


ఒక 50 సంవత్యరాలు వెన్నకి తీసుకోని వెళ్లి కధ ని అక్కడ నుంచి మొదలపెడతారు. ప్రభుత్వం చేత నిషేధించపడిన ఒక చరిత్ర ను ఒక సీనియర్ పాత్రికేయుడు వ్రాస్తాడు. చరిత్ర లో మిగిలిన ఒకే ఒక పుస్తకం ఒక వార్త సంస్థకి సంపాదిస్తుంది. అ పుస్తకం లోని వాస్తవాలు వెలికి తియ్యటానికి అ సంస్థ అ సీనియర్ పాత్రికేయుడిని పిలిపిస్తుంది అతను చెప్పిన విషయాలే కే జి ఎఫ్. 15 ఏళ్ళకే పెళ్లి అయ్యి అతి చిన్న వయస్సులోనే గర్భం దాల్చిన ఒక వనిత ప్రాణం పోసిన పిండం రాకీ . జబ్బు పడిన తన తల్లి కి వైద్యం చెయ్యించలేని పసివాడికి తన తల్లి చివరిగా చెప్పిన మాటలు ఒక శాసనం గా బలముగా నాటుకొని పోతుంది. ఆమె బతికి నా చచ్చిన రాజు లాగా , ధనవంతుడిగా చవమని చెప్పుతుంది.

ఆమె తదనంతరం అతను ముంబాయి కి చేరుకొని తనకంటు ఒక స్థాన్నని ఏర్పరచుకుంటాడు. అతని ఖ్యాతి విన్న బడా డాన్ ఒక పని చేస్తే అతనికి ముంబాయి సొంతం చేస్తాను అని చెప్పి మాట ఇస్తారు. అక్కడ మొదలు అయిన అ ప్రయాణం కే జి ఎఫ్ అనే ప్రదేశం వరుకు చేరుతుంది.

నచ్చినవి : స్క్రీన్ ప్లే, స్టొరీ, యాక్షన్, డైలాగులు, సెంటిమెంట్, హీరో పాత్రా చిత్రీకరణ
నచ్చనవి : పాటలు, ఓవర్ బిండప్
మొత్తానికి కే జి ఎఫ్ కి క్విక్ ఆంధ్ర రేటింగ్ : 3.5/5
Post by