ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

అంత భద్రత మధ్య కోడి కత్తి ఎలాగా ? ప్రధాన ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి వెనుక ఉండి నడిపించిది ఎవరు ?



     

ఇక్కడ దాడి జరిగింది వాస్తవం, ఆయనొక ప్రధాన ప్రతిపక్ష నేత, అది విమానాశ్రయం లో సెక్యూరిటీ మధ్య. అసలు కోడి కత్తి అంత సెక్యూరిటీ మధ్య ఎలాగా వచ్చింది, పోనీ హోటల్ లో ఉపయోగించకోవటానికి తెచ్చుకున్న కత్తి అని అనుకుందామా ? అని అనుకుంటానికి అది కూరగాయలు కట్ చేసే కత్తి కాదు.  మెటల్ డిటెక్టర్స్ అక్కడ పని చెయ్యటం లేదా ? అంటే అక్కడ సిబ్బంది ని ఎవరు అయిన లోబరుచుకోగలరు అనేకదా దిని అర్ధం. జగన్ మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడి మీద సోషల్ మీడియా లో భిన్న కధనాలు వినిపిస్తున్నాయి .

ఏది వాస్తవమో కాదో ఎవరికి తెలియదు, ప్రజలలో భిన్న చర్చలు జరుగుతున్నాయి. కానీ అసలు విషయం ఏమిటి అంటే దాడి ఏ విధముగా జరిగిన ఎయిర్ పోర్ట్ లో భద్రత లోపం ఉన్నది అనే చెప్పాలి. అంటే ఇప్పుడు జగనమోహన్ రెడ్డి మీద జరిగిన దాడి రేపు ఈ భద్రత లోపల వలన మన ముఖ్యమంత్రి గారి మీద జరగదు అనే దానికి నమ్మకం ఏమిటి?  లేదా ఏదో ఒక మంత్రి మీద జరగదు అని నమ్మకం ఏమిటి ?  దాడి చేసిన అతను ఒక సామన్యుడు అనుకుందాం ! ఒక సామాన్య  వెయిటర్ మెటల్ డిటెక్టర్ ని తప్పించుకొని, భద్రత సిబ్బంది ని తప్పించుకొని ఒక ప్రధాన ప్రతి పక్ష నేత పైన దాడి చేయ్యగాలిగినప్పుడు ఇంకా ఉగ్రవాదులకు ఇక్కడ ఎయిర్ పోర్ట్ లో భద్రత లోపాలు గమనించి , అక్కడ వారిని లోబరుచుకొని  దాడులు చెయ్యటం గురించి ఉహించిన భయనకముగా ఉంటుంది. 


ఒక మనిషికి గాయం అయ్యింది! రక రకాల కధనాలు, ఒకరు పబ్లిసిటీ కోసం అని అంటారు మరొకరు వారె సానుభూతి కోసం చేసారు అని అంటారు, మరొకరు వ్యతిరేక పార్టీ వారు చేయ్యించారు అంటారు.

ముద్దాయి పోలీస్ వారి ముందల ఇచ్చిన స్టేట్ మెంట్  వీడియో రికార్డు చేసారు అని కేసు ని ఇక్కడే నిరు కార్చే ప్రయత్నం - సెక్షన్ 26 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీస్ వారి ఎదుట ఇచ్చిన వంగ్ములన చెల్లదు- అ వంగ్ములన తీసుకునే పద్దతి వేరు. ఊరుకి ముందలే పోలీస్ వారికీ వంగ్ములన ఇచ్చాడు అని చెప్పడం కరెక్ట్ కాదు.

అతను పబ్లిసిటి పిచ్చతో దాడి కి పాలుపడ్డాడు అనే వాదనలు లేక పోలేదు అసలు మొదట వచ్చిన వార్త అదే ! ఒక విషయం మాత్రం ఆలోచించవలిసిన విషయం జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యాపార వేత్త , ఒక రాజకీయ నాయకుడు ఒక వేళా అయన మీద ఆయనే దాడి చేయించుకునే పరిస్థితి ఏర్పడితే " పార్టీ ని గెలిపించు కోవాలి అని పోడిచాను అనే " స్టేట్ మెంట్లు ఇచ్చే ఆకతాయి ని ఎంగేజ్ చేసుకుంటరా?  ఇది వేరొక వైపు వాదన! ఒక వేళా దాడి చేసిన అతని ఎజండా అదే అయితే , వారి పార్టీ కి అంత లాగా  కట్టుపడి ఉన్నవాడు అయితే విషయం భయటకు రానివ్వడు.


ఏ విషయం లో యెంత వాస్తవం ఉందొ ఎవరికి తెలియదు - ప్రజలలో కూడా ప్రశ్నలు తప్ప సమాధానాలు లెవ్వు  ! కానీ ఒక విషయం మాత్రం వాస్తవం  విమానాశ్రయం లో భద్రత లోపం  ఉంది ! అ భద్రత లోపం దేశానికి ముప్పు . పార్టీ లా ప్రస్థావన ప్రక్కన పెట్టి  ఈ దాడి ని ఖండించిన నిమ్మకాయల రాజప్ప గారి సమయస్పూర్తి అభినందనీయం.




 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement