ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఓటుకి కోటి - న్యాయవాదుల ఎన్నికల లో రకరకాల వార్తలు



     


వ్యవస్థ దిగజారుతుంది, పట్టభద్రుల పరువు నడి రోడ్ లో కి వస్తుంది. చదువు రాని వాడు ఓటు అమ్ముకున్నాడు అంటే అర్ధం ఉంది, చదువుకొని డిగ్రి ని మేడలో తగిలించుకొని మరి ఓట్లు అమ్ముకుంటున్నారు అనే అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్యరాలకి ఒక్కసారి జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల లో సభ్యులు గా  ఎన్నికైన వారు చైర్మన్ ని మరియు ఇతర కార్యవర్గాన్ని  ఎన్నుకోవాలి. ఇందుకు గాను ఎన్నికైన కొంత మంది ఒక్కో ఒక్కో  ఓటు కి కోటి రూపాయలు ఇస్తాము తమని చైర్మన్ గా ఎన్నుకోవాలి అని చెప్పి ఓటులు కొనటానికి సిద్దం అయ్యారు అనే కధనం సి వి అర్ మరియు ఇతర పత్రికలలో  లో వచ్చినప్పటి నుంచి, ఇటు న్యాయవాదులలో అటు ప్రజలలో న్యాయ వ్యవస్థ పైన భిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి, ఈ విధముగా ఒక్క సి వి అర్ ఛానల్  లోనే కాదు సోషల్ మీడియా  లో కూడా ప్రచురితం  జరుగుతుంది.




ఒక వేళా నిజంగానే ఓటు కి  కోటి రూపాయలు ఎరగా వేస్తే 24 మంది ని కొనటానికి అయ్యే ఖర్చు 24 కోట్లు, అసలు 24 కోట్లు ఖర్చు పెట్టివారి వారి వద్ద ఎంత డబ్బు ఉండి ఉండాలి, అలాగే ఉండి ఉంటె ఖచ్చితంగా ఐ టి దాడులు అ కోటి ఏరా వేసిన వారి ఇంటి మీద  చేస్తే ఎంత నల్ల డబ్బు వెలికి తియ్యవచ్చో ?

మరో విధముగా ఆలోచిస్తే ఎన్ని కోట్లు అ బార్ కౌన్సిల్ ఆదాయానికి ఘండి కొట్టగలిగితే,  కోటి రూపాయలు ఒక్కో ఒక్క ఓటు కి ఆఫర్ చేసి ఉంటారో అనే అనుమానాలు లేకపోలేదు. కోటి రూపాయలకి ఒక్కో ఒక్క ఓటు కొన్నుకోవాలి అంటే 5 సంవత్యరాలలో ఎన్ని కేసు లు తారుమారు చెయ్యగలరో ? ఎన్ని నిధులు ప్రక్క దారి పడతావో ? చైర్ పర్సన్ హోదా లో ఉండి యెంత మంది అధికారులను తమ దారికి తెచ్చుకోవచ్చో ?  న్యాయ వ్యవస్థ లో కీలక వ్యవస్థ పైన విరి ప్రభావం ఎలాగా ఉంటుందో అని రక రకాల చర్చలు సామజిక మధ్యమలలో తీవ్రంగా  జరుగుతున్నాయి. 







 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement