ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ లో లంచం ఇవ్వందే పని జరగదా ? సి బి ఐ ఏ సి బి ఫిర్యాదు లో ఏమున్నది ?



ఇన్సురెన్స్ క్లెయిమ్ చెయ్యాలి అంటే చేతులు తడపక తప్పదా ? మరి ముఖ్యముగా నేషనల్ ఇన్సురెన్స్  కంపెనీ లో ! నిజమేనండి సామన్యుడు అయితే చేతులు తడపాలి, ఎదురు తిరిగినవారు పోరాడలిసిందే. అలాగే తన పోరాటం మొదలపెట్టారు పశ్చిమగోదావరి జిల్లా, గణపవరము గ్రామ నివాసస్తుడు  శంకు అమ్మిరాజు గారు.


అసలు ఏమి జరిగింది :  తన ఫోర్డ్ పిగో కారు ప్రమాదానికి గురి అయ్యి బాగా దెబ్బతింది, తను ఇన్సురెన్స్ చేయించుకున్న నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ కి క్లెయిమ్ పెట్టారు, క్లెయిమ్ ఇచ్చిన మొత్తం మీద నష్టం భర్తీ కాదు అని చెప్పి తన న్యాయవాది చేత నోటీసు ఇచ్చారు.  తరువాత కంపెనీ వారి తో రాజి కుదుర్చుకొని రూ.69000/- కి గాను ఏలూరు డివిజన్ ఆఫీసర్ వద్ద క్లెయిమ్ కి సమ్మతం తెలియ చేసారు.  అయితే ఎన్ని రోజులు అయిన క్లెయిమ్ మొత్తం తన కు జమ కాకపోవటం తో అయన డివిజన్ ఆఫీసర్ ని కలవగా తనకి క్లెయిమ్ లో 25% ఇస్తే తను తన ఉన్నత అధికారులతో మాట్లాడి క్లెయిమ్ మొత్తం అమ్మిరాజు కి ఇచ్చే విధముగా చూస్తాను అని ఒత్తిడి చేసినట్టు సిబిఐ ఏ సి బి వారికీ ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం ఏ ఫై అర్ రిజిస్టర్ చేసే విచారణ చేపట్టారు.

పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్ళు తప్ప అనే దానికి ఇది ఒక నిదర్శనం. 100 మంది ఇన్సురెన్స్ చేయ్యిన్చుకున్న వాళ్ళ లో 75% ఈ విధముగా బాధించపడినవారే.  నా టైం బాగోలేదు అని చెప్పి  నిరాశ నిస్పృహతో అమ్మి రాజు చేతకాని వాడి లాగా కూర్చోలేదు. ఇన్సూరెన్స్ కట్టేదే ప్రమాదం జరిగినప్పుడు , అ ప్రమాదం మిగిలిచిన ఆర్ధిక చేదు అనుభవాలనుంచి భయటపడటానికి - అది ఇన్సురెన్స్ కంపెనీ యొక్క బాధ్యత . పలన కంపెనీ కి ఇన్సురెన్స్ ఎందుకు కట్టాలి అని మనం నిర్ణయిన్చుకుంటము అది వారి మీద మనకి ఉన్న భరోసా . మరి వారె గడ్డి మేస్తే - అమ్మి రాజు పోరాడిన విధానమే కరెక్ట్.
      




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image


Advertisement