వై యస్ ఆర్ సిపి & టి డి పి సెర్చ్ రికార్డు

Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Friday, 30 November 2018

శాంతి కోసం ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్
       పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం మరియు సైన్యం ఒక మాట మీద నడుస్తున్నాయి, భారత దేశం తో సత్య సంబంధానికి కలిసి ఒక అడుగు ముందలకి వేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, ఇంకా జరిగింది ఏదో జరిగి పొయ్యింది, ఇప్పుడు కొత్తగా కొత్త సత్యసంబంధాలు మొదలపెడదము మొన్న కర్తర్పూర్  లో జరిగిన ఒక బహిరంగ సభ లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు. 

ఇమ్రాన్ ఖాన్  సంధి ప్రయత్నం మొదల పెట్టారు. అయన ప్రసంగించిన అ సమావేశం లో పాకిస్తాన్  ఆర్మీ చీఫ్ జనరల్ క్యమార్ బజ్వా కూడా హాజరు అయ్యి ఉన్నారు. దిని అర్ధం పరిస్థతులు మారుతున్నాయి, భారత దేశం మరియు పాకిస్తాన్ కి మధ్య సన్నిహిత సంబంధాలు కోసం పాకిస్తాన్ తన వంతు ప్రయత్నం మొదలు పెట్టింది. ఎటు వంటి అవంచనియ సంఘటనలు జరగవు అని చెప్పి పాకిస్తాన్ మళ్ళి  ముందుకు వచ్చినట్టే.


        అలాగే నిన్న మళ్ళి భారత దేశానికీ పిలుపునిచ్చారు మనం కొత్తగా సత్యసంబంధాలు మొదలు పెడదాము అని చెప్పి. మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుందాము అనే కోణం లో మాట్లాడుతున్నారు, మా దేశం వేరే వారి మీద తీవ్రవాదాన్ని ఉసిగొలిపే దేశం కాదు అని చెప్పుకొచ్చారు. నిన్న భారత దేశ విలేఖరలిని పిలిచి సమావేశం ఏర్పరిచి " జరిగిన విషయాలకి నేను బాధ్యుడిని కాదు, నేను చేసిన వాగ్ధనలికి నేనే బాద్యుడిని, ఇక మీదట అలాంటివి జరిగితే, నేను మాట తప్పితే నేనే బాధ్యత వహిస్తాను అని అయన చెప్పారు.

      కానీ భారత దేశం మాత్రం సందిగ్ధ అవస్థ లో పడింది, పాకిస్తాన్ ఇంతకముందు ఇలాంటి ఒప్పందాలు ఎన్నో చేసుకుంది, వాటిని పాటించలేదు. అక్కడ సైనిక వ్యవస్థ మీద రాజకీయ నియంత్రణ లేదు అనేది భారత దేశం యొక్క ధృడమైన నమ్మకం. సంధి అని చెప్పి మళ్ళి తీవ్రవాద చర్యలు మొదలపెడితే ఏంటి పర్యవసనం అనే సందిగ్ధ అవస్థ లో భారత దేశం పడిపోయింది. బి జే పి ని రాజకీయ సందిగ్ధతలో ఉంచి, ఏ నిర్ణయం తీసుకున్న ఇంటా,  భయట రచ్చ చెయ్యాలి అనే ఆలోచనలో ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు అనే వాదనలు లేకపోలేదు. పాకిస్తాన్ తో సత్యసంబంధం అంటే హిందూ మతతత్వ పార్టీ గా ముద్ర వేసుకున్న పార్టీ యొక్క అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి, కాదు అంటే శాంతి కోరుకున్న పాకిస్తాన్ ని కి వెన్ను చూపారు అనే విమర్శలు వస్తాయి. కాలమే చెప్పాలి జరిగేది ఏమిటి అని.   

       

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image