ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కోడి పందేలు వెయ్యాలి అనుకుంటున్నారా ....?




     

పరిస్థితులు మరిపోయవి, సంక్రాంతి కోడి పందేలు ఇదివరుకు జరిగినంత స్వేచ్చ గా ఇప్పుడు జరగటం లేదు. రాష్ట్ర  ఉన్నత న్యాయస్థానం  ఈ విషయం పైన చాల సీరియస్ గా ఉన్నది. కోడి పందేలు వెయ్యకూడదు అని చెప్పిన రాజకీయ పలుకుపడి ఉపయోగించి ఏదో ఒక రకముగా పందేలు నిర్వహించి, తోట లో బిరు లు గియ్యించి బరి లోకి దిగుతున్న పందేగళ్ళు  జరా భద్రం గా ఉండవలిసిన రోజులు వచ్చేసాయి.


ఇప్పుడు పందేలు నిర్వహించారు అని తెలిస్తే మరి ముఖ్యముగా అ మూడు రోజులు, పోలీస్ బాసు ల కు లేని పోనీ తల నెప్పి అనే చెప్పాలి. కోడి పందేళ్ళు నిర్వహించానిస్తే  న్యాయస్థానం సీరియస్ నిర్వహించానివ్వకపోతే  రాజకీయ నాయకులు సీరియస్, ముందు నుయ్య వెనుక గొయ్య .

అసలు ఏమి జరుగుతుంది : కోడి పందేలు విషయం లో ఉన్నత న్యాయ స్థానం పందేళ్ళు నిర్వహించటం చట్ట  విరుద్దం , జివ హింస అని  మునపటి సంవత్యరం నుంచి ఈ విషయాన్ని కోర్ట్ ధిక్కరం గా పరిగణించి, కోడి పందేళ్ళు పైన చర్య తీసుకోని పోలీస్ వారి పైన తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి నోటీసులు జారి  చెయ్యటం జరిగింది.

మునుపటి సంవత్యరం  కోడి పందేళ్ళు నిర్వహించిన వారు  కాకుండ పందెల్లో పాలుగున్నవారు , చూడటానికి వచ్చిన వారు    పోలీస్ వారికీ దొరికిపోవటం జరిగింది. అయితే పూర్వం ఇటువంటి కేసులను తీవ్రంగా పరిగణించని న్యాయస్థానం మానవత దృక్పధం తో జరిమానా విధించి వదిలేసేవారు, కానీ రాను రాను కోడి పందేళ్ళు వలన కుటుంబాలు రోడ్డున  పడటం, వ్యసనపరులుగా మారటం, ఉన్నత న్యాయస్థానం ఎన్నిసారులు హెచ్చరించిన వ్యవస్థ లో మార్పు రాకపోవడంతో జరిమానా ప్రక్కన పెట్టి జైలు శిక్ష విధించే పరిస్థితులు ఎర్పడయ్యి, జరిమానా కాకుండా ఇప్పుడు జైలు శిక్షలు విధిస్తున్నారు  అనే విషయం చెప్పటానికి ఏ మాత్రం సంకోచిన్చానవ్సరం లేదు. 


ఈ రోజున పాస్ పోర్ట్ కి, ప్రభుత్వ ఉద్యోగాలకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదో ఒకరకుముగా మేనేజ్ చెయ్యవచ్చు కానీ రేపు అన్న రోజున ఎలాగా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు, ఒకరు చేసే చిన్న తప్పు తమ కుటుంబానికి, వారసుల భవిష్యత్తు కి భవిష్యత్తులో ఎన్నో చేదు అనుభవాలు మిగల్చవచ్చు. కేసు లో శిక్ష పడిన కారణముగా మీకు పాస్ పోర్ట్ రాకపోవచ్చు, వారి పిల్లలా ఉద్యోగాలకి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది అని  చెప్పి చిన్న చిన్న కారణాల వలన వచ్చిన ఉద్యోగం పోవచ్చు, రాని ఉద్యోగం రాకపోవచ్చు.

ఒక విషయం మాత్రం భాదాకరం అసలు పందెం నిర్వహించే వారు మాత్రం బహు విచిత్రముగా ఎటువంటి కేసుల లో విచారణ ఎదురుకోవటం లేదు, అ పుట బిర్యానీకి, మందుకి , రూ. 500/- కి నేరాలు తమ నెత్తి మీద రుద్దు కుంటున్న వారు మాత్రం తమకి తెలియకుండానే వుసలు లెక్క పెడుతున్నారు అనే గుస గుసలు లేకపోలేదు.

ఏది ఏమైనా సామాన్యులు ఈ సంక్రాంతి కి కోడి పందేలకు దూరముగా ఉండటమే మంచిది. ఎన్నికలు  దగ్గెర లో ఉన్నాయి, ఇప్పుడు పవర్ లో  ఉన్న రాజకీయ నాయకుడు కన్నా,  పవర్ ఉన్న పోలీసోడి కే పవర్ ఎక్కువ,అ సమయములో వారు ఎవరి మాట పడితే వారి మాట వినరు . 


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement