కడపలో పార్టీ లు మారటానికి 20 కుటుంబాలు సిద్దముగా ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ నుంచి వై ఎస్ అర్ కాంగ్రెస్ లోకి చేరటానికి సిద్దపడిని 20 కుటుంబాలు, చేరిక సమయం లో 144 సెక్షన్ విధింపు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం, తోచిలుక రాయుడు పాలెం నుంచి అదే విధముగా టి డి పి నుంచి వై ఎస్ అర్ కాంగ్రెస్ పార్టీ లోకి సుమారు 70 మంది వలస వెళ్ళారు. చాల మంది పార్టీలు మారతారు కానీ కొన్ని చోట్ల మాత్రం పార్టీ లు మారటం అంటే అక్కడ పార్టీ భాలహిన పడుతుంది అని అర్ధం. అసలు ఇటువంటి పరిణామాలు ఎందుకు వస్తాయి.
పార్టీ అధినేత దగ్గెర నుంచి పార్టీ సభ్యులు వరుకు "నేను" అనే పదాన్ని గట్టిగ వాడటం వలన. నిజమే నమ్మటం లేదా ! ఒక ఏ మే ల్యే అభ్యర్ది తను గెలిచే వరుకు తన సామజిక కార్యకర్తలను లేదా ఓటరులను అన్న ఇసారి గెలిపించండి అన్న అని అడగటం, గెలిచినా తరువాత నమస్కారం అండి అని కొత్తవారిని పలకరించినట్టు పలకరించటం తో అసలు విషయం తెలుసుకున్న ఓటరు కానీ కార్యకర్త కానీ భయటకు చెప్పకపోయినా అభ్యర్ది పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సరే ఎవరిని చూసి ఓటు వేస్తారు పార్టీ ని చూసి ఓటు వేస్తారు. ఒక ఓటరు ఒక ఓటు బుత్ కి వచ్చి ఒక పార్టీ అభ్యర్ది కి తన ఓటు వేసాడు అంటే అది అ పార్టీ లో ఉండి పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషి. ఇక్కడ మన రాష్ట్రం లో దౌర్భాగ్యం ఏమిటి అంటే కొంతమంది రాజకీయ పార్టీ అధినేతలు కూడా "నేను " అనే పదం నోటికి అడ్డు అదుపు లేకుండా వాడటం. వీరిని చూసి ఏ మేల్యే కానీ ఏం పి కానీ , పార్టీ సామాన్య కార్యకర్త కానీ వారు ఉండే ప్రదేశానికి వారె రాజులూ గా, వారి ని చూసి పార్టీ కానీ, పార్టీ ని చూసి వారు కాదు అన్నటుగా వ్యవహరిస్తున్న అహంకార శైలి కి పరాకాష్ట ఈ వలసలు అని చెప్పాలి.
పద్దతి మార్చుకోవాలి " నేను " అనే పదం మనిషి లో ఉన్న అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. సమిష్టి కృషి చేసినవారి మనోభావాలు దెబ్బతింటాయి. ముఖ్యముగా పార్టీ అధినేతే అనే వారు తన కార్యకర్తలకి రోల్ మోడల్స్ , విరు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని వారిని అభిమానించే వారికీ స్పూర్తి. అటువంటప్పుడు ప్రతి మీటింగ్ లో " నేను " అనే పదం వాడినప్పుడు అ పదం అ చుట్టూ ప్రక్కన ఉన్నవారి మీద వై ఫై లాగా పనిచేస్తుంది.
అ సమయములో మనిషి లో అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం తో చేసే పనులు వలన అక్కడ స్థానిక పార్టీ కార్యకర్తలు, పార్టీ ని అభిమానించే వారు , పార్టీ కి మద్దతు ఇచ్చేవారి సంఖ్యా గణనియముగా తగ్గిపోతుంది. తెలంగాణా లో దొరగారు ముందస్తు ఎన్నికలు తీసుకోని వచ్చారు కాబట్టి అప్పటి వరుకు ప్రజలలో లేని వ్యతిరేకత అప్పుడే భయట పడింది, కానీ ఆంధ్ర లో ఎన్నికల గురించి ఎటువంటి ప్రకటన చెయ్యకుండానే ఉన్న వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఎగిసి పడుతుంది, ఇంకా ఎన్నికల సమయములో ?
ఒక నియోజకవర్గం లో ఒక అభ్యర్ది గెలవటం అంటే అది అభ్యర్ది గొప్పతనం ఏ మాత్రం కాదు, అ అభ్యర్ది గెలవటానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త ది , పార్టీ ని అభిమానించి ఓటు వేసిన ప్రతి ఒక్కరిది, పార్టీ కి మద్దతు పలికిన సానుభూతిదారులందరిది. అంతేకాని గెలిచాము కదా అంట నా గొప్పతనమే నేనే గెలిచాను అని రోమ్ములిరగాతిసి ఇష్టంవచ్చినట్టు రంకెలు వేస్తే అ కొమ్ములు విరవటానికి బాధితుడి కి ఒకే ఒక ఆయుధం పరి వలుస.
"నేను" అనే ఆహంకరినికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలి అంటే "నా చెప్పు " నుంచో పెట్టిన ఈ నియోజకవర్గం గెలుస్తుంది అని ఒక పెద్దయిన ఏ నియోజకవర్గం లో చెప్పారో అదే నియోజకవర్గం లో ఓటమి కి గురి కావటం, అలాగే ప్రస్తుతం మోది, షా ల యొక్క వ్యవహార శైలి తో వారు ఎదురుకుంటున్న ఇబ్బందులే ఈ "నేను" అనే దానికి మంచి ఉదాహరణ.
Post by