Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Wednesday, 3 October 2018

వేతనం లేని నిజమైన కార్మికులు - స్ట్రింగర్ స్ - అందుకే - నిజమైన వార్తలు భయటకు రానివ్వకుండా వ్యవస్థికరణ చిత్రీకరణ !     

జర్నలిజం గురించి చాల మంది సామాన్యులకి తెలియని చాల విషయాలు ఉన్నాయి. మీడియా గురించి విమర్శించే వారు పోరాడలేని వాస్తవిక సంఘటనలు, దయనీయమైన పరిస్థితులు వెలుగులోకి రాని యదార్ధ ఘటనలు ఎన్నో.

ఒకప్పుడు మీడియా అంటే వేరు , అ విలువులు వేరు ఎందుకంటె అప్పుడు పనికి తగిన వేతనం చెల్లించే వారు. ప్రస్తుతం వార్త ప్రపంచం కూడా విస్తరించింది. అందుగురించి మొత్తం పాత్రికేయ వ్యవస్థను తప్పు పట్టనవసరం లేదు.

ఇక్కడ ఎవరు ఎవరి మీద జాలి పడనవసరం లేదు. ఎందుకంటె నిజంగా పాత్రికేయ వ్యవస్థ చిన్నభిన్నం అయితే అ ప్రభావం సమాజం లో ప్రతి ఒక్కరి మీద పడుతుంది, ప్రతికూల ప్రభావం!.మాకున్న సమాచారం మేరకు మండల స్థాయి లో పని చేసే పాత్రికేయులకు - స్ట్రింగర్ స్ కి 3 ప్రముఖ వార్త సంస్థలు తప్ప మిగత ఏ సంస్థ వేతనం చెల్లించవు. కానీ వారు మాత్రం ప్రతి వార్త సేకరించి సంస్థలకి అందించాలి. విరే స్ట్రింగర్ స్, విరే ప్రకటనలు సమకుర్చాలి.   ఒక మండలనికి  ఒక స్ట్రింగర్ సమయానికి వెళ్లి వార్త సేకరించాలి లేక పోతే చివాట్లు తప్పవు, వదిలేద్దమా నచ్చిన వృత్తి - పులి మీద సవారీ!.

అక్రిడేషణ్ : స్థానిక అధికార యంత్రాంగం వారి తప్పిదాలు భయటకు రాకుండా స్ట్రింగర్ స్ ని తొక్కి పట్టడానికి,  ప్రభుత్వ లబ్ది ని వారికీ చేరకుండా తొక్కి పట్టి ఉంచుతారు. కొంత మంది  అధికారులు కమిషనలకి  కక్కుర్తి పడి, చేసిన వెధవ పనులు గురించి అరా తీసినందుకు, మరొక పనికిరాని వెధవను అడ్డుపెట్టుకొని స్ట్రింగర్ ల మీద తప్పుడు కేసులు పెట్టించటం వలన  అక్రిడేషణ్ లిస్టు లో నుంచి తోలిగించాపడిన జర్నలిస్ట్ లు చాల మంది. 

ఈ పరిణామాలు మనిషి లో ఉండే నిజాయతిని చంపేసి కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ఇది ఒక మానసిక వ్యధ. ఈ విషయం ప్రక్కన పెడితే యాజమాన్యం పెట్రోల్ ఖర్చు కూడా  ఇవ్వదు, మరో ప్రక్క వార్త భయటకు వస్తుంది అనే సమాచారం ఉంటె చాలు తప్పుడు కేసులు, అవినీతి పరులు అనే ముద్ర, దౌర్జన్యం .   అప్పటి అవినీతికి  కొమ్ము కాస్తారు అనే వారికీ అధికారుల మెప్పు.

కొత్త నీరుని ఈ విధముగా తోక్కేస్తున్నారు. క్రింద స్థాయి నుంచి విలేఖరలకు కనీస వేతనం చెల్లిస్తే  ఏ వార్త దాగదు. మీడియా మీద ప్రస్తుత సమాజ అభిప్రాయం మారటానికి ఎంతో సమయం పట్టదు.

అత్యాశ ఉన్నవారి విషయం చెప్పటానికి మా సంస్థ ద్వార కన్నా ప్రజాప్రస్థానం అనే పత్రిక చదివి  తెలుసుకోవటం మంచిది. అత్యాశ ఉన్న వారిని మార్చాలి అంటే కొత్త నిరు అవసరం, అ కొత్త నిరుకు అడ్డుకట్ట ఆర్ధిక పరిస్థితులు, తప్పుడు కేసులు.

నిజంగా పాత్రికేయ వృత్తి ని నిజయతిగా నిర్వర్తించే వారికీ, ప్రాధమిక విలువలు పాటించేవారి కోసం ఈ ప్రచురణం అందరిని ఉద్దేశించి కాదు.  ఒక అక్షరం లేదా ఒక వార్త యొక్క విలువ ఒక్క మాట లో చెప్పాలి అంటే "గౌరీ లంకేష్ " ఆమె అక్షర ఆయుధానికి ఎంత పదును లేకపోతే, ఈ స్వాతంత్ర భారత దేశం లో ఒక మహిళా మీద ఇద్దరు "నపుంసక" " లింగాలు" దాడి చేసి ఆమె ని హతమరుస్తారు!. అక్షరం ఆయుధమే, కానీ సైనికుడిని పట్టించుకునేది ఎవరు ? 
Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image