Skip to main content

మిర్జాపూర్ కథ
       మిర్జాపూర్ అనే ప్రదేశం లో గన్ కల్చర్ ఎక్కువుగా ఉంటుంది.  త్రిపాటి కుటుంబం అ ప్రాంతాన్ని నియంత్రిస్తుంది. అఖండ త్రిపాటి అక్కడ ఉన్న పోలీస్ వారిని లోబరుచుకొని తన ఆయుధాల వ్యాపారము, మరియు మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. మున్న అనేవాడు త్రిపాటి కొడుకు, వాడికి మిర్జాపూర్ ని  తన అధినంలో తీసుకోవాలి అనేది కోరిక, తండ్రి అదుపు అజ్ఞాలలో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేకుండా మానసిక వ్యధకి కి గురి అయ్యిన ఒక విచిత్రమైన మానసిక ఉన్మాది గా అతని క్యారెక్టర్ ని చిత్రీకరించారు. ఇతను సరదాగా ఒక పెళ్లి డాన్స్ లో డాన్స్ చెయ్యటానికి వెళ్లి ఆకతాయి తనముగా తుపాకి ని గాలి లోకి కాల్చటం తో అ పెళ్లి కొడుకు చనిపోతడు. రమాకాంత్ పండిట్ ఒక న్యాయవాది, అతను ఎటువంటి వాడు అంటే అతనికి అన్యాయం జరిగింది అనిపిస్తే ఎదుటవారు ఎవరు అయిన అ కేసు తన భుజాలు మీద వేసుకొని వాదిస్తాడు. మున్న చేతిలో చనిపోయిన పెళ్లి కొడుకు యొక్క తండ్రి, మామ ఇద్దరు రామ కాంత్ పండిట్ వద్దకు న్యాయ పోరాటం కోసం ఆశ్రయిస్తారు, రమాకాంత్ పండిత్ కేసు ఒప్పుకోవటం తో సినిమా లో కీలక ఘట్టం మొదలవుతుంది.


         గుడ్డు మరియు బబ్లు ఇద్దరు రమాకాంత్ బిడ్డలు, విరు చదివే కళాశాల లోనే మున్న కూడా చదువుతాడు. గుడ్డు పండిట్ కి మున్న లైఫ్ స్టైల్ అంటే చాల ఇష్టం, అతనికి బాడీ బిల్డర్ కావాలి అనేది కల, బబ్లు కి సివిల్స్ వ్రాయాలి అనేది గోల్ అయితే ఆర్ధిక స్థోమత దృష్ట్యా ఒక బ్యాంకు ఉద్యోగం సంపాదించాలి అనే గోల్ పెట్టుకుంటాడు. ఈ రెండు పాత్రలు సినిమాకి అత్యంత కీలకం.


         అఖండ త్రిపటి భార్య చనిపోతే తనకన్నా వయసులో చిన్నది అయిన ఒక పేద మహిళను పెళ్లి చేసుకుంటాడు.  ఈ చిత్రం లో ఇవిడది ఒక ఘట్టం.

చిత్రం నలుగు ఘట్టాలుగా  విభాజించాపడింది :


  1. క్రైమ్ 
  2. రొమాన్స్
  3. యాక్షన్ 
  4. ఎమోషన్ 
అఖండ త్రిపాటి తనకన్నా వయస్సు లో చాల తక్కువ ఉన్న మహిళను పెళ్లి చేసుకోవటం వలన ఆమెకు శారిరిక సుఖం ఆమె కోరుకునంతగా ఇవ్వలేకపోతడు, అందుకుగాను ఆమె అదే ఇంట్లో పని చేసే వంట వాడితో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది.

త్రిపాటి వంశికులకు  మరియు ఠాగూర్  వంశికులకు పూర్వం నుంచి మిర్జాపూర్ మీద ఆధిపత్య పోరు ఉంటుంది . అఖండ త్రిపాటి తండ్రి సత్యానంద్ త్రిపాటి అప్పటి తన ప్రత్యర్దులను రతి శంకర్ శుక్ల అనే తన నమ్మకస్తుడు సహాయముతో  ఠాగూర్ ల ను హతమార్చి మిర్జాపూర్ సొంతం చేసుకుంటాడు, తన వారసులగా మున్న మరియు అఖండ త్రిపాటి ని ప్రకటిస్తారు తప్ప శుక్ల పేరు నమ్మకస్తుడుగా మాత్రమే ప్రస్తావిస్తాడు సత్యానంద్ త్రిపాటి. అది జిర్నిచుకోలేని శుక్ల త్రిపాటి కుటుంబ సభ్యులలో ఒకరి మీద ఎటాక్ చేయిస్తాడు, దాడి గురి అయిన వ్యక్తీ ని పలకరించే నెపముతో అతను మరోసారి దాడి కి ప్రయత్నం చెయ్యగా సత్యానంద్ త్రిపాటి వెన్నుముక్క విరుగుతుంది, అతను వీల్ చైర్ కి అంకితం అవుతాడు.   శుక్ల ఠాగూర్ లా మీద తన పోరాటానికి సహాయం చేసిన కృతజ్ఞతతో సత్యానంద్ త్రిపాటి ఒక ప్రాంతం నిర్దేశించి, అ ప్రాంతం శుక్ల కీ కేటాయించి క్షమించి మిర్జాపూర్ నుంచి వెలి వేస్తాడు.

కానీ శుక్లకి మాత్రం ఎప్పటికి అయిన మిర్జాపూర్ సొంతం చేసుకోవాలి అనేది దృఢ మైన సంకల్పం. 

ఎప్పుడు అయితే రమాకాంత్ పండిత్ మున్న కేసు ఒప్పుకున్నాడో, పోలీస్ వారి లో త్రిపాటి నమ్మకస్తుడు వచ్చి అఖండ త్రిపాటి కి సమాచారం చేరవేస్తాడు. మున్న తన సమస్యను తనే పరిష్కరించుకుంటాను అని చెప్పి తన స్నేహితులతో కలిసి  రమాకాంత్ ఇంటికి వెళ్లి అతన్ని వారి కుటుంబ సభ్యుల ముందల అసభ్యముగా తిడతారు, అలాగే రమాకాంత్ కూతురుని అసభ్యముగా తిడతారు, తన తండ్రిని చెల్లి ని అసభ్యముగా సంభాషించటం చూసి తట్టుకోలేని బబ్లు, గుడ్డు మున్న కి  దేహ శుద్ది చేస్తారు. విషయం తెలుసుకున్న అఖండ  త్రిపాటి తన మనుషులను బబ్లు మరియు గుడ్డు ని తన వద్దకు  తీసుకోని రమ్మని చెప్పి ఆదేశిస్తాడు.

విషయం తెలుసుకున్న త్రిపాటి వారిని క్షమించి తన వద్ద పని లో చేరమని ఆదేశిస్తాడు, పని లో చేరకపోతే తన తండ్రి వ్యవహార శైలి తో త్రిపాటి వలన  కుటుంబానికి ప్రమాదం అని భావించి తప్పక ఒప్పుకుంటారు . ఇది జీర్ణించుకోలేని మున్న కి త్రిపాటి కి ఈ విధముగా చెప్పుతాడు నిన్ను కొట్టినవారు జివితంతం ని క్రిందనే పని చేస్తున్నారు దానికన్నా వారికీ పెద్ద శిక్ష వారికీ   ఏమి ఉంటుంది అని - అయిన సరే మున్న వారిని క్షమించలేక వారి మీద అక్కసు పెంచుకుంటాడు అందుకు అదనముగా మున్న ప్రేమించిన స్వీటీ  గుడ్డు ని ప్రేమిస్తుంది, స్వీటీ చెల్లి మున్న కి వ్యతిరేకముగా స్టూడెంట్ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేస్తుంది, ఆమెకు బబ్లు తోడుగా ఉంటాడు. 

రమాకాంత్ పండిత్ మిర్జాపూర్ లో జరిగే అక్రమాలు గురించి ఉన్నత అధికారులకు ఉత్తరాలు ద్వార ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అందుకుగాను  మౌర్య  అనే ఐ పి ఎస్ అధికారిని త్రిపాటి మీదకు వదులుతారు.  

మరో వైపు రాజకీయ ఒత్తిడులు తో అఖండ త్రిపాటి  తన వ్యాపారం వృద్ది చెయ్యవలిసిన పరిస్థితి ఏర్పడుతుంది, గోతి కడ నక్క లాగా కూర్చున్న శుక్ల ని రాజకీయ నాయకుడు చేరతియ్యటం తల నొప్పిగా మారుతుంది.     బబ్లు తన బుద్ది భలం తో గుడ్డు తన కండ భలం తో వ్యాపారాన్ని వృద్ది చేస్తారు.  వారి ఎదుగుదల చూసి, తండ్రి తనకు అవమానం చేస్తున్నాడు అని భావించిన మున్న తండ్రి ని తన ప్రాణ స్నేహితుడు కంపౌండర్ సహాయంతో హతం చెయ్యాలి అని చూస్తాడు, కానీ కధ అడ్డం తిరిగి తన ప్రాణ స్నేహితుడు దొరికిపోతాడు.  స్నేహానికి విలువ ఇచ్చి మున్న పేరు భయట పెట్టకుండా కంపౌండర్ త్రిపాటి చేతిలో బందీగా చిత్రహింసలకు గురి అయ్యి చివరికి మున్న తన స్నేహితుడుని తనే బలవంతముగా చంపవలిసిన పరిస్థితి ఏర్పడుతుంది.  


మౌర్య (పోలీస్) చేసిన దాడితో గుడ్డు  మరియు బబ్లు, త్రిపాటి సలహా మీద అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. కానీ గుడ్డు తన శారిరికముగా దృడముగా ఉండటానికి ఉపయోగిస్తున్న మందులు వికటించి కొంచెం క్రురముగా తాయారు అవ్వుతాడు, దాక్కొని కూడా వ్యాపారం చేస్తాడు, శుక్ల అధినం లో ఉన్న ప్రదేశం లోకి వెళ్లి శుక్లని త్రిపాటి ఆదేశం లేకుండా హత్మరుస్తారు బబ్లు, గుడ్డు. వివరణ అడిగిన త్రిపాటి కి తల బిరుసు సమాధానం చెప్పటంతో త్రిపాటి అతని తండ్రి లో బబ్లు మరియు గుడ్డు మీద భిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  అ తరువాత బబ్లు లో మార్పు మొదలవుతుంది, ఇంట్లో నుంచి గెంటివేసిన తండ్రి వద్దకు తిరిగి వెళ్తాడు, గుడ్డు కి స్వీటీ తో పెళ్లి చేస్తాడు.


ఈ మధ్యలో సత్యానంద్ త్రిపటికి కి కోడలు కొనసాగిస్తున్న అక్రమ సబంధం గురించి తెలిసి ఆమెను ప్రాణ భయముతో బెదిరించి,  వంట వాడి మర్మ అంగాన్ని కోడలి చేతనే ఖండింప చేసి , త్రిపాటి వంశం కోడలు త్రిపాటి వంశికుడికే జన్మ ని ఇవ్వాలి అని ఆమెను లోబరుచుకుంటాడు.

చనిపోయిన కంపౌండర్ ఫోన్ లో బబ్లు మరియు గుడ్డు త్రిపాటి ని చంపవలిసింది గా సూచించారు అని చెప్పటానికి వాయిస్ ఉంది అని మున్న పుకారు సృష్టించి తండ్రి నోటి తో వారిని హతమార్చే విధముగా దేశాలు తీసుకోని బబ్లు ని , గుడ్డు భార్య స్వీటీ ని చంపేస్తాడు మున్న, అ దాడి నుంచి గుడ్డు మరియు స్వీటీ చెల్లెలు తప్పించుకుంటురు. మున్న ఒక డాన్ యొక్క కూతురు పెళ్లి లో ఈ దాడి చేస్తాడు, మున్న బబ్లు, గుడ్డు  మీద చేసే దాడి లో డాన్ యొక్క అల్లుడిని చంపేస్తాడు, అందుకు గాను డాన్ యొక్క మనుషులు మున్న మీద దాడి చేస్తారు.

త్రిపాటి తేరుకొని పోలీస్ ఆఫీసర్  మౌర్య ని హతమర్చటానికి వ్యూహం రచించి అతన్ని బందిస్తాడు - శుక్ల కొడుకు ప్రతికర జ్వలలో రగిలిపోతుంటాడు. ఇక్కడితో సీజన్ వన్ ముగుస్తుంది.  


విశ్లేషణ : అంత బాగుంది కానీ సెన్సెర్ లేకపోవటం వలన కుటుంబం తో చూడాలి అంటే ఇబ్బందే -హింస  కి అలవాటు పడితే చివరికి హింస తో నే చావాలి అనే విధముగా ఉంటుంది కాన్సెప్ట్ . 3/5

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics