ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా పంచాయతి శాఖ లో 3 కోట్ల అవినీతి - నామమాత్రముగా విచారణ - విచారణ ను నిరుగార్చిన బడా నేతలు


పశ్చిమగోదావరి జిల్లా  పంచాయతి రాజ్ శాఖ లో 3 కోట్ల నిధులు దుర్వినియోగం.  ఈ విషయం సంబంధిత మంత్రిగారికి సామజిక మాధ్యమం ద్వార ఫిర్యాదు అందింది అనేది విశ్వాసనియమైన సమాచారం, ఫిర్యాదు చేసిన వారు  వారి చర్య గురించి వేచి చూస్తున్నారు. లోతుగా పరిశిలన చేస్తే బడా నాయకులు ఈ అవినీతి కి పాలుపడిన వారికీ కొమ్ముకసినట్టు సమాచారం.  



వరుస సంఖ్యా  డివిజన్  మండలం  గ్రామం  నగదు 
1 జంగారెడ్డి గూడెం  బుట్టాయి గూడెం  కామయ్య కుంట  821061-00
2 " " " " జంగారెడ్డి గూడెం  పటాన్న పాలెం  261675-00
3. " కేతవ  కేతవరం  328300-00
4. " " అక్కం పేట  050000-00
5. " " అమ్మపాలెం  828936-00
6. కొయ్యలగూడెం కొయ్యలగూడెం 7500000-00
7.  ఏలూరు   ఏలూరు రూరల్   శనివారపుపేట   3500000-00
8. " " వెంకటాపురం  4000000-00
9. నరసాపురం   పాలకొల్లు రూరల్  పాలకొల్లు  5000000-00
10. కొవ్వూరు  యలమంచిలి  చెంచినాడ  2500000-00
----- ----- ----- ----- -----
----- ----- ----- ----- -----
----- ----- ----- ----- -----


జంగారెడ్డి గూడెం డివిజన్ అధికారి,  జిల్లా పంచాయతి అధికారికి (డి పి ఓ ) కి  ఇచ్చిన నివేదిక లో బుట్టాయిగూడెం మండలం కామయ్యకుంట పంచాయతి లోని నిధులు రూ.821061-00 దుర్వినియోగ పరిచారు అని చెప్పి గ్రామ కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ అందుకు  బాధ్యులు అని చెప్పి 28-05-2018 తేదిన  నిర్దారించి  తెలియచేసారు అనేది విశ్వాసనియమైన సమాచారం.   

అలాగే పట్టన్నపాలెం, కేతవరం, అక్కంపేట గ్రామపంచాయతి లకి సంబందించిన నిధులు రూ. 689776-00 అ అ గ్రామా కార్యదర్శులుగా పని చేస్తున్న పంచాయతి కార్యదర్శకులు మరియు సర్పంచులు నిధులు దుర్వినియోగ పరిచినట్టు నిర్దారిస్తూ వారిని బాధ్యులుగా గుర్తించిన జంగారెడ్డి గూడెం డివిజన్ అధికారి   DLPO ది.11-08-2018 వ తేదిన జిల్లా పంచాయతి అధికారికి నివేదికను ఇచ్చారు .   

అమ్మపాలెం గ్రామా పంచాయతి లో నిధులు రూ.828336/- దుర్వినియోగనికి అ గ్రామ పంచాయతి కార్యదర్శి బాధ్యుడు అని జంగారెడ్డి గూడెం డివిజన్ అధికారి   DLPO , జిల్లా పంచాయతి అధికారికి నివేదిక పంపించారు అనేది విశ్వాసనియమైన సమాచారం. 

నిడదోవాలు, తణుకు , మండలలో గ్రామ పంచాయతి నిధులక 50 లక్షల వరుకు దుర్వినియోగం చేసారు అనే విషయల పైన నివేదిక జిల్లా పంచాయతి అధికారికి వెళ్ళింది కానీ "ఎవరి వాటాలు ఎంతో లెక్క తెలియక" కొంత మంది ఉన్నత  అధికారులు కార్యదర్శులకు మరియు సర్పంచులకు ఒక అవకాశం  కల్పించి ప్రజలమీద ఎక్కి తొక్కటానికి, మరోసారి వారు పంచాయతి  సొమ్ము బొక్కటానికి, లంచానప్రయముగా చేసే అనధికారిక సంసారానికి కట్నకానుకల విషయం లో సర్దుబాటు జరగని ఇద్దరు పులి లింగాలు ఈ విషయము పైన విచారణ జరపకుండా, అత్తా వారు పెట్టె కొత్త సమనుకోసం ఎదురు చూస్తు, పెళ్ళాం తో  సంసారం చెయ్యని   కొత్త పెళ్ళికొడుకులు లాగా  అ నివేదికల మీద ఎటువంటి  చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న వ్యవహార శైలి చాల అనుమానాలకి తావు తీస్తుంది.

నామా మాత్రముగా సస్పెన్షన్ గురైన ఒకే ఒక  కార్యదర్శి అ ఉన్నత అధికారులకు రుచించేలగా ఏమి పెట్టలేదో ........బాధ్యులు అయిన మిగతా గ్రామా కార్యదర్శులు వారి మీద చర్యలు తీసుకోకుండా అంతలగా రుచించే లాగా  ఏమి పెట్టారు అర్ధం కానీ పరిస్థితి ! కొంత మంది బడా నాయకుల హస్తం ఈ విషయం లో ఉన్నది అనే గుస గుసలు వినిపిస్తున్నాయి  !


ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద  స్పందించిన కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా జిల్లా సభ్యులు మామిళ్ళపల్లి వసంతరావు గారు ఈ విషయాన్ని ఉన్నత అధికారుల, మరియు సంబందిత శాఖ మంత్రి గారి ద్రుష్టి కి తీసుకోని వెళ్ళారు వేచి చూడాలి ఉన్నత అధికారులు ఏ విధముగా స్పందిస్తారో .












 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement