Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Sunday, 18 November 2018

మరి ప్రధాన ప్రతిపక్ష నేత పైన దర్యప్తు చేసింది సి బి ఐ సంస్థే కదా !     

పలు రాష్ట్రాలలో సి బి ఐ నిర్వీర్యం. అందుకు ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అని ప్రత్యేకించి ఎవరికి చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం డిఫెన్సు లో పడింది. సి బి ఐ సంస్థ ఆరోపణలు ఎదురుకుంటున్న వలన  మేము సి బి ఐ కి సమ్మతి విరమించుకుంటున్నము అని చెప్పి కొన్ని రాష్ట్ర ప్రభుత్వలు తేల్చి చెప్పినవి, అందులో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ తేర వెనుక వాదన వేరు, సి బి ఐ కేంద్ర ప్రభుత్వం అదుపు అజ్ఞాలలో ఉంది, వారు చెప్పినట్టు ఆడటానికి గంగేరేద్దు ముసుగు వేసుకున్న సంస్థ గా చిత్రీకరణ జరుగుతంది.


కేంద్ర ప్రభుత్వం అనటం కన్నా, బి జే పి చేతిలో కీలు బొమ్మ లాగా ఈ సంస్థ పని చెయ్యటానికి అక్కడ కీలక పదవులలో ఉన్న ఉన్నత స్థాయి ఉద్యోగులు మీద పలు ఆరోపణలు చేసి పదవి నుంచి తప్పించి తాత్కాలికముగా తమకు అనుకూలముగా ఉన్న వారిని కీలక పదవులలో నియమించారు అనే ఆరోపణలు లేక పోలేదు. రాఫాలే స్కాం లో తీగ లాగి ఫైల్ తమ వద్ద ఉంచుకున్న అధికారులు, తమ కి వ్యతిరేకమనుకున్న ప్రతి అధికారి మీద వేటు వేస్తూ, అనుకూలము అనుకున్న వారికీ కీలక పదవులు లంచానలగు సమర్పించి రాఫాలే గురించి ఎన్నికల సమయం లో రచ్చ కాకూడదు అని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అనేది మరో వాదన .

ఏది ఏమైనా ఇప్పటివరుకు నివురుగప్పిన నిప్పు లాగా ఉన్న భారత దేశ అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు రచ్చన పడింది.  ప్రపంచానికి ఒక విషయం తెలిసింది, భారత దేశం లో పోలీస్ వ్యవస్థ కానీ, దర్యప్తు సంస్థలు కానీ అధికారం లో ఉన్న పార్టీ ల యొక్క సభ్యులతో 5 సంవత్యరాలు సంసారం చెయ్యవలిసిందే, అ సంబందానికి మీరు ఎటువువంటి పేరు పెట్టిన ఇది వాస్తవం. ఒక వేళా ఏ అధికార పార్టీ  నాయకుడికి అయిన  సంబందిత అధికారి నచ్చకపోతే , ఇష్టం లేని మొగుడి తో సంసారం చెయ్యలిసిందే.  మొగుడుకి పెళ్ళాం  నచ్చకపోతే ఎన్ని ఇబ్బందులు పెడతాడో అ అధికారిని అ నాయకుడు అన్ని ఇబ్బందులకు గురి చేస్తాడు.

ఇంకా దర్యప్తు సంస్థల లో ఉద్యోగులు ఎవరు అధికారములోకి వస్తే వారితో సహజీవనం సాగించావలిసిందే, ఐదు సంవత్యరాలకి ఒక్కసారి ప్రభుత్వం మారితే, కొత్తవారు కదా ! అని మొహమాటపడకుండా సహజీవనం చేసుకొని పోవాలి. ఇప్పటి వరుకు భారత దేశం లో అందరికి తెలిసిన అతి పెద్ద రహస్యం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి బహిర్గతం అయ్యింది. 

ఇక్కడ మాత్రం ఒక విషయం వాస్తవం భారత దేశం లో అధికారం ఉంటె ఏ పని అయిన చెయ్యవచ్చు, సి బి ఐ సంస్థ ఎదురుకుంటున్న పరిణామాలే ఇందుకు మంచి ఉదాహరణ.

మరి ప్రధాన ప్రతిపక్ష నేత  పైన దర్యప్తు చేసింది  సి బి ఐ సంస్థే కదా ! ఒకవేళ  కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావం ఈ సంస్థ పైన ఉంటె, అప్పుడు జరిగిన విచారణ కూడా అనుమానాస్పదమే అని అర్ధమా?  రాజ్య అధికారి చేతిలో, వారి భటుల చేతిలో , వారి బానిసల చేతిలో బానిసత్వం చేస్తున్న దర్యాప్తు సంస్థలు స్వేచ్చ వాయువులు పిల్చేది ఎప్పుడో  ? వార్డ్ మెంబెర్ దగ్గెరనుంచి, సామాన్య కార్యకర్త వరుకు రాష్ట్ర దర్యాప్తు సంస్థల లో పని చేస్తున్న ఉద్యోగుల మీద రువాబు చేస్తున్న ఈ పరిస్థితి నుంచి భయట పడే రోజు ఎప్పుడు వస్తుంది ? ఖచ్చితంగా ఒక రోజు ఈ పరిస్థితులు మరతవి అని ఆశించటం తప్ప ఒక సామాన్యుడు ఏమైనా చెయ్యగలడా?  ఒకప్పుడు ప్రజలు భూములు కోసం పోరాటం చెయ్యవలిసి వచ్చింది, ఒక వర్గం వారికీ వారి హక్కులు గురించి పోరాటం చెయ్యవలసి వచ్చింది, అలాగే ఇప్పుడు దేశ అంతర్గత బానిస వ్యవస్థ నిర్మూలనకు ఒక పోరాటం రావాలి అని ఆశించటం తప్ప !

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image