాలే ఎదురుకోవలిసి వస్తుంది. నోరు అదుపు లో పెట్టుకోవాలి అంతే, రాజకీయ  వక్త తను మాట్లాడే మాటల యొక్క ప్రభావం ఫలితం మీద పడకుండా చూసుకోవాలి. ప్రజాస్వామ్యం లో ఎలాగా గెలిచారు అనేది ప్రజలకు అనవసరం, ఎలాగా గెలిచారు అనే విషయం ఎక్కువ విశ్లేషించారు కూడా, గెలవటం ముఖ్యం.

ఇకనైన తెలుగు దేశం అధినేత తన తనయుడుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ లకు దూరముగా పెట్టి తెలంగాణా పగ్గాలు అప్పచేప్పితే , అక్కడ పట్టు సాధించవచ్చు.  ఎందుకంటె ఇప్పుడు తెలంగాణా లో తెలుగు దేశం కేడర్ బల పరచవలిసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ తో పొత్తు తో సేటేలేర్స్  టి అర్ ఎస్ వైపు మొగ్గు చూపారు అని చెప్పటానికి ఏ విధముగా సంకోచిన్చంవసరం లేదు.

నిజంగా చెప్పాలి అంటే మహా కూటమి అలియాస్ ప్రజా కూటమి కి అంత హైప్ ఇచ్చింది కేవలం మీడియా నే అని చెప్పాలి.




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement